• తాజా వార్తలు

షియోమి రెడ్‌మి నోట్ సిరీస్‌ను ఎందుకు ఆపేస్తుంది?

స్మార్ట్‌ఫోన్ల చ‌రిత్ర‌లోనే అత్యంత విజ‌య‌వంత‌మైన ఫోన్‌గా నిలిచిన ఒక ఫోన్ త్వ‌ర‌లో ఆగిపోబోతోంది.. మీరు చ‌దివింది నిజ‌మే! త్వ‌ర‌లోనే ఒక స్మార్ట్‌ఫోన్ నిలిచిపోనుంది. ఆ స్మార్ట్‌ఫోనే రెడ్‌మినోట్‌! షియోమి కంపెనీ నుంచి వ‌చ్చి గ్రాండ్ స‌క్సెస్ అయిన రెడ్‌మి నోట్‌ను ఆ కంపెనీ త్వ‌ర‌లోనే క్యాన్సిల్ చేయ‌నుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. భార‌త్‌లో రెడ్ మీ నోట్ 8 ప్రొను విడుద‌ల చేసిన త‌ర్వాత  రెడ్ మి నోట్ సిరీస్‌ను రీసెట్టింగ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో షియోమి ఉంది. మ‌రి దీని కథేంటో చూద్దాం..

అన్నీ ర‌ద్ద‌వుతున్నాయ్‌
షియోమి ఇలా ఒక్కో సిరీస్‌ను ర‌ద్దు చేసుకుంటూ ముందుకెళుతోంది... ఇటీవ‌లే ఈ సంస్థ రెడ్‌మి నోట్ 8ను అన్‌వీల్ చేసింది. అంత‌క‌ముందు సిరీస్‌ల‌ను రీసెట్టింగ్ చేసే అవ‌కాశాలున్నాయి. దీంతో రాబో్యే రెడ్‌మీ సిరీస్ ఫోన్లే ఈ కంపెనీ విడుద‌ల చేసే ఆఖ‌రి ఫోన్లా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.  దీంతో రాబోయే రోజుల్లో రెడ్ మి నోట్ 9, రోడ్ మి నోట్ 9 ప్రొ, రెడ్ మి 10, రెడ్ మి 10 ప్రొ ఫోన్లు భ‌విష్య‌త్‌లో క‌నిపించ‌పోతే ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. 

ఎందుకు ఆపుతుంది?
విజ‌య‌వంత‌మైన సిరీస్‌గా పేరొంది.. మార్కెట్లో దూసుకెళ్తున్న రెడ్ మి నోట్ సిరీస్‌ను షియోమి ఎందుకు ఆపుతోంది?.. దీనికి ఏమైనా ప్ర‌త్యేక కార‌ణాలు ఉన్నాయా... ఉన్నాయ‌నే చెబుతున్నారు మార్కెట్ నిపుణులు...  రీసెటింగ్ చేయాల‌నే ఉద్దేశంతోనే షియోమి రెడ్‌మికి మంగ‌ళం పాడుతుంద‌నే రీజ‌న్స్ వినిపిస్తున్నాయి. అయితే వ‌చ్చే ఏడాది ఎంఐ నోట్ 10తో క‌లిసి ముందుకు వెళ్లే ఉద్దేశం ఉండ‌డంతో రెడ్‌మి సిరీస్‌ను ఆపే అవ‌కాశాలను షియోమి ప‌రిశీలిస్తుంద‌ని స‌మాచారం. 

జన రంజకమైన వార్తలు