• తాజా వార్తలు

మొబైల్ కెమెరాల్లో ఏమిటి పిక్సెల్ బిన్నింగ్‌?

స్మార్ట్‌ఫోన్లు కొనేట‌ప్పుడు ఎక్కువ‌మంది చూసేది కెమెరా ఎన్ని పిక్స‌ల్ అని.. ఎందుకంటే పిక్స‌ల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది... ఫొటోలు అంత బాగా వ‌స్తాయ‌నే అభిప్రాయం ఉంటుంది. నిజానికి ఇందులో వాస్త‌వం లేదు.. పిక్స‌ల్స్ బ‌ట్టి ఫొటో క్లారిటి, క్వాలిటీ ఏం ఆధార‌ప‌డ‌దు. ఇవే కాదు దీనిలో పిక్స‌ల్ బిన్నింగ్ అని ఉంటుంది. మ‌రి ఈ పిక్స‌ల్ బిన్నింగ్ అంటే ఏంటి? ..దాని వ‌ల్ల ఉప‌యోగాలు ఏమిటి?

ఇన్నోవేటివ్ ఫీచ‌ర్‌
2019లో స్మార్ట్‌ఫోన్ల‌లో వ‌చ్చిన మోస్ట్ ఇన్నోవేటివ్ ఫీచ‌ర్ల‌లో హై రెజ‌ల్యూష‌న్ ప్రైమ‌రీ కెమెరాలు ఒక‌టి. బ‌డ్జెట్ ఫోన్ల‌తో మొద‌లుపెట్టి ఇత‌ర ఎక్స్‌పెన్సీవ్ ఫోన్ల‌లో ఈ ఫీచ‌ర్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. వ‌న్ ప్ల‌స్ 7 ప్రొ, ఏస‌స్ 6 జెడ్‌, నుబియా రెడ్ మ్యాజిక్ 3, రెడ్‌మి కె20 ప్రొ లాంటి ఫోన్ల‌లో ఈ కొత్త ఇన్నొవేటివ్ హైరెజెల్యూష‌న్ కెమెరాలు ఉంటాయి.  వీటిలో వాడే కెమెరా ప్ర‌త్యేక‌త ఏంటంటే  దీని సెన్సార్ లేదా మెగా పిక్స‌ల్ మాత్ర‌మే కాదు దీనిలో ఉండే టెక్నాల‌జీ ఈ కెమెరా ప్ర‌త్యేక‌త‌. దీన్నే పిక్స‌ల్ బిన్నింగ్ అంటారు.

ఏమిటి స్పెష‌ల్‌
నాలుగు ఎదురుబొదురు పిక్స‌ల్స్‌ను ఒకేలా క‌ల‌ప‌డమే పిక్స‌ల్ బిన్నింగ్ అంటారు. అంటే 0.8 మైక్రాన్స్ ఉన్న పిక్స‌ల్ సైజును కూడా 2*2 గ్రిడ్‌గా కంబైన్డ్ చేస్తుంది. అంతేకాదు 2.6 మైక్రాన్ పిక్స‌ల్‌గా కూడా మారుస్తుంది. అంటే 48 ఎంపీ సెన్సార్ ఉన్న కెమెరా 12 ఎంపీ ఇమేజ్‌ల‌ను ప్రొడ్యూస్ చేయ‌గ‌ల‌దు. 64 ఎంపీ సెన్సార్ ఉన్న కెమెరా 16 ఎంపీ ఇమేజ్ల‌ను అందించ‌గ‌ల‌దు.  ఇలా పిక్స‌ల్స్‌ను కంబైన్ చేయ‌డం వ‌ల్ల బ్రైట‌ర్, షార్పర్ ఇమేజ్‌లు వ‌స్తాయి. 48 ఎంపీ కెమెరా, ఐఎంఎక్స్586 మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ల‌లో పిక్స‌ల్ బిన్నింగ్ బాగా వ‌ర్కౌట్ అవుతుంది. అంటే పిక్స‌ల్స్‌తో సంబంధం లేకుండా అద్భుత‌మైన‌, ఆక‌ర్ష‌ణీయ‌మౌన ఫొటోల‌ను తీసుకోవ‌చ్చు.

జన రంజకమైన వార్తలు