• తాజా వార్తలు

ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్‌ సిమన్‌కు 25 ఏళ్లు, ఓ సారి గుర్తు చేసుకుందామా 

స్మార్ట్‌ఫోన్ అనేది ఈరోజుల్లో అందరిదగ్గరా కనిపిస్తోంది. భారతదేశ జనాభా 130 కోట్లకు పైగా ఉంటే వీరిలో స్మార్ట్‌ఫోన్లు వాడేవారి సంఖ్య 30 కోట్లకు పైగానే ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్లు కాకుండా ఫీచర్ ఫోన్లు వాడేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువేనని చెప్పుకోవాలి. మరి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసా..అసలు అది ఎలా ఉంటుందో తెలుసా. స్మార్ట్ పోన్ మార్కెట్లోకి వచ్చి దాదాపు 25 సంవత్సరాలు అవుతోంది. ఫస్ట్ స్మార్ట్ పోన్ ఆగస్టు 16, 1994లో బయటకు వచ్చింది. అయితే అది అంతకు ముందే 1992లో మార్కెట్లోకి వచ్చినా పూర్తి స్థాయిలో మార్కెట్లోకి వచ్చింది మాత్రం 1994లో అని చెప్పవచ్చు. ఐబిఎమ్ సిమన్ పేరుతో వచ్చిన ఈ ఫోన్ అప్పట్లో ఓ సంచలనం. లాస్ వెగాస్ లో ప్రదర్శన కూడా నిర్వహించారు. అప్పట్లో ఎవరూ స్మార్ట్ ఫోన్లు వాడేవారు కాదు. ఈ ఫోన్ వచ్చిన తరువాతనే స్మార్ట్ ఫోన్ల యుగం ప్రారంభమైంది. 25 సంవత్సరాలు అయిన సందర్భంగా దీని గురించి ఓ సారి తెలుసుకుందాం.

ఈ ఫోన్ కి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ బరువు దాదాపు 1.12 పౌండ్స్ ఉంటుంది. మెజ్యూరింగ్ 64/38 ఎం ఎం ఉంటుంది. 4.7 ఇంచ్ మోనోక్రోమ్ బ్యాక్ లిట్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. స్కీన్ టచ్ తో పాటు ఆపరేటింగ్ కూడా స్టైలిష్ గా ఉంటుంది.అప్పట్లో ఇప్పుడున్న యాప్స్ అంతగా లేవు. క్యాలెండర్ అండ్ ఆర్గనైజర్ అలాగే మేసేజింగ్ కాలింగ్ లాంటి సదుపాయాలు మాత్రమే ఉండేవి. దీని ధర అప్పట్లో దాదాపు 899 డాలర్లు..ఈ ఫోన్లు దాదాపు 50 వేల వరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

అమెరికాకు చెందిన సెల్యులార్ కంపెనీ బెల్‌సౌత్‌తో కలిసి ఐబీఎం తయారు చేసిన స్మార్ట్‌ఫోన్ ఇది. 'సిమన్' అని పేరు పెట్టారు. సిమన్ స్మార్ట్‌ఫోన్ 8 x 2.5 x1.5 అంగుళాలతో ఉండేది. G.I. Joe Walkie Talkie పోలినట్టు కనిపించేది. సిమన్ స్మార్ట్‌ఫోన్‌ను 1992 నవంబర్‌లో ఆవిష్కరించారు. 1994 ఆగస్ట్ 16న రిలీజ్ చేశారు.పర్సనల్ కమ్యూనికేటర్‌గా ఉండాలనే ఉద్దేశంతో సిమన్‌ను సెల్యులార్‌ ఫోన్‌గా రూపొందించారు. కంప్యూటర్‌గా పనిచేయడం అనేది రెండో ప్రియార్టీగా ఉండేది.సాధారణంగా సెల్‌ఫోన్‌లో ఉండే ఫీచర్లన్నీ ఇందులో ఉన్నాయి. 911 ఎమర్జెన్సీ కాల్ బటన్, చివరగా డయల్ చేసిన 10 నెంబర్లు, అడ్రస్ బుక్, ఆటో డయల్ లాంటి ఫీచర్లున్నాయి.
 

జన రంజకమైన వార్తలు