• తాజా వార్తలు

రివ్యూ - వన్ ప్లస్ 6 ఐ ఫోన్ ను ఢీ కొట్టేంత ఏముంది దీంట్లో ?

ప్రముఖ మొబైల్ తయారీదారు అయిన వన్ ప్లస్ తన యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అయిన వన్ ప్లస్ 6 ను ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదల చేసింది. మరుసటి రోజే ఇండియా లో కూడా ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. దీనియొక్క ముందు వెర్షన్ కంటే కొద్దిపాటి మార్పులతో విడుదల అయిన ఈ స్మార్ట్ ఫోన్ సంచలనాలు సృష్టిస్తుంది. ఎంతగా అంటే ఆపిల్ యొక్క ఐ ఫోన్ కు పోటీ గా నిలిచే అంతగా! గత కొన్ని సంవత్సరాల నుండీ ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో తన స్థానాన్ని పదిలపరచుకునే దిశగా అడుగులు వేస్తున్న ఈ కంపెనీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో అత్యంత వేగంగా వృద్ది చెందిన బ్రాండ్ గా నిలిచింది. అంతేగాక సామ్సంగ్ తర్వాతి స్థానం లో కూడా నిలిచింది. వన్ ప్లస్ 6 స్మార్ట్ ఫోన్ , ఐ ఫోన్ కు పోటీగా మారిన నేపథ్యం లో అసలు ఇది ఎలా పోటీ ఇస్తుంది? దీనికి ఉన్న విశిష్టతలు ఏమిటి? అనేది ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ఈ రెండు ఫోన్ ల మధ్య గల సారూప్యత లు ఏమిటి ?

వన్ ప్లస్ 6 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం తో లభిస్తుంది. ఐ ఫోన్ లో ఉండే ఫీచర్ లన్నీ దాదాపుగా ఇందులోనూ ఉంటాయి. ఐ ఫోన్ ధర తో పోలిస్తే ఇది అందులో సగం మాత్రమే ఉంటుంది. ఐ ఫోన్ యొక్క ధర రూ 95,390/- లుగా ఉండగా ఇది కేవలం  రూ 40,000/- లకే లభిస్తుంది. అయితే ఐ ఫోన్ ప్రేమికుల ను మాత్రం ఇది ఆకర్షించడం మాత్రం కష్టమనే చెప్పవచ్చు . ఐ ఫోన్ లాంటి ఫీచర్ లను ఇష్టపడుతూ ధర ను పరిగణన లోనికి తీసుకునే వారిని మాత్రం ఇది ఖచ్చితంగా ఆకర్షిస్తుందని మాత్రం చెప్పవచ్చు. ఇందులో రెండు రకాల ఆప్షన్ లు ఉంటాయి. 6 GB RAM మరియు 64 GB స్టోరేజ్ తో లభించే వెర్షన్ రూ 34,999/- లకు లభిస్తుంది. అలాగే 8 GB RAM 128 GB స్టోరేజ్ వెర్షన్ కావాలంటే మరొక రూ 4,000/- లు చెల్లించాలి.  ఇందులోనే మార్వెల్ అవెంజర్ అభిమానుల కోసం ఒక స్పెషల్ ఎడిషన్ కూడా ఉంది. అది రూ 44,999/- ల ధర లో లభిస్తుంది. ఇది వెనుక వైపు కెవ్లార్ పాటర్న్ మరియు అవెంజర్ లోగో ,256 GB స్టోరేజ్ తో లభిస్తుంది.

వన్ ప్లస్ 6 యొక్క ఫీచర్ లు

6.3 ఇంచ్ AMOLED డిస్ప్లే

క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్

16+20 మెగా పిక్సెల్ డ్యూయల్ రేర్ కెమెరాలు

3300mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్

ఫింగర్ ప్రింట్ మరియు ఫేస్ అన్ లాక్

జన రంజకమైన వార్తలు