• తాజా వార్తలు

రివ్యూ- జియో వ‌ర్సెస్ ఎయిర్‌టెల్‌- 6 నెల‌ల ప్లాన్స్‌పై ఓ మినీ రివ్యూ

టెలీకాం కంపెనీల మ‌ధ్య పోటీ తీవ్ర‌మ‌వుతోంది. కస్ట‌మ‌ర్లు ఎక్కువ కాలం త‌మ నెట్‌వ‌ర్క్‌ను ఉప‌యోగించేలా కంపెనీలు  లాంగ్ ట‌ర్మ్ ప్లాన్స్‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. ఈ విష‌యంలో రిల‌య‌న్స్ జియో, ఎయిర్‌టెల్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోటీ నెల‌కొంది. ఈ రెండు సంస్థ‌లు ఇప్పుడు ఆరు నెల‌ల డేటా ప్లాన్స్‌ను ప్ర‌వేశ‌పెట్టాయి. రూ.594తో రీచార్జ్ చేసుకుంటే అప‌రిమిత‌మైన లోక‌ల్ కాల్స్‌, డేటాతో పాటు ఉచిత ఎస్ఎంఎస్‌లు. ఇదే ర‌క‌మైన ఆఫర్స్‌ను ఎయిర్‌టెల్ కూడా రూ.597 ప్లాన్‌లో అందిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ప్లాన్స్ ఎలా ఉండ‌బోతున్నాయో చూద్దాం!

జియో రూ.594 ప్లాన్‌
* రోజుకి 500 ఎంబీ డేటా ల‌భిస్తుంది. అంటే మొత్తం 180 రోజుల‌కు 90 జీబీ.
* డేటా పూర్త‌యిన త‌ర్వాత 64 కేబీపీఎస్‌తో డేటా ఉచితంగా పొంద‌వ‌చ్చు. 
* అప‌రిమిత‌మైన వాయిస్ కాల్స్‌(లోక‌ల్‌, ఎస్టీడీ, నేష‌న‌ల్ రోమింగ్‌), రోజుకి 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు. 
* 180 రోజుల వ‌ర‌కూ వ్యాలిడిటీ.
ఈ ప్లాన్‌లో లాభ‌న‌ష్టాలు
* 90 జీబీ వ‌ర‌కూ డేటా వ‌స్తుంది. 6జీబీ వోచ‌ర్ ల‌భిస్తుంది. మొత్తం డేటా వినియోగించేసినా 64 కేబీపీఎస్ వేగంతో డేటాను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ ఆఫ‌ర్ కేవ‌లం జియో ఫోన్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. అంతేగాక రోజూ డేటా లిమిట్ ఉండటంతో కొంత ఇబ్బందిగా మారొచ్చు.  

ఎయిర్‌టెల్ రూ.597 ప్లాన్‌
* రోజుకి అప‌రిమిత‌మైన డేటా వినియోగించుకోవ‌చ్చు. గ‌రిష్టంగా 10 జీబీ వ‌ర‌కూ ల‌భిస్తుంది 
* డేటా పూర్త‌యిన త‌ర్వాత 128 కేబీపీఎస్‌తో డేటా ఉచితంగా పొంద‌వ‌చ్చు. 
* అప‌రిమిత‌మైన వాయిస్ కాల్స్‌(లోక‌ల్‌, ఎస్టీడీ, నేష‌న‌ల్ రోమింగ్‌), రోజుకి 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు. 
* 168 రోజుల వ‌ర‌కూ వ్యాలిడిటీ.
ఇందులో ప్ల‌స్‌లు, మైన‌స్‌లు
* ఎయిర్‌టెల్ యూజ‌ర్లంద‌రికీ ఇది వ‌ర్తిస్తుంది. రోజుకి డేటా లిమిట్ ఉండ‌దు. అప‌రిమిత కాల్స్, ఎస్ఎంఎస్‌లు, అంతేగాక డేటా అయిపోతే 128 కేబీపీఎస్ వేగంతో డేటా పొంద‌వ‌చ్చు. ఇక న‌ష్టాల విష‌యానికొస్తే.. కేవ‌లం 10 జీబీ మాత్రమే ల‌భిస్తుంది. ఈ ప్లాన్ రేటు కూడా కొద్దిగా ఎక్కువే. జియోతో పోల్చుకుంటే వ్యాలిడిటీ త‌క్కువ రోజులే.

జన రంజకమైన వార్తలు