ఆట నియమాలేమిటి....
• ఇది ఒక ఆన్ లైన్ వర్డ్ గేమ్
• ఆటగాడు ఒక ఐదు అక్షరాల పదాన్ని ఊహించాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 6 సార్లు గెస్ చేయవచ్చు
• గెస్ చేసిన ప్రతిసారీ, వారు ఎంచుకొన్న అక్షరాల్లో ఏవి ఆ పదంలో ఉన్నాయో చెబుతూ, అవి సరైన స్థానంలో ఉన్నాయా లేదా అని చెబుతుంది
• ప్రపంచవ్యాప్తంగా ఈ గేమ్ బాగా ప్రాచుర్యం పొందింది
• ఫ్రెంచ్, అరబిక్, మరాఠీ, తమిళం, చెక్, ఉర్దూ, జర్మన్, చైనీస్ – ఇలా ఎన్నో భాషల్లో ఈ గేమ్ ఆడొచ్చు
వర్డ్లీ గేమ్ నియమాలు ఏంటి?
వర్డ్లీ ఆడటం చాలా సులభం. చాలా సరళమైన నియమాలే.
• ఆటగాడు ఆరు లేదా అంతకంటే తక్కువ ప్రయత్నాల్లో ఊహించాల్సుంటుంది
• నమోదు చేసే ప్రతి పదం కూడా వర్డ్ లిస్ట్ లో ఉండాలి
• అక్షరం సరిగ్గా ఉన్నట్లయితే, రంగు ఆకుపచ్చగా మారుతుంది
• సరైన అక్షరమే అయనా దాని పొజిషన్ సరిగ్గా లుంటే, పసుపురంగులోకి మారుతుంది
• అక్షరం తప్పైతే బూడిద రంగులోకి మారుతుంది
• అక్షరాలను ఒకటి కంటే ఎక్కువసార్లు వాడొచ్చు
వర్డ్లే అనే ఆటను ఎవరు సృష్టించారు?
• వెల్ష్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జోష్ వార్డెల్ ఈ 'వర్డ్లీ' అనే వెబ్ ఆధారిత గేమ్ రూపొందించి, అభివృద్ధి చేశాడు
• ప్రస్తుతం, దీన్ని ది న్యూయార్క్ టైమ్స్ కంపెనీ స్వంతం చేసుకొంది
వర్డ్లీ ఎలా పనిచేస్తుంది?
• వర్డ్లీ ఆటలో యాదృచ్ఛికంగా ఎంచుకొన్న ఒక ఐదు అక్షరాల పదాన్ని గెస్ చేయడానికి ఆరు అవకాశాలను ఇస్తుంది
• సరైన అక్షరం సరైన ప్రదేశంలో ఉన్నట్లయితే, అది ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది
• సరైన అక్షరం తప్పు ప్రదేశంలో ఉన్నట్లయితే, అది పసుపు రంగులో కనిపిస్తుంది
• ఏదైనా ప్రదేశంలో పదంలో ఒక అక్షరం లేనట్లయితే, అది బూడిదరంగులో కనిపిస్తుంది
• ఒకే అక్షరాన్ని రెండుసార్లు వాడొచ్చు
వర్డ్లీలో కాల పరిమితి ఉందా?
• ప్రస్తుతం, వర్డ్లీ స్వేచ్ఛగా, యాడ్-ఫ్రీగా ఆడుకోవచ్చు
• ఐతే, ప్రతిరోజూ ఒక్కసారి మాత్రమే పూర్తి చేయవచ్చు
• ఆటలో సమయాన్ని వృధా చేసే సెషన్లు ఏవీ లేవు
• రోజుకొక్కసారి మాత్రమే ఆడవచ్చు
ఉచితంగా వర్డ్లీ డౌన్లోడ్ చేయవచ్చా?
• కంప్యూటర్, ఫోన్ లేదా టాబ్లెట్ పై ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు