ముఖేష్ అంబానీ నేతృత్వం లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 41 వ వార్షిక సాధారణ సమావేశం (AGM ) నిన్న జరిగింది. ఈ సమావేశం లో ముఖేష్ అంబానీ వివిధ అంశాలను ప్రస్తావించారు. డిజిటల్ ఇండియా విజన్ కు తాము ఎంత దగ్గరగా ఉన్నదీ, కేవలం 22 నెలల వ్యవధిలోనే జియో తన సబ్ స్క్రైబర్ బేస్ ను ఎలా 215 మిలియన్ లకు చేరుకున్నదీ ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రకటనలు కూడా చేసారు. జియో ఫీచర్ ఫోన్ 2 , జియో ఫోన్ కు వాట్స్ అప్, ఫేస్ బుక్ మరియు యూ ట్యూబ్ యాప్ ల యాక్సెస్, జియో గిగా ఫైబర్ మొదలైనవి ఇందులో ప్రముఖమైనవి. నిన్న జరిగిన ఈ రిలయన్స్ AGM లో అనౌన్స్ చేసిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం అందిస్తున్నాం.
జియో గిగా ఫైబర్
ఇంతకుముందు జియో ఫైబర్ గా చెప్పుకుంటున్న జియో గిగా ఫైబర్ కు సంబంధించి ఈ AGM లో అధికారిక ప్రకటన వచ్చింది. కంపెనీ దీనిని మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైబర్ బేస్డ్ బ్రాడ్ బ్యాండ్ సొల్యూషన్ గా చెప్పడమే కాక దీని స్పీడ్ 1 Gbps వరకూ ఉంటుందని చెబుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1100 సిటీ లలోని ఇల్లు, వ్యాపారులు, చిన్న మరియు మధ్య తరహా ఎంటర్ ప్రైజెస్ లతో పాటు పెద్ద తరహా వాటికీ కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించడమే లక్ష్యంగా దీని ప్రణాళికలు ఉన్నట్లు నిన్నటి AGM లో ప్రకటించారు. ఈ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ లో IPTV, ల్యాండ్ లైన్, వీడియో కాన్ఫరెన్సింగ్, వర్చ్యువల్ రియాలిటీ గేమింగ్ మొదలైన సేవలు ఇందులో ఉండనున్నాయి. ఈ జియో గిగా ఫైబర్ లో జియో ఫైబర్ రూటర్ మరియు గిగా ఫైబర్ సెట్ అప్ బాక్స్ లు ఉండనున్నాయి. ఆసక్తి కలిగిన వారు మై జియో యాప్ ద్వారా కానీ మరియు jio.com ద్వారా ఆగస్ట్ 15 నుండీ రిజిస్టర్ చేసుకోవచ్చు.
జియో ఫోన్ 2
జియో ఫోన్ యొక్క తర్వాతి వెర్షన్ నే జియో ఫోన్ 2 గా పిలుస్తున్నారు. ఈ రెండింటికీ ప్రధానమైన తేడా డిజైన్. చూడడానికి ఇది జియో ఫోన్ లాగా ఉండక బ్లాక్ బెర్రీ కర్వ్ ను పోలి ఉంటుంది. ఇందులో QWERTY కీ ప్యాడ్ ఉండనుంది.2.4 ఇంచ్ డిస్ప్లే, 512 MB ర్యాం, 4 GB ఇంటర్నల్ మెమరీ, మైక్రో sd కార్డు స్లాట్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఇలా మిగిలిన ఫీచర్లు అన్నీ జియో ఫోన్ మాదిరిగానే ఉండనున్నాయి. జియో ఫోన్ 2 KaiOS పై రన్ అవుతూ వాట్స్ అప్ మరియు యూ ట్యూబ్ అప్లికేషను లను కలిగి ఉండనుంది.
వాట్స్ అప్ మరియు యూ ట్యూబ్ లను కలిగి ఉండనున్న జియో ఫోన్
ఇకపై జియో ఫోన్ మరియు జియో ఫోన్ 2 , వాట్స్ అప్ మరియు యూ ట్యూబ్ అప్లికేషను లను కలిగి ఉండనున్నాయి. ఆగస్ట్ 15 నుండీ ఇవి అందుబాటులోనికి రానున్నాయి. అయితే గత సంవత్సరం విడుదల అయిన జియో ఫోన్ లో ఇవి లేకపోవడం గమనార్హం.
జియో ఫోన్ మాన్ సూన్ హంగామా ఆఫర్
జియో ఫోన్ యొక్క మాన్ సూన్ హంగామా ఆఫర్ ను AGM లో ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న జియో ఫీచర్ ఫోన్ ను జియో ఫోన్ 2 కు ఎక్స్ చేంజ్ చేసుకునే వారికీ మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. కేవలం రూ 501 లకే ఈ ఆఫర్ లో భాగంగా జియో ఫోన్ 2 లభించనుంది. జూలై 21 నుండి అమలులోనికి రానున్న ఈ ఆఫర్ ను వినియోగించుకోవాలి అంటే సెక్యూరిటీ డిపాజిట్ గా రూ 1500/- లు చెల్లించాలి. ఈ మొత్తం తర్వాత రిఫండ్ చేయబడుతుంది.
215 మిలియన్ల కు చేరిన జియో సబ్ స్క్రైబర్ రీచ్
ఎయిర్ టెల్ మరియు వోడా ఫోన్ ల తర్వాత మూడవ అతి పెద్ద టెలికాం కంపెనీ గా రిలయన్స్ జియో ఉన్నది. కేవలం 22 నెలలలోనే దీని సబ్ స్క్రైబర్ బేస్ 215 మిలియన్లకు చేరుకుంది. దీనియొక్క నెలవారీ డేటా యూసేజ్ నెలకు 125 కోట్ల GB లకు పెరిగింది.అలాగే వాయిస్ కాల్స్ కూడా ప్రతీ రోజూ 250 కోట్ల నిమిషాలకు పెరిగాయి. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఇండియా లో 25 మిలియన్ల మంది ఈ జియో ఫోన్ ను కొనుగోలు చేశారు.