• తాజా వార్తలు

రివ్యూ-ఈ వారం టెక్ రౌండప్


మొబైల్ రంగం నుంచి ఈ- కామర్స్ సంస్థల దాకా సోషల్ మీడియా నుంచి కశ్మీర్ ఎన్నికల వరకు ఈ వారం టెక్నాలజీ రంగంలో జరిగిన కొన్ని కీలక మార్పుల సమాహారం...ఈ వారం టెక్ రౌండప్. 

షియోమీ హెచ్చరికల్లో ఏమీ లేదు..
చైనా ఫోన్ మేకర్ షియోమీ నుంచి వెలువడిని రెండు బ్రౌజర్ యాప్స్ ఇప్పటికీ పేటెంట్ కానప్పటికీ క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటున్నాయని హ్యాకర్ న్యూస్ పేర్కొంది. అయితే ఈ వార్తలను కంపెనీ ఇప్పటికీ విభేదించలేదు. ఎంఐ బ్రౌజర్ సంస్థ నుంచి వచ్చిన రెడ్ మీ స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ ఇన్ బిల్ట్ లో ఉంటుంది. అయితే మింట్ బ్రౌజర్, గూగుల్ ప్లేలో కానీ షియోమీ డివైసులో అందుబాటులో ఉంటుంది. హాకర్ న్యూస్ మాత్రం దీనిని స్ఫూఫింగ్ సమస్యగా పేర్కొంది. నిజానికి యూజర్లు ఫిషింగ్ లేదా ప్రమాదకరమైన కంటెంట్ ను వెబ్ సైట్ URLలను నియంత్రించడానికి అనుమతిస్తుంది. ఈ సమస్య కేవలం వెబ్ బ్రైజర్లతోపాటు చైనాలోని షియోమీ స్మార్ట్ ఫోన్లతో డిస్ట్రిబ్యూట్ చేసిన వెర్షన్లలో ఉండవు. అమెజాన్ సంచలన నిర్ణయం...ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం 3,236 ఉపగ్రహాలు.

అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఏకంగా 3,236 ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రాజెక్ట్ కుయిపెర్ ను ప్రారంభించింది. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ అవసరాలకు నోచుకోని ప్రపంచంలోని పలు ప్రాంతాలకు వీటి ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఈ ప్రాజెక్టు ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. 
బిజూ జనతా దళ్ హామీలు..
ఒడిశాలో బిజూ జనతా దళ్ అధికారంలో ఉంది. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్ర యువజన ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలని...మెరిటోరియస్ విద్యార్థుల స్కిమ్ కోసం ఉచిత ల్యాప్ టాప్ లను అందించాలని, వీడియో మరియు మినీ -థియేటర్ సౌకర్యాలతో కమ్యూనిటీ హాళ్లను ఏర్పాటు చేయాలని నవీన్ పట్నాయక్ నేత్రుత్వంలోని ప్రభుత్వం వాగ్దానం చేసింది. 
1. ల్యాప్ టాప్ పథకం విస్తరించడం
2. నైప్యణం, ఉపాధి, పరిశ్రమలు,
3. కమ్యూనిటీ హాల్ లేదా కల్యాణ్ మండప్ పేరుతో పథకాలను ప్రజలకు చేరువయ్యేలా చేస్తోంది. 
ఆర్బిఐ నిబంధనలకు అనుగుణం వ్యవహరిస్తున్న వాట్సాప్.
చెల్లింపుల సంబంధిత డేటా లోకల్ స్టోరేజిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా వాట్సాప్ పనిచేస్తోందని ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. వాట్సాప్ 2018 ఫిబ్రవరి నుంచి బీటా మోడ్లో పేమెంట్ సర్వీసును అమలు చేస్తోంది. అయితే దేశంలో నిల్వ చేయబడ్డ అన్ని చెల్లింపుల సంబంధిత డేటా అవసరయ్యే స్థానీకరణ నియమాలకు అనుగుణంగా ఉండకపోవడంతో పలు ఇబ్బందులను ఎదర్కొంటుంది. 
న్యూస్ ఫీడ్ మార్చేస్తోన్న ఫేస్ బుక్...కంట్రోల్ మీ చేతుల్లోనే...
ఫేస్ బుక్ న్యూస్ ఫీడ్ మార్చేస్తోంది. తమ యూజర్ల ప్రైవసీ కోసం కొత్త కొత్త అప్ డేట్స్ ను అందుబాటులోకి తెస్తోంది. న్యూస్ ఫీడ్ కంట్రోల్ చేసేందుకు ఫేస్ బుక్ కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. మీ ఫ్రెండ్స్ అకౌంట్, పేజీలు, గ్రూప్ ల నుంచి షేర్ అయిన పోస్టులు, మీ అకౌంట్ న్యూస్ ఫీడ్ లో ఈజీగా కంట్రోల్ చేయోచ్చు. 
చైనా ఇ-కామర్స్ కంపెనీలకు  చెక్...పన్నలు ఎగ్గొట్టే సంస్థలకు ఝలక్
భారత్ లో చైనా వస్తువులను చాలా డిమాండ్ ఉంటుంది. తక్కువ ధరకే లభిస్తుండటంతో చాలా మంది ఆన్ లైన్ లోనే కొనేస్తున్నారు. ఇలా నిత్యం లక్షకు పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తోన్నాయి చైనా ఈ కామర్స్ కంపెనీలు. అంతే కాదు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. గిఫ్ట్ ల పేరుతో కస్టమ్ డ్యూటీకి పంగనామం పెడుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు స్పందించిన సర్కార్ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. చైనా ఈ కామర్స్ సైట్లపై కొరడా ఝళిపించేందుకు రెడీ అయ్యింది. 
సోషల్ మీడియాకు చెక్ పెడతానంటున్న డిఎంకే....
డిఎంకే అధికారంలో వచ్చినట్లయితే అసెంబ్లీకి సంబంధించిన వార్తలను సోషల్ మీడియాలో రాకుండా చూసేలా శాసనం తీసుకురావాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. ప్రణాళిక సంఘం పునరుద్ధరణకు నీతి అయోగ్ ను స్క్రాప్ చేయాలని కూడా పార్టీ ప్రయత్నిస్తోంది. 
2019 ఎన్నికలు: కశ్మీర్లో ముందుస్తుగా ఇంటర్నెట్ బంద్..
ఎన్నికలు సమిపీస్తున్న వేళ కశ్మీర్లో ముందుస్తుగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కశ్మీర్ అంతటా ప్రొవైడర్లను , మొబైల్ ఇంటర్నెట్ సేవలను కట్ చేశారు. బారాముల్లా నియోజవర్గంలో జరగనున్న సాధారణ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలిపివేశారు. 

జన రంజకమైన వార్తలు