• తాజా వార్తలు

రివ్యూ - వివో వీ9

ప్ర‌స్తుతం భార‌త మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ఫోన్లు యాపిల్ కంపెనీ ఫోన్ల‌ను కాపీ కొట్ట‌డానికే ప్ర‌య‌త్నిస్తున్నాయి. యాపిల్ ఐ ఫోన్ త‌ర‌హాలోనే చాలా ఫోన్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. సేమ్ డిజైన్‌, సేమ్ స్ట్ర‌క్చ‌ర్‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. యాపిల్ తాజా మోడ‌ల్ ఐఫోన్ ఎక్స్ మాదిరిగానే అసెస్ కంపెనీ జెన్‌ఫోన్ 5 మోడ‌ల్‌ను బ‌రిలో దించింది. తాజాగా వివో వీ9 కూడా అసెస్ బాట‌లోనే న‌డిచింది. అచ్చంగా యాపిల్ ఐఫోన్ ఎక్స్ డివైజ్ పోలిన వివో వీ9 భార‌త్‌లో లాంఛ్ కానుంది. మ‌రి ఏమిటో దీని ప్ర‌త్యేక‌త చూద్దాం...

రూ.22,990 ధ‌ర‌తో..
వివో వీ9 స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.22,990గా నిర్ణ‌యించ‌డంతో వినియోగ‌దారులు కూడా ఆక‌ర్షితుల‌వుతున్నారు. ఎందుకంటే బెస్ట్ ఫీచ‌ర్స్‌తో అందుబాటు ధ‌ర‌లో ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. దీనిలో ప్ర‌ధానంగా ఆక‌ర్షిస్తోంది దీని ధ‌రే.  ఇదే కాదు దీని డిజైన్ కూడా మొబైల్ ప్రియుల్లో ఆస‌క్తిని రేపుతోంది. దీని 18:9 రేషియో డిస్‌ప్లే అన్నిటికంటే ఎక్క‌వగా ఆక‌ర్షించే అంశం. ఐ ఫోన్ ఎక్స్ మాదిరిగానే సెల్ఫీ కెమెరా, ఎంబింట్ లైట్ స్పెన్సార్లతో వివో వీ9 ఆక‌ట్టుకుంటోంది. దీనిలో ఇంకో ప్ర‌త్యేక‌త ఏంటంటే స్క్రీన్. 6.3 అంగుళాల ఈ జంబో స్క్రీన్ అన్నిటికంటే ఆక‌ర్ష‌ణీయ‌మైన అంశం. అంతేకాదు ఇది చాలా లైట్ వెయిట్ కూడా. దీని బ‌రువు కేవ‌లం 150 గ్రాములు మాత్ర‌మే. 

సాఫ్ట్‌వేర్‌, స్టోరేజ్‌
హై ఎండ్ ఫోన్ల‌ను వాడ‌టానికి ఇష్ట‌ప‌డే వారికి వివో వీ9 ద బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్పొచ్చు. నిజానికి దీనిలో ఉన్న ఫీచ‌ర్ల‌తో ఎక్కువ ధ‌ర ప‌లుకుతుంది. కానీ రీజ‌న‌బుల్ ధ‌ర‌తో మంచి ఫీచ‌ర్ల‌తో ఉండ‌మే ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగ‌న్ 626 ఎస్‌వోసీ ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పాటు 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌లు. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌.. డ్యుయ‌ల్ సిమ్‌, ఎక్స్‌పాండ‌బుల్ అప్‌టు 256 జీబీ లాంటి ఆప్ష‌న్లు దీనిలో ఉన్నాయి. బ్లూటూత్ 4.2, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, జీపీఎస్‌, యూఎస్‌బీ ఓటీజీ, ఎఫ్ఎం అద‌న‌పు ఫీచ‌ర్లు.

ఫేస్ అన్‌లాక్‌
ఐఫోన్ మాదిరిగానే ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌ను పెట్టింది వివో. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా అన్‌లాక్ ప్రాసెస్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. స్కాన్ చేయ‌డం ద్వారా మాత్ర‌మే ఫోన్ ఓపెన్ అవుతుంది. దీనిలో ర‌క్ష‌ణ కోసం ఫింగ‌ర్ ప్రింట్ ఆప్ష‌న్ కూడా ఉంది. దీనిలో ఉన్న గేమింగ్ మోడ్ మ‌రో స్పెషాలిటీ. హ్యాండ్స్ ఫ్రీ మోడ్ వ‌ల్ల గేమింగ్ చాలా సుల‌భం అవుతుంది. పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ ఆప్ష‌న్ కూడా ల‌భ్యం అవుతుంది. జెస్చ‌ర్ రిక‌గ‌నైజేష‌న్ అనే ఆప్ష‌న్ కూడా ఉంది. 

జన రంజకమైన వార్తలు