సోషల్ మీడియా సైట్లలో ప్రస్తుతం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. వీటిలో ప్రధానంగా `లైవ్` మూమెంట్స్‌ను మిత్రులతో పంచుకునేందుకు రెండింటిలోనూ లైవ్ వీడియో ఫీచర్‌ను ప్రవేశపెట్టాయి. వీటిలో ఉన్న సారూపత్యలు ఏంటో, ఎలా పనిచేస్తాయో తెలిసినప్పుడే వీటిని ఉపయోగించగలం. మరి ఇవి ఎలా పనిచేస్తాయి? రెండూ ఒకేలా పనిచేస్తాయా లేదా వేర్వేరుగా ఉంటాయా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం!
కామన్ ఫీచర్లు
* ఎవరైనా లైవ్ ఆన్ చేయగానే.. మిగిలిన యూజర్లకి నోటిఫికేషన్ రూపంలో ఈ సందేశం వెళ్లిపోతుంది.
* రెండింటిలోనూ మన లైవ్ వీడియో ఎంత మంది చూస్తున్నారో తెలుసుకోవచ్చు.
* వీడియో ప్లే అవుతున్న సమయంలో.. వాటిని చూస్తున్న వారు ఏ సమయంలోనైనా కామెంట్లు, లైక్ వంటివి చేయవచ్చు.
* వీటిని వీడియో క్రియేట్ చేస్తున్న వ్యక్తులు చూడొచ్చు. అంతేగాక కామెంట్లు, లైక్ చేసిన వారికి రిప్లై ఇవ్వొచ్చు.
* రియల్ టైమ్‌లో లైవ్ వీడియోలను కూడా రికార్డ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది.
* సారూపత్యలు ఎన్ని ఉన్నా.. వీటి మధ్య తేడా కూడా అంతే స్థాయిలో ఉంది. లైవ్ విషయలో ఈరెండూ వేర్వేరుగానే పనిచేస్తాయి.
Facebook Live
కంప్యూటర్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఫేస్బుక్ లైవ్‌ని క్రియేట్ చేసి బ్రాడ్కాస్ట్ చేయచ్చు. దీనిని యూజర్లు కంప్యూటర్ లేదా మొబైల్, దేని నుంచైనా చూడవచ్చు. లైవ్ వీడియో ఆన్ చేసినట్లు అందరి యూజర్లకి తెలిసే అవకాశం లేదు. సెట్టింగ్స్‌లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆన్ చేసిన వారికి మాత్రమే.. లైవ్ వీడియో నోటిఫికేషన్ వెళుతుంది. లైవ్ పూర్తయిన తర్వాత దీనిని వీడియో ఆప్షన్లో సేవ్ చేసుకోవచ్చు. ఇది ఫేస్బుక్ పేజీలో శాశ్వతంగా ఉండిపోయేలా కూడా చేసుకోవచ్చు. దీని వల్ల కొంత కాలం తర్వాత ఎవరైనా, ఎప్పుడైనా ఈ వీడియో చూసి వారి కామెంట్లు ఇవ్వడంతో పాటు షేర్ కూడా చేయవచ్చు. నిరంతరం మిత్రులతో టచ్‌లో ఉండటంతో పాటు.. విజిబులిటీని కూడా పెంచుతుంది.
Instagram Live
ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో తీసిన వీడియో 24 గంటల పాటు మాత్రమే ఉంటుంది. లైవ్ ఆన్ చేస్తే.. మనల్ని ఫాలో అవుతున్న వారందరికీ నోటిఫికేషన్ వెళుతుంది. ఇందులో ఉన్న ఎక్స్ప్లోర్ అనే సెక్షన్ ద్వారా.. వీడియోను ఎక్కువ మంది చూసేలా, కొత్త యూజర్లకు కూడా తెలిసేలా చేయవచ్చు. లైవ్ వీడియో అయిపోయిన తర్వాత సేవ్ చేసుకునే అవకాశం లేదు. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో as of now అనే ఆప్షన్‌ను ఇవ్వలేదు. త్వరలో దీనిని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకురాబోతున్నారు. సేవ్ ఆప్షన్ లేకపోయినా ఫర్వాలేదు. ఎందుకంటే ఇది ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌గా మారిపోతుంది కనుక లైవ్ చూడాలనే ఉత్సాహం యూజర్లలో ఎక్కువవుతుంది.