రిలయన్స్ జియో రాకతో అన్ని టెలీకాం కంపెనీల డేటా ప్లాన్స్‌లో రకరకాల మార్పులు జరుగుతూనే ఉన్నాయి. పోటీని తట్టుకునేందుకు ఒకదానిని మించిన మరో ఆఫర్ ప్రకటిస్తున్నాయి. తక్కువ రీచార్జ్‌తో ఎక్కువ లాభాలు అనే సూత్రాన్ని అన్ని కంపెనీలు పాటిస్తున్నాయి. కొద్దిగా అటూ ఇటూలోనే అన్ని కంపెనీలు ఒకే రకమైన సర్వీసులు అందిస్తున్నాయి. రూ.100లకే సూపర్ ఫ్లెక్సిబుల్ డేటా ప్లాన్‌ని జియో విడుదల చేసిన తర్వాత.. మిగిలిన ఆపరేటర్లు కూడా ఇలాంటి ప్లాన్‌నే ప్రవేశపెట్టాయి. మరి రూ.100 లోపు ఉన్న డేటా ప్లాన్స్ గురించి తెలుసుకుందాం!
* జియో రూ.98 ప్లాన్
రూ.100లోపే 4జీ డేటాతో పాటు, అపరిమితమైన లోకల్ కాల్స్ యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది జియో! ఈ ఆఫర్లో రోజుకి 2 జీబీ హైస్పీడ్ 4జీ డేటా వస్తుంది. అపరిమితమైన కాల్స్ చేసుకోవచ్చు. జియో ప్రీమియం యాప్స్‌ని ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేగాక రోజుకు 300 ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు!
* జియో రూ.49 ప్లాన్
ఈ ప్లాన్ కేవలం జియో ఫోన్ యూజర్లకి వర్తిస్తుంది. ఇందులో రోజుకి 50 ఎస్ఎంఎస్లతో పాటు 1 జీబీ 4జీ డేటా వస్తుంది. 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఇందులోనూ జియో ప్రీమియమ్ యాప్స్‌ని ఉచితంగా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
* ఎయిర్టెల్ రూ.99 ప్లాన్
జియోకు పోటీగా ఎయిర్టెల్ ఈ ప్లాన్‌ని తీసుకొచ్చింది. గతంలో ఉన్న 99 ప్లాన్‌లో మార్పులు చేసింది. దీనిని బట్టి.. 28 రోజుల పాటు ఉచిత ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకి 100 ఎస్ఎంఎస్లతో పాటు నెలకి 2జీబీ డేటా అందిస్తోంది.
* ఐడియా రూ.75 ప్లాన్
జియో, ఎయిర్టెల్ కంటే అతి తక్కువ ధరకే ఐడియా కూడా ఒక ప్లాన్‌ను తయారుచేసింది. ఈ ప్లాన్‌లో.. 28 రోజులకు 1 జీబీ డేటాతో పాటు కేవలం 300 నిమిషాలు (లోకల్, ఎస్టీడీ) మాత్రమే వస్తాయి. రోజుకి 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు.
* రూ.100 కంటే తక్కువ విభాగంలో బీఎస్ఎన్ఎల్ రెండు డేటా ప్లాన్లు ప్రవేశపెట్టింది. ఒకటి వాయిస్ కాల్స్ కోసమైతే.. మరొక ప్లాన్‌లో డేటా కూడా లభిస్తుంది.
- బీఎస్ఎన్ఎల్ రూ.99
ఈ ప్లాన్‌లో అపరిమిత మైన కాల్స్ చేసుకోవచ్చు! కానీ ఎటువంటి డేటా ఉండదు. 26 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకి 300 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. వీటితోపాటు కాలర్ ట్యూన్ సర్వీస్ ఉచితం.
- బీఎస్ఎన్ఎల్ రూ.98
26 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉండే ఈ డేటా ప్లాన్‌లో.. రోజుకి 1జీబీ డేటా వస్తుంది. అపరిమిత కాల్స్, ఉచిత ఎస్ఎంఎస్లు ఉండవు. కేవలం డేటా కోసమే దీనిని బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది.