• తాజా వార్తలు

ఈ వారం టెక్ రౌండ‌ప్‌

టెక్నాల‌జీ రంగంలో ఈ వారం జ‌రిగిన ముఖ్య ప‌రిణామాల స‌మాహారం ఈ వారం టెక్ రౌండ‌ప్ మీ కోసం..

నో రూల్స్ ఫ‌ర్ సోషల్ మీడియా
పాకిస్తాన్ ప్ర‌భుత్వ సోష‌ల్ మీడియా రూల్స్‌ను దాదాపు 100కి పైగా పాకిస్థాన్ పౌర హ‌క్కుల సంఘాలు తిర‌స్క‌రించాయి. త‌మ హ‌క్కుల‌ను కాల‌రాచేలా ఉన్న ఈ రూల్స్‌ను తాము బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి.

ఓయోపై కేసు వేసిన  హైద‌రాబాద్ సంస్థ‌
హోట‌ల్ రూమ్స్ అగ్రిగేట‌ర్ సంస్థ ఓయోపై హైద‌రాబాద్ కంపెనీ ఒక‌టి కేసు వేసింది. కాన్‌క్లేవ్ ఇన్‌ఫ్రాటెక్ అనే హైద‌రాబాద్ ఆతిధ్య రంగ సంస్థ త‌మకు నెల‌కు 13 ల‌క్ష‌ల చొప్పున ఏకంగా 85 ల‌క్ష‌లు ఓయో బాకీ ప‌డింద‌ని, అవి ఇప్పించాల‌ని కేసు పెట్టింది

నెట్ న్యూట్రాలిటీకి క‌మిటీ అక్క‌ర్లేద‌న్న ఎయిర్‌టెల్
అంద‌రికీ అందుబాటులో ఇంట‌ర్నెట్ ఉండాల‌న్న నెట్ న్యూట్రాలిటీని ప‌ర్య‌వేక్షించ‌డానికి, దానిమీద వ‌చ్చే కంప్ల‌యింట్స్‌ను ప‌రిశీలించడానికి  క‌మిటీ వేయాల‌న్న ప్ర‌తిపాద‌న స‌రికాద‌ని ఎయిర్‌టెల్ తేల్చిచెప్పింది. అలాంటి క‌మిటీ అవ‌స‌ర‌మే లేద‌ని ట్రాయ్‌కు లేఖ రాసింది.

37 అకౌంట్లు, 11 గ్రూప్‌లను రిమూవ్ చేసిన ఫేస్‌బుక్
అనైతిక కార్య‌కలాపాల‌కు వేదిక‌గా ఉన్నాయంటూ ప‌లు అకౌంట్ల‌ను ఫేస్‌బుక్ తొల‌గించింది. ఇండియాకు చెందిన 37 ఎఫ్‌బీ అకౌంట్లు, 32 ఫేస్బుక్ పేజీలు, 11 గ్రూప్‌లు, 42 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల‌ను తొల‌గించింది. ఇవ‌న్నీ రిప్ గ్లోబ‌ల్ అనే ఇండియ‌న్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి సంబంధించిన‌వే.

వాట్సాప్ ద్వారా ఓట‌ర్ ఐడీ, ఆధార్ వెరిఫికేష‌న్‌కు స్ప్రింగ్ రోల్
వాట్సాప్ ద్వారా ఓట‌ర్ ఐడీ, ఆధార్ వెరిఫికేష‌న్‌కు ఓ కొత్త స‌ర్వీస్ అందుబాటులోకి వ‌చ్చింది. స్ప్రింగ్ రోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే హెచ్ ఆర్ కంపెనీ  దీన్ని ప్ర‌వేశ‌పెట్టింది. వాట్సాప్ ఆధారంగా ప‌ని చేసే ఈ టూల్ గ‌వ‌ర్న‌మెంట్ డేటా బేస్‌ల నుంచి ఈ వివ‌రాలు తీసుకుని మీ ఓట‌ర్‌, ఆధార్ కార్డుల‌ను వెరిఫై చేస్తుంది.

ప‌ర్స‌న‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ బిల్లుపై కామెంట్లు జేపీసీకి
వ్యక్తిగత డేటా ర‌క్ష‌ణ‌కు ఉద్దేశించిన ప‌ర్స‌న‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ బిల్లుపై కామెంట్లు చెప్పాల‌ని కేంద్రం కోరింది. దీనిపై ఫిబ్ర‌వ‌రి 25 వ‌ర‌కు వ‌చ్చిన అభిప్రాయాల‌ను జాయింట్ పార్ల‌మెంట‌రీ క‌మిటీకి పంప‌నున్నారు.

క్రిప్టో క‌రెన్సీకి రైట్ రైట్
క్రిప్టో క‌రెన్సీ చెలామ‌ణీపై ఆర్‌బీఐ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. క్రిప్టో క‌రెన్సీతో బ్యాంక్ ట్రాన్సాక్ష‌న్లు జ‌ర‌ప‌రాద‌న్న ఆర్‌బీఐ నిర్ణ‌యం స‌రికాద‌ని  ముగ్గుర జ‌డ్జిల ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది.

టెలికంలో ఫ్లోర్ ప్రైసింగ్ వ‌ద్ద‌న్న నీతిఆయోగ్
ప్ర‌తి మొబైల్‌ఫోన్ వినియోగ‌దారుడు ప్ర‌తి నెలా క‌చ్చితంగా ఎంతో కొంత సొమ్ము చెల్లించేలా ఫ్లోర్ ప్రైసింగ్ విధానం తీసుకురావాల‌ని టెలికం కంపెనీలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌ను నీతిఆయోగ్ అంగీక‌రించ‌డం లేదు.  కంపెనీల పోటీ వ‌ల్ల వినియోగ‌దారుడు లాభం పొంద‌కుండా ఈ విధానం అడ్డుపడుతుంది కాబ‌ట్టి దీన్ని ఆమోదించ‌వ‌ద్ద‌ని టెలికం రెగ్యులేట‌రీ అథారిటీ (ట్రాయ్‌)కు సూచించింది.

 

జన రంజకమైన వార్తలు