• తాజా వార్తలు

రివ్యూ-ఎంఐ సౌండ్ బార్

టెక్నాలజీ డెవలప్ అవుతోన్న కొద్దీ ఎన్నో రకాల టీవీలు మార్కెట్లో అందుబాటులోకి ఉంటున్నాయి. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను అందిస్తూ...కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి కంపెనీలు. 4కె స్క్రీన్లు, స్మార్ట్ కనెక్టివిటి , హెచ్డిఆర్, వంటి మల్టిపుల్ పోర్ట్స్ ను అందిస్తూ పోటీ పడుతున్నాయి. అయితే టీవీల్లో సౌండ్ క్వాలిటీ అనేది చాలా ముఖ్యం. సౌండ్ క్వాలిటీ బాగుంటేనే.... పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి రిలీజ్ అవుతున్న టీవీల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో యూజర్లను అంతగా ఆకట్టుకోలేపోతున్నాయి. 

సౌండ్ క్వాలిటీ విషయానికొస్తే...ఎక్స్ టర్నల్ ఆడియో సిస్టమ్ కారణం అని చెప్పాలి. ఇది స్పీకర్లను సింపుల్ పెయిర్ గా ఉంటుంది. మల్టిపుల్ ఛానెల్ స్పీకర్ ప్యాకేజీ, హెడ్ ఫోన్స్, లేదా సౌండ్ బార్. ఒక మంచి మల్టిపుల్ ఛానెల్ స్పీకర్ ప్యాకేజీ తరచుగా సౌండ్ క్వాలిటికి బెస్ట్ ఆప్షన్ అయినట్లయితే...సౌండ్ బార్లు..పాపులర్ ఆప్షన్స్ తో 10వేలకు యూజర్లకు అందుబాటులో ఉంటున్నాయి షియోమీ ఎంఐ సౌండ్ బార్ బడ్జెట్ సెగ్మెంట్లో నిలుస్తోంది. ఎందుకంటే ఎంఐ సౌండ్ బార్...ఆఫర్లు చాలా ఉన్నాయి. 4,999రూపాయల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సౌండ్ బార్ ద్వారా మీ టీవీకి ఆడియో మరింత మెరుగ్గా ఉంటుంది. 

డిజైన్, స్పెసిఫికేషన్లు...
ఎంఐ సౌండ్ బార్ తక్కువ ధరకే లభ్యమవుతున్నప్పటికీ....ఎంఐ సౌండ్ బార్ కోసం చాలా చెక్ చేయాల్సి ఉంటుంది. 8డ్రైవర్లను 83సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. వైడ్ రేంజ్ డ్రైవర్స్, నాలుగు పాసివ్ రేడియేటర్స్ పట్టుకోవడానికి చాలా ఫ్రిక్వెన్సీగా ఉంటాయి. ముందు భాగంలో ఒక ఫ్యాబ్రిక్ కవర్ను కూడా కలిగి ఉంటుంది. స్పీకర్ చుట్టూ ఎడ్జెస్ చాలా సున్నితంగా ఉ:టాయి. వెనక భాగానా పవర్ స్విచ్ కూడా ఉంటుంది. 

సౌండ్ బార్ ఫర్ఫామెన్స్ ...
సౌండ్ బార్లు....టీవీ సౌండ్ అవుట్ పుట్ ను అప్ డేట్ చేయడానికి ఏర్పాటు చేశారు. ఈ ఎంఐ సౌండ్ బార్ సౌండ్ క్వాలిటీ విషయంలో సక్సెస్ అయ్యింది. కేవలం 4,999రూపాయలకు అందుబాటులో ఉంది. 
ఇక సౌండ్ విషయంలో చూసినట్లయితే...ఎంఐ సౌండ్ బార్ దాదాపుగా 20వాట్స్ వెడల్పుగా ఉన్న అవుట్ పుట్ ను కలిగి ఉంటుంది. మీరు ఊహించినదానికంటే ఎక్కువ సౌండ్ ను వెలువరుస్తుంది. అంతేకాదు ఫ్రంట్ ఫైరింగ్ డ్రైవర్స్ కూడా ఉన్నాయి. 

జన రంజకమైన వార్తలు