• తాజా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఫ్రెండ్స్‌తో క‌లిసి లైవ్ ఇవ్వ‌డం ఎలా?

లాక్‌డౌన్‌తో అంద‌రూ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వీడియో లైవ్ ఇవ్వ‌డంపై దృష్టి పెట్టారు. సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ కూడా వీటికి బాగా హెల్ప్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియా దిగ్గజాల్లో ఒక‌టైన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ లైవ్ ఇచ్చే వాళ్ల సంఖ్య 60 శాతం పెరిగింది.  మీరొక్క‌రే లైవ్‌లో పాల్గొనడానికి బెరుకు ఉంటే ఫ్రెండ్స్‌తో క‌లిసి కూడా లైవ్ చేయొచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

రెండు ప‌ద్ధ‌తులు
మీ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి మీ ఫ్రెండ్స్‌ను ఆహ్వానించ‌వ‌చ్చు. అలాగే మీ ఫ్రెండ్ లైవ్‌లో మీరు కూడా జాయిన్ కావ‌చ్చు. ఈ రెండు ప‌ద్ధ‌తులు ఎలాగో చూడండి

మీ లైవ్‌లోకి మీ ఫ్రెండ్‌ను ఇన్వైట్ చేయ‌డం ఎలా?
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి.
ఎడ‌మ‌వైపున పైన ఆప్ష‌న్స్ మెనూ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి.
స్క్రోల్ చేస్తే లైవ్ బ‌ట‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు హోస్ట్‌గా లైవ్ వీడియో స్టార్ట‌వుతుంది.
త‌ర్వాత రెండు స్మైలీ ఫేస్‌ల‌తో క‌నిపించే బ‌ట‌న్‌ను ప్రెస్ చేయండి.
మీ లైవ్ వీడియో చూస్తున్న ఫ్రెండ్స్ లిస్ట్‌లో నుంచి కావాల్సిన ఫ్రెండ్‌ను మీతోపాటు జాయిన్ అవ‌మ‌ని ఇన్వైట్ బ‌ట‌న్ నొక్కండి.
మీ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేయ‌గానే స్క్రీన్ రెండుగా స్ప్లిట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరిద్ద‌రూ క‌లిసి లైవ్ చేస్తున్నార‌న్న‌మాట‌.

అలాగే మీ ఫ్రెండ్‌ను లైవ్‌లో నుంచి క‌ట్ చేయ‌వ‌చ్చు కూడా. దీని కోసం స్ప్లిట్ స్క్రీన్ మీద పై భాగంలో ఉన్న x బ‌ట‌న్ మీద క్లిక్ చేస్తే చాలు మీ ఫ్రెండ్ లైవ్‌లో నుంచి క‌ట్ అవుతారు.

ఫ్రెండ్ లైవ్ వీడియోలో జాయిన్ అవ‌డం ఎలా?
మీ ఫ్రెండ్ లైవ్ వీడియో న‌డుస్తుండ‌గా రిక్వెస్ట్ బ‌ట‌న్ నొక్కండి.
వాళ్లు మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే మీకు ఓ నోటిఫికేష‌న్ వ‌స్తుంది. అంతే మీరు వాళ్ల‌తోపాటు లైవ్ ఇవ్వ‌చ్చ‌న్న‌మాట‌.

జన రంజకమైన వార్తలు