• తాజా వార్తలు

రివ్యూ-ఎయిర్ టెల్ టీవీ vsజియో టీవీ-లైవ్ టీవీ సర్వీసుల్లో ఎవరు మెరుగు


టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రం అవుతోంది. వినియోగదారులను ఆకట్టుకోవడంతోపాటు...తమ నెట్ వర్క్ లను ఎక్కువ కాలం ఉపయోగించేలా కంపెనీలు ప్లాన్స్ రెడీ చేస్తున్నాయి. ఈ విషయంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండు సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రవేశపెడుతూ...కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. లైవ్ టీవీ సర్వీసుల్లో ఎయిర్ టెల్ వర్సెస్ జియో టీవీ...ఈ రెండింటిలో ఏది బెస్ట్...ఓసారి చూద్దాం. 
రిలయన్స్ జియో వర్సెస్ ఎయిర్ టెల్ టీవీ: ఛానెళ్ల సంఖ్య...
ఈ రెండు యాప్స్ మధ్య తేడాలు తెలుసుకునే ముందు...లైవ్ టీవీ సర్వీసు విభాగంలో ఎయిర్ టెల్ టీవీ, జియో టీవీ ఈ రెండింటిలోనూ ఈ అంశాలు తప్పనిసరిగా గమనించాలి. ఈ రెండింటి సర్వీసులు కూడా వెబ్ బేస్డ్ ప్లాట్ ఫాంపై ఆధారపడి పనిచేస్తాయి. వీడియో బేస్డ్ కంటెంట్ ఇంగ్లీష్, హిందితోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఉంటాయి. ఇవి రెండూ కూడా లైవ్ టీవీ యాప్స్ కావడంతో ఎక్కడైనా మొబైల్ లేదా వెబ్ సైట్స్ ద్వారా చూడవచ్చు. న్యూస్, స్పోర్ట్స్, సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. 
ఎయిర్ టెలీ టీవీ, జియో టీవీ....లైవ్ సర్వీసుల విషయానికొస్తే...ఇవి యూజర్లను ఆకట్టుకోనున్నాయి. ఈ యాప్స్ ను ఎలాంటి ఖర్చు లేకుండా వాడుకోవచ్చు. ఒక సబ్ స్క్రైబర్ సంబంధిత టెల్కో తో ఒక కనెక్షన్ను తీసుకున్నట్లయితే...ఈ యాప్స్ కు ఫోన్ కనెక్షన్ తో కనెక్ట్ అయి ఉంటుంది. చాలా మంది వినియోగదారులు తమ సేవలను ఎన్ని ఛానెల్స్ వస్తున్నాయన్నది ముఖ్యంగా గమనిస్తుంటారు. ఇంగ్లీష్,హిందీ, బెంగాలీ, మళయాళంతోపాటు మరిన్ని భాషల్లో 640 ఛానెల్లను అందిస్తుంది. అయితే ఎయిర్ టెల్ మాత్రం తమ సబ్ స్క్రైబర్లకు కేవలం 373 ఛానెళ్లను అందిస్తుంది. 
హెచ్డి కంటెంట్....
ఇక హెచ్డి కంటెంట్ పరంగా చూసినట్లయితే....రిలయన్స్ జియో టీవీ 138హెచ్డి ఛానెల్స్ ప్యాక్ అందిస్తుంటే...ఎయిర్ టెల్ టీవీ 62హెచ్డి ఛానెల్స్ ను అందిస్తుంది. అయితే లైవ్ ప్రోగ్రామ్స్ ను ఈ రెండు అందిస్తున్నాయి. జియో టీవీ, జియో ఈవెంట్స్, జియో స్పోర్ట్స్, ఎయిర్ టెల్ వంటి ప్రత్యేక ఛానెళ్లను అందిస్తున్నాయి. అంతేకాదు 100సినిమాలను 10,000పైగా ప్రేక్షకులు తిలకిస్తున్నారు. అడిషనల్ బెనిఫిట్స్ చూసినట్లయితే....ఎయిర్ టెల్ టీవీ మెయిన్ రోల్ ను పోషిస్తుది. జియో సినిమా పేరుతో ఉన్న మరోక అప్లికేషన్ను అప్ కమింగ్ సినిమాలు, లెటెస్ట్ సినిమాలు, ట్రైలర్స్ అందించడం ద్వారా జియో కూడా ఒక అప్లికేషన్ను రూపొందించాల్సి ఉంటుంది. 
ఇక రెండింటిలో ఏది ఎంచుకోవాలో తెలుసుకోవాలంటే....ఇది యూజర్లు ఒక పరీక్షలాంటింది. ఎయిర్ టెల్ తక్కువ ఛానెల్స్ అందిస్తున్నప్పటికీ...జియోతో పోల్చి చూసినట్లయితే ఇది బెస్ట్ యాప్ అని చెప్పవచ్చు. యాడ్ ఆన్ డిమాండ్ కంటెంట్ పరంగా కొన్ని డివిజినల్ షోలను కూడా అందిస్తుంది. అయితే వినియోగదారులు కంటెంట్ను జియో సినిమా అప్లికేషన్ ద్వారా చూడవచ్చు. కానీ ఎయిర్ టెల్ యూజర్లకోసం ప్రత్యేక యాప్ డౌన్ లోడ్ చేస్తే ఈ అవాంతరాలు తగ్గిపోతాయి. 
 

జన రంజకమైన వార్తలు