• తాజా వార్తలు

రోజుకు 2జిబి డేటా కన్నా ఎక్కువ ఇస్తున్న వాటిల్లో ఏది బెస్ట్ 

దేశీయ టెలికాం రంగంలో టారిఫ్ వార్ రోజు రోజుకు వేడెక్కుతుందే కాని దాని మంటలు చల్లారడం లేదు. దిగ్గజాలన్నీ తమ కస్టమర్లను కాపాడుకునేందుకు పోటీలు పడుతూ అత్యంత తక్కువ ధరకే డేటా , కాల్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. అయితే వినియోగదారులు ఏది మంచి ప్లాన్ అని తెలియక ఒక్కోసారి సతమతవుతున్నారు. అన్ని టెల్కోలు బెస్ట్ ప్లాన్లను అందించడంతో వినియోగదారుడు బెస్ట్ ఏదో తెలియక అయోమయానికి గురవతున్నాడు. ఈ శీర్షికలో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో డైలీ డేటా అదనపు ఫీచర్లను అందిస్తున్న అన్ని నెట్ వర్క్ ల వివరాలను ఇస్తున్నాం. బెస్ట్ ఏదో మీరే సెలక్ట్ చేసుకోండి.

ఎయిర్‌టెల్ 
28 రోజుల పాటు మరింత డేటా కావాల్సిన వారు ఎయిర్‌టెల్ రూ. 249,రూ.349 ప్లాన్లలోకి మారవచ్చు. రూ. 249 ప్లాన్ లో రోజుకు 2జిబి డేటాతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ 100 ఎసెమ్మెస్ లను ఈ ప్లాన్ లో అందిస్తోంది. అలాగే రూ.349 ప్లాన్లో రోజుకు 3జిబి డేటా అన్ లిమిటెడ్ కాల్స్ 100 ఎసెమ్మెస్ లను 28 రోజుల పాటు అందిస్తోంది.

రిలయన్స్ జియో
ఈ దిగ్గజం రోజుకు 2జిబి, 3జిబి, 4జిబి, 5జిబి డేటా ప్లాన్లను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. జియో రూ. 198 ప్లాన్ ద్వారా 28 రోజులకు 2జిబి డేటాను అందిస్తోంది. దీంతో పాటు 100 ఎస్సెమెస్ లను కూడా అందిస్తోంది. అలాగే రూ.299 ప్లాన్లో రోజుకు 3జిబి డేటా, రూ.509 ప్లాన్లో రోజుకు 4జిబి డేటాను 28 రోజుల పాటు అందిస్తోంది. ఇంకా ఎక్కువ డేటా కావాలనుకున్నవారు రూ.709 ప్లాన్ కి మారవచ్చు. ఈ ప్లాన్లో రోజుకు 5జిబి డేటా చొప్పున మొత్తం 140 జిబి డేటాను అందిస్తోంది.

వొడాఫోన్
ఈ టెలికాం రూ.255 ప్లాన్లో భాగంగా రోజుకు 2జిబి డేటా అలాగే అన్ లిమిటెడ్ లోకల్ నేషనల్ కాల్స్ 100 ఎస్మెమెస్ లను 28 రోజుల పాటు అందిస్తోంది.  ఇంకా అదనపు డేటా కావాలనుకున్నవారు రూ.349, రూ. 549 ప్లాన్లకు మారవచ్చు. ఇందులో రోజుకు 3జిబి డేటా, అలాగే రూ.549 ప్లాన్లో రోజుకు 3.5జిబి డేటాను కంపెనీ అందిస్తోంది. ఇంకా ఎక్కువ డేటా కావాలనుకున్న వారికి రూ. 799 ప్లాన్లో రోజుకి 4.5 జిబి డేటాను అందిస్తోంది. కాల్స్, మెసేజ్ లు పై ప్లాన్లలాగానే లభిస్తాయి. 

జన రంజకమైన వార్తలు