• తాజా వార్తలు

రివ్యూ- శాంసంగ్ ఎం 30

భారత‌ స్మార్ట్‌ఫోన్‌ విపణిలో చైనా కంపెనీలను దీటుగా ఎదుర్కొనేందుకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్‌ దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే శాంసంగ్‌ ఎం10, ఎం20 పేరుతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయగా, ఇదే సిరీస్‌లో ‘ఎం30’ పేరుతో మరో మోడల్‌ స్మార్ట్ ఫోన్‌ను స్మార్ట్‌ఫోన్ ‌ప్రియుల కోసం మార్కెట్లోకి తీసుకువచ్చింది. 

శాంసంగ్ డివైజు రివ్యూ...
గెలాక్సీ ఎం30తోపాటు....శాంసంగ్ ఎం సిరీస్ కు చెందిన గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20  మూడు ఫోన్లు ఆన్ లైన్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.  లైన్ అప్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందిస్తున్న మొట్టమొదటి డివైజు ఇది. అమెజాన్ మరియు శాంసంగ్ అధికారిక వెబ్ సైట్లో అమ్మకానికి రెడీ గా ఉన్నాయి. 

గెలాక్సీ ఎం 30 స్పెసిఫికేషన్స్.....
6.4 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 5, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను అమ‌ర్చారు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఈ ఫోన్‌లో అమ‌ర్చారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ గ్రేడియేష‌న్ బ్లూ, గ్రేడియేష‌న్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా దీనికి చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.14,990గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌రను రూ.17,990 గా నిర్ణ‌యించారు. 

డిజైన్ మరియు డిస్ ప్లే.....
శాంసంగ్ గెలాక్సీ ఎం 30డిజైన్, డిస్ ప్లే ఈ ఫోన్ కు స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నాయి. డివైజు ప్లాస్టిక్ కవర్ తో తయారు చేశారు. ఇది తక్కువ ప్రీమియంతో వస్తుంది. బ్యాక్ ప్యానెల్ చాలా మ్రుదువుగా ఉంటుంది. ఇక కెమెరా మాడ్యూల్ విషయానికొస్తే...ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోపాటు చాలా అందంగా క్లాసిక్ లుక్ వచ్చేలా తయారు చేశారు. కార్నర్ లో ఉన్న డివైజు కర్వ్డ్ బాడీని కలిగి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ తో యూజర్లను ఆకట్టుకుంటుంది. కానీ గ్లాజు ఫోన్ మాదిరిగా కనిపించదు. 

ఇక వాల్యూమ్ రాకర్స్, పవర్ బటన్ దగ్గరగా కుడివైపున ఉంటాయి. ఈ ఫోన్లో కొత్త యుఎస్బి టైప్-సి పోర్టు ఉంది. ప్రత్యేకమైన మైక్రోఎస్డి కార్డు స్లాట్ ను మరింతగా విస్తరించుకోవచ్చు. రెండు సిమ్ లను ఒకేసారి ఉపయోగించుకునేవారికి ఈ ఫోన్ బెటర్ ఆప్షన్. ఇక స్పీకర్ గ్రిల్ కింది బాగా ఉంటాయి. సౌండ్ క్వాలిటీకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇక 6.3అంగుళాల సూపర్ ఆల్మోడ్ ఇన్ఫినిటి యు డిస్ల్పే యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలమైందని చెప్పవచ్చు. ఈ స్క్రీన్లో 2340 x1080 రిజల్యూషన్, 19:5:9 కాపర్ రేషియో తోపాటు 90శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, అద్భుతమైన వ్యూ యాంగిల్స్ కలిగి ఉంది. స్క్రీన్ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా టెక్ట్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్ బెజల్లు చాలా సన్నగా ఉంటాయి. 

జన రంజకమైన వార్తలు