• తాజా వార్తలు

ఈ వారం టెక్ రౌండ‌ప్‌

టెక్నాల‌జీ ప్ర‌పంచంలో ప్ర‌తి నిముషం ఏదో ఒక కొత్త అంశం తెర‌పైకి వ‌స్తుంది.  కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు, రివ్యూలు, ప్రివ్యూలు, వివాదాలు, ప‌రిష్కారాలు ఇలా ఎన్నో జ‌రుగుతుంటాయి. అలా ఈ వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా టెక్ విశేషాల్లో ముఖ్య‌మైన అంశాలు ఈ వారం మ‌న టెక్ రౌండ‌ప్‌లో..

1. ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్ ఇండియాలోనే ఎక్కువ‌ట‌ 
ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్ అయిపోయే స‌మ‌స్య ఇండియాలోనే ఎక్కువ‌ని యునెస్కో తేల్చింది.  సౌత్ ఏసియా ప్రెస్ ఫ్రీడ‌మ్ రిపోర్ట్ 2017 -18 లెక్క‌ల ప్ర‌కారం ఈ సంవ‌త్స‌రంలో ద‌క్షిణాసియాలో 97 సార్లు ఇంట‌ర్నెట్ ఆగిపోయింది. అందులో 82 సార్లు ఇండియాలోనే ష‌ట్‌డౌన్ అయిపోయింద‌ని రిపోర్ట్ చెప్పింది.

2. పేటీఎం మై పేమెంట్స్‌
పేటీఎం యూజ‌ర్లు త‌ర‌చుగా చేసే పేమెంట్ల‌ను (క‌రెంట్‌, టెలిఫోన్‌, ఇంట‌ర్నెట్ బిల్ వంటివి) ఆటోమేటిగ్గా చేసే రిక‌రింగ్ పేమెంట్స్ ఫీచ‌ర్‌ను పేటీఎం అందుబాటులోకి తీసుకొచ్చింది.  ‘My Payments’  సెక్ష‌న్ కింద మీ పేమెంట్స్ ఆప్ష‌న్స్‌లో ప్ర‌తి నెలా ఏ టైమ్‌కు బిల్ క‌ట్టాలో స్పెసిఫైచేస్తే ఆటైమ్‌కు ఆటోమేటిగ్గా మీ పేటీఎం వాలెట్‌లో ఉన్న అమౌంట్‌తో బిల్ పే అయిపోతుంది. వాలెట్‌లో అమౌంట్ లేక‌పోతే రిమైండ్ చేస్తుంది.

3. ఐ అండ్ బీ మినిస్ట్రీ నుంచి స్మ‌తి ఇరానీకి ఉద్వాస‌న‌
ఇటీవ‌ల జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ ప్ర‌క్రియ‌లో కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ త‌న ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ బ్రాడ్‌కాస్ట్ మినిస్ట్రీని కోల్పోయారు. ఆన్‌లైన్ మీడియాలో ఫేక్ న్యూస్‌ను అరిక‌ట్ట‌డానికి ఎంట‌ర్‌టెయిన్మెంట్ వెబ్‌సైట్ల‌తోపాటు న్యూస్ వెబ్‌సైట్ల‌పై రెగ్యులేష‌న్స్ తెస్తామ‌ని స్మృతి చెప్ప‌డమే ప్ర‌ధాని ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంద‌ని తెలుస్తోంది.

4. ఆన్‌లైన్ న్యూస్ వెబ్‌సైట్లు స్వీయ నియంత్ర‌ణ పాటించాలి
స్మృతి ఇరానీ ఐ అండ్ బీ మినిస్ట్రీ కోల్పోయాక ఆమె స్థానంలో ప‌గ్గాలందుకున్న కేంద్ర మంత్రి రాజ్య‌వ‌ర్థ‌న్‌సింగ్ రాథోడ్ ఆన్‌లైన్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్య‌వ‌హారంపై సున్నితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆన్‌లైన్ న్యూస్ సైట్ల మీద ప్ర‌భుత్వం ఎలాంటి నియంత్ర‌ణ విధించ‌ద‌ని స్ప‌ష్టంగా చెప్పారు. అయితే ఫేక్ న్యూస్ ప్ర‌సారం చేయ‌కుండా ఈ సైట్లు వాటిక‌వే సొంతంగా నియంత్ర‌ణ పాటించాలని కోరారు.

5. 200 యాప్స్‌ను తొల‌గించిన ఫేస్‌బుక్‌
కేంబ్రిడ్జి అన‌లిటికా వ్య‌వహారంతో త‌ల‌బొప్పిక‌ట్టిన ఫేస్‌బుక్.. యూజ‌ర్ల న‌మ్మ‌కాన్ని తిరిగి పొందేందుకు తంటాలు ప‌డుతోంది.  త‌న ఫ్లాట్‌ఫాం మీద ప‌నిచేస్తున్న థ‌ర్డ్ పార్టీ యాప్స్ యూజ‌ర్ల డేటాను ఎంత వ‌ర‌కు యాక్సెస్‌చేయ‌గ‌లుగుతున్నాయో ఆడిట్ చేస్తోంది. దీనిలో భాగంగా యూజ‌ర్ల డేటాను అవ‌స‌రానికి మించి తెలుసుకుంటున్న 200 యాప్‌ల‌ను స‌స్పెండ్ చేసింది.  

6. ఆరు నెల‌ల్లో 120 కోట్ల న‌కిలీ అకౌంట్లు మూసేసిన ఫేస్‌బుక్‌
ఫేస్‌బుక్‌లో ఒరిజిన‌ల్ అకౌంట్స్ ఎన్ని ఉంటాయో అంత‌కంటే ఎక్కువ న‌కిలీ అకౌంట్లు ఉంటాయి.  ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేవాళ్లే కాదు, మార్కెటింగ్ చేసేవాళ్లు, ఏదైనా ఒక వ‌ర్గాన్ని టార్గెట్‌గా చేసుకుని ట్రోల్ చేసే బ్యాచ్ ఇలా వంద‌లు, వేల నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి వాడేస్తుంటారు. చాట్ బోట్స్ న‌డిపే అకౌంట్లు కూడా కోట్ల‌లోనే ఉన్నాయ‌ని అంచ‌నా.  ఫేస్‌బుక్ గ‌త ఆరు నెల‌ల్లో ఇలాంటి న‌కిలీ అకౌంట్ల‌ను ఒకటీ రెండూ కాదు ఏకంగా 120 కోట్ల అకౌంట్ల‌ను గుర్తించి వాటిని తొల‌గించేసింది.

7. బ్రెయిన్‌బాజీతో జ‌ట్టు క‌ట్టిన ఎయిర్‌టెల్‌
ఐపీఎల్ సీజ‌న్ న‌డుస్తుండ‌డంతో క్రికెట్ బేస్డ్ క్విజ్ యాప్స్‌కి య‌మా క్రేజ్ న‌డుస్తోంది. టైమ్స్ ఇంట‌ర్నెట్ లైవ్ క్విజ్ యాప్ బ్రెయిన్‌బాజీ వీటిలో ఒక‌టి.ఐపీఎల్ మ్యాచ్‌ల్లో భాగంగా లైవ్ క్విజ్‌లు పెట్టే ఈ యాప్‌తో ఎయిర్‌టెల్ టై అప్ కుదుర్చుకుంది.ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో ఈ లైవ్ క్విజ్ ప్రోగ్రాంలు ర‌న్న‌వుతాయి. వీటిలో గెలిచిన‌వారికి బ‌హుమ‌తులు, డిస్కౌంట్ కూప‌న్లు, ప్రోమో కోడ్స్ ఇస్తారు.

8. వ‌ర్చువ‌ల్ క‌రెన్సీ కేసుల‌న్నీ సుప్రీంకోర్టుకి
బిట్ కాయిన్ లాంటి వ‌ర్చువ‌ల్ క‌రెన్సీల వినియోగం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అన్న‌ది అంద‌రికీ ఉన్న సందేహమే. దీనిమీద చాలా మంది కోర్టుల‌కు కూడా వెళ్లారు. అయితే ఇలా వివిధ హైకోర్టుల్లో ఉన్న ఈకేసుల‌న్నీ తానే విచారిస్తాన‌ని సుప్రీం కోర్టు ప్ర‌క‌టించింది. ఢిల్లీ హైకోర్టులో ఉన్న రెండు కేసులు, క‌ల‌క‌త్తా హైకోర్టులో ఉన్న ఒక కేసును సుప్రీంకోర్టుకే విచారించ‌నుంది.

9. ఈసిమ్స్‌కు డీవోటీ ఒకే
టెలికం శాఖ ఈసిమ్‌ల‌కు అంగీకారం తెలిపింది. ఫిజిక‌ల్ సిమ్‌కార్డ్‌కు బ‌దులు ఫోన్‌లోనే ఇన్‌బిల్ట్‌గా సాఫ్ట్‌వేర్ ఉంటుంది.  కొత్త సిమ్ తీసుకున్న‌ప్పుడు ఆ కంపెనీ ఈ  సిమ్‌ను యాక్టివేట్ చేస్తుంది. 

జన రంజకమైన వార్తలు