• తాజా వార్తలు

మాసివ్ బ్యాట‌రీ ఎన‌ర్జైజ‌ర్ ఫోన్లు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి?

స్మార్ట్‌ఫోన్లు కొనేవాళ్లు సాధార‌ణంగా ఎక్కువ బ్యాట‌రీ ఉండే ఫోన్ల‌నే ఎంచుకుంటారు. బ్యాట‌రీ ఎక్కువ‌సేపు ఉంటేనే ఆ స్మార్ట్‌ఫోన్ వ‌ల్ల మ‌న‌కు ఉప‌యోగం ఉంటుంది. అయితే ఇప్పుడు వ‌స్తున్న చాలా ఫోన్లు కొద్దిసేప‌టికే బ్యాట‌రీ అయిపోతాయి. అయితే. బిగ్ బ్యాట‌రీతో సూప‌ర్ ప‌వ‌ర్‌తో ఒక ఫోన్ ఉంటే బాగుంటుంది అని క‌స్ట‌మ‌ర్లు అనుకుంటూ ఉండేవాళ్లు.. వాళ్ల అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే ఎనర్జైజ‌ర్ ప‌వ‌ర్ ప్యాక్ మాక్స్ పీ18కే పాప్ ఫోన్లు మార్కెట్లోకి వ‌చ్చేవి. ఇవి క‌చ్చితంగా హిట్ అవుతాయి అనుకుంటే అనూహ్యంగా విఫ‌లం అయ్యాయి. మ‌రి దీనికి ఏంటి కార‌ణం?

స్మార్ట్‌ఫోన్ చ‌రిత్ర‌లోనే 18000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో వ‌చ్చిన ఎన‌ర్జైజ‌ర్ ఫోన్‌లో కేవ‌లం బ్యాట‌రీ మాత్ర‌మే కాదు ఎన్నో ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి. దీనిలో ఉండే డ్యుయ‌ల్ లెన్స్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఈ ఫోన్‌ను ఆక‌ర్ష‌ణీయంగా త‌యారు చేశాయి. అయితే దీనిలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే దీని సైజు, బ‌రువు. ఇదే ఒక ర‌కంగా ఈ ఫోన్ విఫ‌లం కావ‌డానికి కార‌ణంగా చెప్పొచ్చు. ఎన‌ర్జైజర్ ఫోన్ 549 డాల‌ర్ల‌కు అమ్మారు. అది కూడా ఆరంభంలో కొనుగోలు చేసిన వాళ్ల‌కు మాత్ర‌మే ఈ ధ‌ర‌. ఆ త‌ర్వాత దీని ధ‌ర ఏకంగా 699 డాల‌ర్లు పెరిగిపోయింది. దీంతో క‌స్ట‌మ‌ర్లు అంత డ‌బ్బులు పెట్టి కొన‌డానికి విముఖ‌త చెప్పారు. 

ఎన‌ర్జైజ‌ర్ ప‌వ‌ర్ మాక్స్ పీ18కె పాప్ ఫోన్ కోసం ఎక్కువ కాలం కూడా వెయిట్ చేయ‌డం కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు ఒక ఇబ్బందిగా మారింది. ఎక్కువ డ‌బ్బులు పెట్టాల్సి రావడం.. దీని కోసం ఎక్కువ స‌మ‌యం వెచ్చించాల్సి రావ‌డంతో క‌స్ట‌మ‌ర్లు వేరే ఫోన్ల వైపు మొగ్గారు. పెద్ద బ్యాట‌రీ, నొవెల్ డ్యుయ‌ల్ లెన్స్ పొపాప్ కెమెరా ఈ రెండు ఆప్ష‌న్లు త‌ప్ప మిగితా ఆప్ష‌న్లు పెద్ద‌గా ఆక‌ర్ష‌ణీయంగా లేక‌పోవ‌డం కూడా ఈ ఫోన్ అమ్మ‌కాల‌పై ప్ర‌భావం చూపించింది. అయితే భారీ సైజు ఫోన్లు కొనుక్కోవాల‌నుకునేవాళ్లు మాత్ర‌మే ఈ ఫోన్ గురించి ఆలోచించే అవ‌కాశం ఉంది. 

జన రంజకమైన వార్తలు