• తాజా వార్తలు

రివ్యూ - ఇ కోర్ట్స్ యాప్ ద్వారా మ‌న కోర్టు కేసుల‌ను ట్రాక్ చేయ‌డం ఎలా?

కోర్టులో కేసులు ప‌డ్డాయంటే ఏళ్ల త‌ర‌బ‌డి అవి మ‌గ్గిపోవాల్సిందే.. కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి మ‌న కాళ్లు అరిగిపోవాల్సిందే. అస‌లు చాలామందికి త‌మ కేసులు ప్ర‌స్తుతం ఏ స్థితిలో ఏ ద‌శ‌లో ఉన్నాయో కూడా తెలియ‌దు. మ‌రి ఇంత టెక్నాల‌జీ డెవ‌ల‌ప్ అయిన త‌ర్వాత కూడా ఇన్ని బాధ‌లు ప‌డాల్సిందేనా! లేదు అంటోంది ఈకోర్ట్స్ యాప్‌.. ఈ యాప్ సాయంతో మ‌నం కేసులు ఏ ద‌శ‌లో ఉన్నాయో చెక్ చేసుకోవ‌చ్చు.. కోర్టు ఉత్త‌ర్వులు తెలుసుకోవ‌చ్చు.. మ‌న పాత కేసుల వివ‌రాలు రాబ‌ట్టొచ్చు ఇలా చాలా ర‌కాల ఉప‌యోగాలు ఉన్నాయి ఈ యాప్‌తో..

ఈకోర్ట్స్‌.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్ ద్వారా మ‌నం ఈ యాప్‌ను యూజ్ goచేసుకోవ‌చ్చు. మీకు కావాల్సిన కేసుల స‌మాచారంతో పాటుఎప్ప‌టిక‌ప్పుడు కేస‌ల స్టేట‌స్‌, అప్‌డేట్స్‌, లాయ‌ర్లు, జ‌డ్జిల వివ‌రాలు లాంటి కీల‌క స‌మాచారా ఈ వెబ్‌సైట్లో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఏకంగా మిలియ‌న్‌కు పైగా డౌన్‌లోడ్స్ ఉన్నాయంటేనే ఈ యాప్ ఎంత‌గా విజ‌య‌వంతం అయిందో చెప్పొచ్చు. ప్ర‌స్తుతానికి గూగుల్ ప్లే స్టోర్‌లోదీనికి 4 ఔట్ ఆఫ్ 5 రేటింగ్ ఇచ్చారు. రోజు రోజుకు ఈ యాప్ ఎక్కువ‌మంది యూజ‌ర్ల ఆద‌ర‌ణ పొందుతోంది. 

ఈ కోర్ట్స్ యాప్ ద్వారా మీ కేసు వివ‌రాల‌ను క‌నుక్కోవ‌డం చాలా సుల‌భం. ఈ యాప్‌ను ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్‌లో సీఎన్ఆర్ అని టైప్ చేయాలి. ఆ త‌ర్వాత మీ 16 అంకెట‌ల యూనిక్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. ప్ర‌తి కోర్టు త‌మ కేసులకు ఒక సీఎన్ఆర్ నంబ‌ర్‌ను కేటాయిస్తుంది. ఈ నంబ‌ర్ ఆధారంగా కేసు పురోగ‌తిని మ‌నం తెలుసుకోవ‌చ్చు. అప్‌డేటెడ్ ఉండ‌డం ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌. రోజు వారీ కోర్టు వ్య‌వ‌హారాల‌ను ప‌రిశీలిస్తూ అందుకు త‌గ్గ‌ట్టుగా యాప్‌లో మార్పు చేర్పులు జ‌రుగుతూ ఉంటాయి. సీఎన్ఆర్ నంబ‌ర్ లేక‌పోయినా కేసు నంబ‌ర్‌, పార్టీ పేరు, ఫిల్లింగ్ నంబ‌ర్‌, ఎఫ్ఐఆర్ నంబ‌ర్‌, అడ్వ‌కేట్ పేరు, యాక్ట్, కేసు టైప్ లాంటి వివ‌రాలు ఇస్తే చాలు. 

జన రంజకమైన వార్తలు