• తాజా వార్తలు

ప్రివ్యూ - ఏమిటీ బ్లూ టూత్ 5.0

స్మార్ట్‌ఫోన్ క‌నెక్టివిటీలో కీల‌క‌మైన అంశం బ్లూటూత్‌.  షేర్ ఇట్ లాంటి యాప్స్ వ‌చ్చాక స్మార్ట్ ఫోన్‌లో  డేటా ట్రాన్స్‌ఫ‌ర్‌కు బ్లూటూత్‌ను ఉప‌యోగం త‌గ్గింది. కానీ వైర్‌లెస్‌గా ఫోన్‌ కాల్స్ మాట్లాడ‌డంలో,  ఫోన్‌లోని మ్యూజిక్‌ను వైర్‌లైస్‌గా విన‌డంలో బ్లూటూత్ పాత్ర చాలా చాలా కీల‌కం.  అందుకే ఎప్ప‌టిక‌ప్పుడు బ్లూటూత్‌లో అప్‌గ్రేడ్ వెర్ష‌న్ వ‌స్తూనే ఉంది. లేటెస్ట్‌గా రిలీజ‌యిన బ్లూటూత్ 5.0  ఎలా ప‌నిచేస్తుంది?  దాని విశేషాలేమిటో చూద్దాం.  

బ్లూటూత్ అనేది రెండు డివైస్‌ల‌ను వైర్‌లెస్‌గా క‌నెక్ట్ చేస్తుంది. ల్యాప్‌ట్యాప్‌లు, ఐప్యాడ్‌లు, స్మార్ట్‌ఫోన్ల‌ను స్పీక‌ర్ల‌తో క‌నెక్ట్ చేయ‌డానికి లేదా మ‌రో ఇత‌ర డివైస్‌తో క‌నెక్ట్ చేయ‌డానికి బ్లూటూత్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్ర‌స్తుతం 35వేల బ్రాండ్ల డివైస్‌లు బ్లూటూత్‌ను వాడుతున్నాయి. వెర్ష‌న్ మారేకొద్దీ బ్లూటూత్ క‌నెక్టివిటీ స్పీడ్‌, రేంజి పెరుగుతూ వ‌స్తున్నాయి.

బ్లూటూత్ 1.0, 2.0
ఇవి ఫ‌స్ట్ జ‌న‌రేష‌న్ బ్లూటూత్‌లు. వీటిలో గాసియ‌న్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ ( GFSK) మాడ్యులేష‌న్ స్కీమ్‌తో ప‌ని చేస్తాయి. ఈ జ‌న‌రేష‌న్ బ్లూటూత్ ప‌రిధి 10 మీట‌ర్లు. అంటే 10 మీట‌ర్ల‌లోపు డివైస్‌ల‌నే ఇవి క‌నెక్ట్ చేయ‌గ‌లుగుతాయి. త‌ర్వాత వ‌చ్చిన బ్లూటూత్ వీ2.0 .. ఫైల్స్‌ను 3ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్‌కు పంప‌గ‌లుగుతుంది.

బ్లూటూత్ 3.0
దీనిలో బ్లూటూత్ క‌నెక్టివిటీ స్పీడ్‌తో పాటు పంప‌గ‌లిగే డేటా సైజ్ కూఆ పెరిగింది.  24 ఎంబీపీఎస్ రేట్‌తో ఫైల్స్‌ను షేర్ చేయ‌డానికి బ్లూటూత్ 3.0 ప‌నికొస్తుంది. 

బ్లూటూత్ 4.0, 4.1. 4.2
ఈ ద‌శ‌కు వ‌చ్చేస‌రికి బ్లూటూత్ క‌నెక్టివిటీ, డేటా ట్రాన్స్‌ఫ‌ర్ స్పీడ్ ఇంకా పెరిగింది. అంతేకాదు ఇది త‌క్కువ ఎన‌ర్జీని ఉపయోగించుకుంటుంది. అంటే ఈ వెర్ష‌న్ ఉన్న డివైస్‌లో బ్లూటూత్ వాడినా బ్యాటరీ పెద్ద‌గా ఖ‌ర్చు కాదు. 4.2 వెర్ష‌న్‌లో ప్రైవ‌సీ అప్‌డేట్స్ కూడా వ‌చ్చాయి. అంతేకాదు 4.1తో పోల్చితే ఈ వెర్ష‌న్‌లో డేటా ట్రాన్స్‌ఫ‌ర్ స్పీడ్ 2.6 రెట్లు పెరిగింది. 

బ్లూటూత్ 5.0
2016లో వ‌చ్చిన బ్లూటూత్ 5.0 ప్ర‌స్తుతానికి లేటెస్ట్‌.  క‌నెక్ష‌న్ లూజ్ అవ‌కుండా, సెక్యూర్డ్‌గా ఉండేలా దీన్ని రూపొందించారు. అంత‌కు ముందు వ‌చ్చిన బ్లూటూత్ 4.0  కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ స్పీడ్‌గా ప‌నిచేస్తుంది. క‌నెక్టివిటీ రేంజ్ కూడా నాలుగు రెట్లు ఎక్కువ‌.  పెద్ద మెసేజ్‌లు కూఆ దీనితో పంప‌వ‌చ్చు. 

ఏయే ఫోన్లకు అందుబాటులో ఉంది
బ్లూటూత్ 5.0 వెర్ష‌న్ లేటెస్ట్ మోడ‌ల్ స్మార్ట్ ఫోన్ల‌లో అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ8 ప్ల‌స్‌, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ జెడ్ 2, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ జెడ్‌2 కాంపాక్ట్‌, నోకియా 7 ప్ల‌స్‌, ఆసుస్ జెన్‌ఫోన్ 5జెడ్, రెడ్‌మీ నోట్ 5 ప్రో, ఆ త‌ర్వాత వ‌చ్చిన రెడ్‌మీ మోడ‌ల్స్ .. ఇలా ఇప్పుడు చాలా ఫోన్ల‌లో బ్లూటూత్ 5.0 వెర్ష‌న్ అందుబాటులో ఉంది. 
 

జన రంజకమైన వార్తలు