టెక్నాలజీ ప్రపంచంలో వారం వారం ఏం జరుగుతుందో అందించే టెక్ రౌండప్ మరో కొత్త వారం రివ్యూతో మీ ముందుకొచ్చింది. వాట్సాప్, ఫేస్బుక్ అప్డేట్స్, అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కొత్త స్కీమ్ లాంటి, జొమాటో యాప్‌లో కొత్త అప్డేట్స్ ఇలా అనేక అంశాలతో ఈ వారం టెక్ రౌండప్ మీ కోసం..
ఫేస్బుక్ ఫ్లాట్‌ఫామ్‌పై వాట్సాప్ పేమెంట్స్
వాట్సప్ తీసుకొచ్చిన పేమెంట్స్ ఫీచర్ మాతృ సంస్థ ఫేస్బుక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే రూపొందించింది. అయితే దీని వల్ల పేమెంట్స్‌కి సంబంధించిన ఎలాంటి సమాచారమూ ఫేస్బుక్ డేటా బేస్‌లో స్టోరయ్యే అవకాశం లేదని, వాట్సాప్ పేమెంట్స్ చేసేవాళ్లు నిశ్చింతగా ఉండొచ్చని ఫేస్బుక్ చెప్పింది. ఈమేరకు తన కొత్త ప్రైవసీ పాలసీలో వెల్లడించింది.
అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఇక నెలవారీగా
అమెజాన్ యూజర్లకు ఫ్రీ నెక్స్ట్ డే డెలివరీ, మ్యూజిక్, వీడియో కంటెంట్‌ను ఫ్రీగా పొందేందుకు, ఆఫర్లు ముందుగానే తెలుసుకోవడానికి ఉద్దేశించిన అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు మంచి ఆదరణే లభిస్తోంది. అయితే ఇది ఏడాదికి 1000 రూపాయల సబ్స్క్రిప్షన్ ఫీజుతో ఉంది. ఇంత మొత్తం చెల్లించడం ఎందుకని చాలామంది వెనక్కి తగ్గతున్నారు. ఈ పరిస్థితుల్లో నెలకు 129 రూపాయల సబ్‌స్క్రిప్షన్‌తో సింపుల్ స్కీమ్‌ను అమెజాన్ అందుబాటులోకి తెచ్చింది.
సాఫ్ట్‌బ్యాంక్ నుంచి పాలసీ బజార్‌కు 1300 కోట్ల రుణం
డిజిటల్ ఇన్స్యూరెన్స్ ఫ్లాట్‌ఫామ్ పాలసీబజార్‌కు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికింది. సాఫ్ట్‌బ్యాంక్ తన ఫ్యూచర్ ఫండింగ్ పథకంలో 100 బిలియన్ డాలర్ల విజన్ ఫండ్‌ను కంపెనీలకు ఇవ్వాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందులో భాగంగా పాలసీబజార్‌కు 200 మిలియన్ డాలర్లు (దాదాపు 1369 కోట్ల రూపాయలు) ఫండ్‌గా ఇచ్చింది.
జొమాటోలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కి టిప్
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇటీవల ఆఫర్లతో బాగా పాపులరయింది. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కి ఒక ఆర్డర్‌కు ఇంతని జొమాటో పే చేస్తుంది. వాళ్లకు మీరు ఏదైనా టిప్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు నేరుగా యాప్‌లోనే చెల్లించవచ్చు. ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడే డెలివరీ పర్సన్‌కు టిప్ ఇవ్వాలనుకుంటే 10 నుంచి 50 రూపాయల వరకు యాడ్ చేసేయొచ్చు. వీటిని జొమాటో వాళ్ల అకైంట్కు ట్రాన్స్ఫర్ చేసేస్తుంది.
ట్విట్టర్లో కొత్త అకౌంట్లకు అథెంటికేషన్ తప్పనిసరి
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలనకుంటే తమ అకౌంట్‌ను ఈమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నెంబర్‌తో అథెంటికేట్ చేయాలి. ఫేక్ అకౌంట్లను కంట్రోల్ చేయడానికి ఈ రూల్ పెట్టారు. ఇక నుంచి అథెంటికేట్ అయితేనే కొత్త అకౌంట్ నడుస్తుంది.
గూగుల్ యాడ్ వర్డ్స్ ఇక గూగుల్ యాడ్స్
సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన యాడ్ ప్రొడక్ట్స్ చాలావాటిని రీబ్రాండ్ చేసింది. గూగుల్ యాడ్ వర్డ్స్‌ని గూగుల్ యాడ్స్‌గా రీబ్రాండ్ చేసింది. అలాగే డబుల్ క్లిక్ డిజిటల్ మార్కెటింగ్, అనలిటిక్స్ 360 సూట్‌ను కూడా గూగుల్ మార్కెటింగ్ ఫ్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చింది.
ఎంఎక్స్ ప్లేయర్‌కు 1000 కోట్లు
వీడియో, మ్యూజిక్ ప్లేయర్ యాప్.. ఎంఎక్స్ ప్లేయర్ తెలుసుగా.. దాన్ని టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ (TIL) ఏకంగా 1000 కోట్ల రూపాయలకు యాక్వైర్ చేసింది. ఈ యాప్ ఇప్పుడు వోటీటీ ఫ్లాట్‌ఫాంగా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.
వావ్ ఎక్స్‌ప్రెస్ ఫండ్ రైజింగ్
ముంబయి బేస్డ్ ఈకామర్స్ లాజిస్టిక్ స్టార్టప్ వావ్ ఎక్స్‌ప్రెస్ నిధుల సమీకరణ ప్రారంభించింది. తన ఇన్వెస్టర్ టామరిండ్ ఫ్యామిలీ ప్రైవేట్ ట్రస్ట్ నుంచి 4.5 మిలియన్ డాలర్లు (దాదాపు 31 కోట్ల రూపాయల) ఫండింగ్‌ను అందుకోబోతంది. దశలవారీగా ఈ మొత్తం అందుతుంది. ఈ మొత్తంతో వావ్ ఎక్స్‌ప్రెస్ మరిన్ని ప్రాంతాలకు తన ఈకామర్స్ లాజిస్టిక్ బిజినెస్‌ను విస్తరించబోతోంది.
పేమెంట్ కంపెనీలకు 600 కోట్ల రూపాయలు ఎండీఆర్ చెల్లించని బ్యాంకులు
సీసీ ఎవెన్యూ, బిల్ డెస్క్, పైన్ ల్యాబ్స్ వంటి బిల్ పేమెంట్ కంపెనీలకు బ్యాంకులు ప్రతి ట్రాన్సాక్షన్‌కు మర్చంట్ డిస్కౌంట్ రేట్ రెవెన్యూ (MDR) చెల్లించాలి. అయితే బ్యాంకులు దీనికి సంబంధించిన పేపర్ వర్క్ సరిగా పూర్తి చేయకపోవడంతో అవి పేమెంట్ కంపెనీలకు భారీగా బకాయ పడ్డాయి. ఈ బ్యాంకులు 500 నుంచి 600 కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా.
హెల్త్‌కేర్‌లోనూ అమెజాన్ అడుగులు
ఈకామర్సలో తిరుగులేని అమెజాన్.. ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టార్ మీద గట్టిగా ఫోకస్ చేసింది. జేపీ మోర్గాన్ చేజ్, బెర్క్‌షైర్ హాత్వేలతో జట్టు కట్టి హెల్త్‌కేర్ సెక్టార్‌లోకి వచ్చిన అమెజాన్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఆన్లైన్ ఫార్మసీ కంపెనీ పిల్ప్యాక్ను ఏకంగా 1 బిలియన్ డాలర్లు (దాదాపు 6,850 కోట్లకు) కొనేసింది.