• తాజా వార్తలు

రివ్యూ - గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీ నుంచి గెలాక్సీ నోట్ సిరీస్‌లో రెండు సంచలన ఫోన్లు విడుదలయ్యాయి. అమెరికాలో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ రెండు వేరియెంట్లతోపాటు నోట్ 10 ప్లస్‌కు గాను 5జీ సపోర్ట్ ఉన్న మరో వేరియెంట్‌ను కూడా కంపెనీ లాంచ్ చేసింది. 5జీ వేరియెంట్‌లో వచ్చిన ఫోన్లో నోట్ 10 ప్లస్‌లో ఉన్న ఫీచర్లే ఉంటాయి. కాకపోతే ఇందులో 5జీ ఫీచర్ ఒక్కటే అదనంగా ఉంటుంది. ఈ ఫోన్ పూర్తి రివ్యూని తొలిసారిగా కంప్యూటర్ విజ్ఙానం మీకందిస్తోంది. 

గెలాక్సీ నోట్‌ 10 పూర్తి ఫీచర్లు
6.3 క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, శాంసంగ్‌ ఎగ్సినోస్‌ 9825 ప్రాసెసర్‌, 10 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 12+16+12 ఎంపీ వెనుక కెమెరా, పంచ్ హోల్ కెమెరా, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌, 1080x2280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, డిస్‌ప్లేల కింద అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, యాంటీ స్పూఫింగ్ ఫీచర్‌, బ్లూటూత్‌ ఎస్ పెన్ స్టయిలస్‌, ఎస్ పెన్‌లో బిల్టిన్ లిథియం టైటానేట్ బ్యాటరీ, 3డీ రెండరింగ్ విత్ 3డీ స్కానింగ్, శాంసంగ్ బిక్స్‌బీ వాయిస్ అసిస్టెంట్, శాంసంగ్ హెల్త్, శాంసంగ్ పే, శాంసంగ్ డెక్స్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్, ఫాస్ట్ చార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్ 2.0, వైర్‌లెస్ పవర్‌షేర్, క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌

గెలాక్సీ నోట్‌ 10+ పూర్తి ఫీచర్లు
6.8 క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, శాంసంగ్‌ ఎగ్సినోస్‌ 9825 ప్రాసెసర్‌, స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 మోడెమ్ ( 5జీ వేరియెంట్‌),10 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 12+16+12+0.3 ఎంపీ వెనుక కెమెరా, పంచ్ హోల్ కెమెరా, 4300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌, 1440x3040 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, డిస్‌ప్లేల కింద అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, యాంటీ స్పూఫింగ్ ఫీచర్‌,  బ్లూటూత్‌ ఎస్ పెన్ స్టయిలస్‌, ఎస్ పెన్‌లో బిల్టిన్ లిథియం టైటానేట్ బ్యాటరీ, 3డీ రెండరింగ్ విత్ 3డీ స్కానింగ్, శాంసంగ్ బిక్స్‌బీ వాయిస్ అసిస్టెంట్, శాంసంగ్ హెల్త్, శాంసంగ్ పే, శాంసంగ్ డెక్స్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్, ఫాస్ట్ చార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్ 2.0, వైర్‌లెస్ పవర్‌షేర్, క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌, సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌

డిజైన్, డిస్‌ప్లే
గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ రెండు ఫోన్లనూ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్‌తో రూపొందించారు. వినియోగదారులను ఆకట్టుకునే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లను తీర్చిదిద్దారు. రెండు ఫోన్లలోనూ ముందు భాగంలో పంచ్ హోల్ కెమెరా, అలాగే డిస్‌ప్లేల కింద అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను ఏర్పాటు చేశారు. ఇవి యూజర్‌కు చెందిన వేళ్లను పెడితేనే పనిచేస్తాయి. ఫోన్లను ఎవరూ స్పూఫ్ చేయలేని విధంగా యాంటీ స్పూఫింగ్ ఫీచర్‌తో ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్లును తీర్చి దిద్దారు. 

ఎస్ పెన్ హైలెట్ 
నోట్ 10 ఫోన్లతో పాటు బ్లూటూత్‌తో పనిచేసే ఎస్ పెన్ స్టయిలస్‌ను కూడా అందిస్తున్నారు. దీని ద్వారా గెస్చర్ కంట్రోల్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ పెన్‌తో డివైస్‌లో రాసే టెక్ట్స్‌ను ఎంఎస్ వర్డ్, పీడీఎఫ్ డాక్యుమెంట్ల రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎస్ పెన్‌లో బిల్టిన్ లిథియం టైటానేట్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఈ పెన్‌ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 10 గంటల పాటు పనిచేస్తుంది. ఈ ఎస్ పెన్ బరువు కేవలం 3.04 గ్రాములు ఉంటుంది.

అదిరిపోయే ప్రాసెసర్
శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఫోన్లు శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9825 చిప్‌సెట్‌లతో వచ్చాయి. గెలాక్సీ నోట్ 10 ప్లస్ 5జీ వేరియెంట్‌లో అదనంగా స్నాప్‌డ్రాగన్ ఎక్స్50 మోడెమ్ ఉంటుంది. దీని వల్ల వినియోగదారులు ఈ వేరియెంట్‌లో 5జీ సేవలను పొందవచ్చు. 

కెమెరా స్పెషల్ అట్రాక్షన్
నోట్ 10లో వెనుక భాగంలో 3 కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సల్ డ్యుయల్ పిక్సల్ కెపాసిటీని కలిగి ఉంటుంది. మరొక కెమెరా 16 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇంకో కెమెరా 12 మెగాపిక్సల్ టెలిఫొటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇక ముందు భాగంలో 10 మెగాపిక్సల్ డ్యుయల్ పిక్సల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. నోట్ 10 ప్లస్‌లో ఈ కెమెరాలకు అదనంగా డెప్త్ విజన్ లేదా టీవోఎఫ్ కెమెరాను ఏర్పాటు చేశారు. దీంతో ఒక వస్తువును లేదా వ్యక్తిని 3డీ స్కానింగ్ చేసి దాన్ని ఒక యానిమేషన్ రూపంలో 3డీ రెండరింగ్ చేసుకోవచ్చు. 

ఇతర ఫీచర్లు
గెలాక్సీ నోట్ 10 ఫోన్లలో ఆండ్రాయిడ్ 9.0 పై ఓఎస్‌, శాంసంగ్ బిక్స్‌బీ వాయిస్ అసిస్టెంట్, శాంసంగ్ హెల్త్, శాంసంగ్ పే, శాంసంగ్ డెక్స్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. శాంసంగ్ డెక్స్ వల్ల ఫోన్లను యూఎస్‌బీ కనెక్షన్‌తో పీసీ, మాక్‌లకు కనెక్ట్ చేసుకుని సులభంగా ఫోన్‌ను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. నోట్ 10 ఫోన్లలో వెనుక భాగంలో గ్లాస్ బ్యాక్‌తో కూడిన గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లకు ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది. 

మన్నికైన బ్యాటరీ
నోట్ 10లో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, నోట్ 10 ప్లస్‌లో 4300 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. వీటికి ఫాస్ట్ చార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్ 2.0, వైర్‌లెస్ పవర్‌షేర్, క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే నోట్ 10 ప్లస్‌లో సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను అదనంగా ఇస్తున్నారు. ఈ ఫీచర్ ద్వారా ఫోన్‌ను కేవలం 30 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే రోజు మొత్తానికి కావల్సిన బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. అలాగే 45 వాట్ల చార్జర్‌తోనూ నోట్ 10 ఫోన్లను చార్జింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

ధర వివరాలు
శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 
(8 జీబీ, 256 జీబీ) - 949.99 డాలర్లు (ఇండియా అంచనా ధర రూ.67,520) 
శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్
 (12 జీబీ, 256 జీబీ) - 1099.99 డాలర్లు (ఇండియా అంచనా ధర రూ.78,180)
శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్
 (12 జీబీ, 512 జీబీ) - 1199.99 డాలర్లు (ఇండియా అంచనా ధర రూ.85,290)
శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 5జీ 
(12 జీబీ, 256 జీబీ) - 1299.99 డాలర్లు (ఇండియా అంచనా ధర రూ.92,400) 
శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ 5జీ
 (12 జీబీ, 512 జీబీ) - 1399.99 డాలర్లు (ఇండియా అంచనా ధర రూ.99,505) 

అందుబాటులోకి ఎప్పుడు ?
ఆగస్టు 23వ తేదీ నుంచి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. గెలాక్సీ నోట్ 10 ప్లస్ 5జీ వేరియెంట్ కూడా అదే తేదీ నుంచి కేవలం అమెరికా మార్కెట్‌లోనే లభ్యం కానుంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఫోన్లు ఔరా గ్లో, ఔరా వైట్, ఔరా బ్లాక్ కలర్ ఆప్షన్లలో వినియోగదారులకు లభ్యం కానున్నాయి. ఇక ఔరా బ్లూ కలర్ వేరియెంట్లను కేవలం శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లోనే ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నారు. బ్లూ కలర్ వేరియెంట్లు కేవలం అమెరికా మార్కెట్‌లోనే వినియోగదారులకు లభ్యం కానున్నాయి. మిగిలిన వేరియెంట్లు ఇతర దేశాల యూజర్లకు లభిస్తాయి. 

ఆఫర్లు ఏంటీ ?
ప్రధాన రీటైల్‌ దుకాణాలు సహా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌, టాటా క్లిక్‌ వంటి ఈ-కామర్స్‌ సైట్లలో ప్రీ బుక్‌ చేసుకొనే సదుపాయం ఉందని సంస్థ తెలిపింది. రీటైల్‌ దుకాణాలు, శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా ప్రీ బుక్‌ చేసుకొనే వారికి రూ.6 వేల వరకూ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ రానుంది. మిగిలిన ఈ-కామర్స్‌ సైట్లలో ఐసీఐసీఐ బ్యాంకు కార్డులకు ఈ ఆఫర్‌ ఇస్తున్నట్లు శాంసంగ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇండియాలో ఆగస్టు 8 నుంచి ఫ్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. అయితే ఇండియాలో వీటి ధర ఎంత ఉంటుందనే దానిపై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. 

జన రంజకమైన వార్తలు