• తాజా వార్తలు

రివ్యూ-యూట్యూబ్ మ్యూజిక్ vs యాపిల్ మ్యూజిక్ vs స్పాటిఫై vs జియో సావన్ ఏది బెస్ట్ ఇండియాలో?

ఇప్పుడు ఇండియాలో మ్యూజిక్ వార్ స్టార్ట్ అయ్యింది. స్పాటిఫై తన మ్యూజిక్ ను లాంచ్ చేసిన కొద్ది నెలల్లోనే యూట్యూబ్ తన మ్యూజిక్ తో దూసుకువచ్చింది. యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ఇండియాలో యూట్యూబ్ మ్యూజిక్, యాపిల్ మ్యూజిక్, జియో సావన్ వీటిలో ఏది బెస్ట్. ఓసారి పరిశీలిద్దాం. 

యూట్యూబ్ మ్యూజిక్ నెలకు రూ. 99....
యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ను ఎవరైనా ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే యాడ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం తీసుకుంటే యాడ్స్ ఉండవు. ఇతర దేశాలతో పోలిస్తే చూస్తే ప్రీమియం ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. లాంచింగ్ సంద‌ర్భంగా మొద‌టి 3 నెలల పాటు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఆ త‌రువాత నెల‌కు రూ.99 చెల్లించాలి. లేదా రూ.149 చెల్లించి ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే 5 మంది కుటుంబ స‌భ్యులు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. ఇక ఈ యాప్ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై యూజర్ల‌కు ల‌భిస్తుంది.
స్పాటిఫై మ్యూజిక్ నెలకు రూ.119...
స్పాటిఫై మ్యూజిక్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీసు. స్పాటిఫై వెర్షన్ ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ప్రకటనలు ఉంటాయి. ఈ సర్వీసును ఉపయోగించుకోవాలంటే నెలకు 119రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ మరియు ఐఓఎస్ లలో అందుబాటులో ఉంది. ఈ సర్వీసు ద్వారా యూజర్లు ఫ్రీగా మ్యూజిక్ వినవచ్చు. ప్రీమియం అకౌంట్ కోసం సైన్ అప్ చేసిన వారికి నెలరోజుల పాటు ఫ్రీ ట్రయల్ను కంపెనీ అందిస్తోంది. ప్రీమియం అకౌంట్ తో యూజర్లు కూడా ఆఫ్ లైన్లో మ్యూజిక్ సేవలను పొందవచ్చు. అంతేకాదు డివైజులో పాటలను కూడా సేవ్ చేసుకోవచ్చు. 

యాపిల్ మ్యూజిక్ నెలకు రూ.120....
యాపిల్ మ్యూజిక్ ఐఓఎస్, ఆండ్రాయిడ్లో అందుబాటులో ఉంది. యాపిల్ మ్యూజిక్ సబ్ స్రిప్షన్ తీసుకోవాలనుకుంటే నెలకు 120రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్వీసుకోసం మీరు సైన్ అప్ చేసినట్లయితే ఒక నెల ఫ్రీగా పొందుతారు. ఇక ఫ్యామిలి ప్లాన్ తీసుకున్నట్లయితే 6మంది కుటుంబ సభ్యులు యాపిల్ మ్యూజిక్ ప్రిమియం సేవలను పొందవచ్చు. 

గూగుల్ ప్లే మ్యూజిక్ నెలకు రూ. 99....
గూగుల్ ప్లే మ్యూజిక్ ఇండియాలో అందుబాటులో ఉంది. యూట్యూబ్ మ్యూజిక్ మాదిరిగానే నెలకు 99రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ సర్వీసును ఫ్రీగా కూడా యాక్సిస్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే మ్యూజిక్ కు ఒక నెల ఫ్రీగా అందిస్తుంది. తర్వాత నెలకు 99రూపాయలు చెల్లించాలి. ఈ సర్వీసులో లక్షలాది పాటలు, వీడియోలు, రేడియో స్టేషన్లు ఉన్నాయి. 

గానా మ్యూజిక్ నెలకు రూ. 99....
గానా మ్యూజిక్ సర్వీసులో 30 మిలియన్ల పాటలు ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది ఫ్రీ వెర్షన్. అయినప్పటికీ నెలకు 99రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి 499రూపాయలు చెల్లించి సర్వీసును పొందవచ్చు. అంతేకాదు డెస్క్ టాప్ లోనూ అందుబాటులో ఉంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్ లోనూ గానా మ్యూజిక్ సేవలను పొందవచ్చు. 

జియోసావన్ మ్యూజిక్ నెలకు రూ. 99...
జియో సావన్ మ్యూజిక్ ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ మ్యూజిక్ యాప్ ను ఎవరైనా సరే ఫ్రీగా పొందవచ్చు. కాకపోతే యాడ్స్ ఉంటాయి. జియోసావన్లో మొత్తం 45మిలియన్ పాటలు ఉన్నాయి. డెస్క్ టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో  ఈ సర్వీసును పొందవచ్చు. 

జన రంజకమైన వార్తలు