• తాజా వార్తలు

రూ.100 లోపు డేటా టాప్-అప్ ప్లాన్లలో ఏది బెస్ట్

టెలికాం కంపెనీలు తమ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, టారిఫ్ మరియు కాంబో ప్లాన్స్ ను అందిస్తున్నాయి. అయితే అవి ఒక్కోసారి అయిపోయిన సంధర్భంలో అదనపు డేటా కావాలనుకునే వారి వారికి యాడ్ ఆన్ ప్యాక్స్ ప్రవేశపెట్టాయి. రోజువారీ డేటా అయిపోయిన తరువాత ఈ అదనపు డేటాను యూజర్లు వినియోగించుకోవచ్చు. ఇప్పుడు  మార్కెట్లో రూ. 100లోపు వాడకానికి  సిద్ధంగా ఉన్న డేటా యాడ్ ఆన్ ప్యాక్ లను ఓ సారి పరిశీలిద్దాం. 

రిలయన్స్ జియో 
జియోలో రూ.11, రూ.21, రూ.51, పేరిట మూడు యాడాన్ ప్యాక్స్ ప్రస్తుతం కస్టమర్లకు లభిస్తున్నాయి. వీటికి ప్రత్యేకమైన వాలిడిటీ ఏమీ లేదు. కస్టమర్ వాడుతున్న ప్లాన్ వాలిడిటీ ఎప్పటి వరకు ఉంటే అదే వాలిడిటీ ఈ ప్యాక్స్‌కు కూడా వర్తిస్తుంది. ఇక ఈ ప్యాక్స్‌లో రూ.11కు 400 ఎంబీ మొబైల్ డేటా, రూ.21కి 1 జీబీ, రూ.51కి 3 జీబీ, లభిస్తుంది.

ఎయిర్‌టెల్ 
రూ.29  ప్లాన్ లో  520MB 2G/3G/4G డేటా ఉంటుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు . అలాగే రూ.48 ప్లాన్లో 1GB హై స్పీడ్ డేటా యూజర్లకు లభిస్తుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది. అలాగే రూ.98 ప్లాన్లో 3GB హై స్పీడ్ డేటా యూజర్లకు లభిస్తుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది. 

వొడాఫోన్ 
రూ.27  ప్లాన్ లో  450MB 2G/3G/4Gడేటా ఉంటుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు . అలాగే రూ.49 ప్లాన్లో 1GB 2G/3G/4G డేటా యూజర్లకు లభిస్తుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది. అలాగే రూ.98 ప్లాన్లో 3GB 2G/3G/4G డేటా యూజర్లకు లభిస్తుంది. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది. ఇది దాటితే నార్మల్ ఛార్జి చేస్తారు. 

జన రంజకమైన వార్తలు