ఇన్‌స్టాగ్రామ్.. సోషల్ మీడియాలో ఫేమస్ ఫ్లాట్‌ఫామ్. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఇందులో అకౌంట్లున్నాయి. అయితే ఇందులో నెగిటివ్ కామెంట్లు చేసేవారికీ కొదవలేదు. మన సినిమా యాక్టర్లు, క్రికెటర్లు ఇలా ఏదో ఒక సమయంలో దీనికి బలయినవారే. ఇక అమ్మాయిల అకౌంట్లకు అసభ్యంగా కామెంట్స్ గురించి లెక్కేలేదు. అయితే రీసెంట్ అప్‌డేట్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటి నెగిటివ్ కామెంట్లకు ఈజీగా చెక్‌పెట్టే ఫీచర్ తీసుకొచ్చింది
ఒక్కసారే తీసేయొచ్చు
ఇన్‌స్టాగ్రామ్ నెగిటివ్ కామెంట్ల వల్ల యూజర్లు పడుతున్న ఇబ్బందుల మీద సీరియస్‌గా దృష్టి పెట్టింది. నెగిటివ్ కామెంట్లన్నీ బల్క్‌గా డిలీట్ చేసే ఆప్షన్ తీసుకొచ్చింది. అంతేకాదు అలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసే అకౌంట్లను బ్లాక్ చేయొచ్చు. లేదా రెస్ట్రిక్ట్ చేయోచ్చు. ఈ ఆప్షన్ కింద 25 కామెంట్ల వరకు ఒకేసారి డిలీట్ చేయొచ్చని ఇన్‌స్టాగ్రామ్ తన బ్లాగ్‌లో వెల్లడించింది.
ఎలా చేయాలంటే?
నెగిటివ్ కామెంట్లను బ్లాక్ లేదా రెస్ట్రిక్ట్ చేయడానికి ఆండ్రాయిడ్ లేదా ఐవోఎస్‌లకు వేర్వేరు విధానాలను తీసుకొచ్చింది
ఆండ్రాయిడ్‌లో ఇలా..
* ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ వాడేవారు నెగిటివ్ కామెంట్ను ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి.
* తర్వాత త్రీడాట్స్ మెనూలోకి వెళ్లి బ్లాక్ లేదా రెస్ట్రిక్ట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
* ఇలా ఒక్కో యూజర్‌ను లేదా 25 వరకు కామెంట్లనుఒకేసారి బ్లాక్ లేదా రెస్ట్రిక్ట్ చేయొచ్చు.
ఐవోఎస్‌లో
* ఐవోఎస్‌లో అయితే నెగిటివ్ కామెంట్‌ను టాప్ చేయాలి
* తర్వాత టాప్ రైట్‌లో ఉన్న త్రీడాట్స్ మెనూలోకి వెళ్లి బ్లాక్ లేదా రెస్ట్రిక్ట్‌ను సెలెక్ట్ చేయాలి.
* మేనేజ్ కామెంట్స్ సెక్షన్‌లోకి వెళ్లి ఒకేసారి 25 కామెంట్లను డిలీట్ చేయొచ్చు
* అంతేకాదు మోర్ ఆప్షన్స్‌లోకి వెళ్లి ఒకేసారి ఇలాంటి అకౌంట్లను బ్లాక్ లేదా రెస్ట్రిక్ట్ చేయొచ్చు.