• తాజా వార్తలు

రివ్యూ- ఫ్లిప్‌కార్ట్ ప్ల‌స్ వ‌ర్సెస్ అమెజాన్ ప్రైమ్‌

ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ల మ‌ధ్య యుద్దం ఎప్పటిక‌ప్పుడు ఆస‌క్తికరంగా ఉంటుంది. వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు కొత్త ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తూనే ఉంటాయి. ప్ర‌స్తుతం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ దేశీ మార్కెట్‌లోకి పాగా వేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అమెజాన్ ఇటీవ‌ల `అమెజాన్ ప్రైమ్` పేరుతో.. ఒక మెంబ‌ర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. రూ.999కే వీడియోలు, సినిమాలు, సంగీతం.. వంటివి ఏడాదికి అప‌రిమితంగా అంద జేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఫ్లిప్‌కార్ట్ కూడా `ఫ్లిప్‌కార్ట్ ప్ల‌స్‌` మెంబ‌ర్‌షిప్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. అది కూడా పూర్తి ఉచితంగా. అందులోనూ అమెజాన్ ప్రైమ్‌లో లేని స‌దుపాలేమీ లేకుండా! 

ఉచిత‌మే.. కానీ అదెప్పుడంటే!
ఇది పూర్తిగా లాయ‌ల్టీ ప్రోగ్రాం. ప్లిప్‌కార్ట్‌లో ఎవ‌రైనా ఏమైనా ఉత్ప‌త్తులు కొంటే.. ఇత‌ర కంపెనీలు ఇస్తున్న‌ట్లే ఇందులోనూ కొన్ని రివార్డ్ పాయింట్లు వ‌స్తాయి. ఇది పూర్తిగా ఉచితంగా అంద‌జేస్తోంద‌ని చెబుతున్నా.. ఇందులోనూ చిన్న మెలిక ఉంది. అదేంటంటే.. ఫ్లిప్‌కార్ట్ ప్ల‌స్‌లో  స‌భ్య‌త్వం పొందాలంటే.. ముందుగా 50 కాయిన్లు(పాయింట్లు) సంపాదించాల్సి ఉంటుంది. ప్లిప్‌కార్ట్‌లో ఏమైనా వ‌స్తువులు కొన్న స‌మ‌యంలో.. ఈ పాయింట్లు వ‌స్తాయి. రూ.250తో ఏదైనా కొంటే.. ఒక కాయిన్ వ‌స్తుంది. ఇలా ఒక ఆర్డ‌ర్‌పై 10 కాయిన్లు మాత్ర‌మే వస్తాయి. ఇక రూ.2500 కంటే ఎక్కువ కొన్నా.. 10 కాయిన్లే వ‌స్తాయి. రూ.250 విలువైన 50 ఆర్డ‌ర్లు గానీ.. రూ.2,500 విలువైన ఐదు ఆర్డ‌ర్లు ఇస్తే వెంట‌నే ఇందులో స‌భ్య‌త్వం పొంద‌గ‌లుగుతార‌న్న‌మాట‌. సో.. ఇలా మ‌నం ఫ్లిప్‌కార్ట్‌కి క‌ట్టే మొత్తం.. రూ.12,500. ఇప్పుడు అర్థ‌మైంది క‌దా.. పూర్తిగా ఉచితం అని చెబుతున్నా.. ఎంత కట్టాల్సి వ‌స్తుందో!! 

ఇందులో ఉన్న లాభాలు ఏంటి? 
మ‌రి ఇంత‌లా క‌ట్టించుకున్న‌ప్పుడు ఏదో వినియోగదారుల‌కు కూడా ఎంతో కొంత లాభం చేకూర్చాలి క‌దా! ఇందులోనూ నాలుగు లాభాలు ఉన్నాయ‌ట‌. అవేంటంటే.. 
* ఫ్లిప్‌కార్ట్ ప్ల‌స్ స‌భ్యులుగా ఉన్న వారికి సుమారు మూడు కోట్ల ఉత్ప‌త్తుల‌పై ఫ్రీ డెలివ‌రీ స‌దుపాయం క‌ల్పిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా వ‌స్తువు కొంటే దానిమీద కొన్ని డెలివ‌రీ చార్జీలు వ‌సూలు చేస్తుంటారు. కానీ ఈ ఫ్లిప్‌కార్ట్ ప్ల‌స్ స‌భ్యుల‌కు మాత్రం ఇది పూర్తి ఉచితం. 
* ఏదైనా సేల్స్‌లో ముందుగా ఈ స‌భ్యుల‌కు అందుబాటులోకి వ‌స్తుంటాయి. ఫోన్లు, వ‌స్తువులు వంటివి కొన్ని ఫ్లాష్ సేల్స్ వంటివి, బిగ్ బిలియ‌న్ సేల్ వంటివి పెట్టిన‌ సంద‌ర్భంలో ఉత్ప‌త్తులు.. ఈ ప్లిప్‌కార్ట్ ప్ల‌స్ స‌భ్యులు త్వ‌ర‌గా కొనుక్కునే అవ‌కాశం క‌ల్పిస్తారు. 
* పైన చెప్పిన రెండూ అమెజాన్ ప్రైమ్‌లోనూ ఉన్నాయి. కానీ అందులో లేనిది.. ఇందులో ఉన్న‌ది ఏంటంటే.. ఫ్లిప్‌కార్ట్ ప్ల‌స్‌లో ఉన్న కాయిన్ల‌ను రీడీమ్ చేసుకోవ‌చ్చు. అంటే వాటిని తిరిగి ఉప‌యోగించుకోవ‌చ్చు. హాట్‌స్టార్‌, జొమేటో, మేక్‌మై ట్రిప్‌.. కేఫ్‌కాఫీడే వంటి థ‌ర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్‌లో వీటిని వోచ‌ర్స్‌గా వాడుకోవ‌చ్చు. సో.. ఎంత ఎక్కువ కొంటే అన్ని ఎక్కువ పాయింట్లు వ‌స్తాయి. 
* A priority helpline for Amazon Prime members.

జన రంజకమైన వార్తలు