• తాజా వార్తలు

ఇండియాలో వాస్తవంగా టిక్‌టాక్ లెక్క‌లు ఇవి !

టిక్‌టాక్‌.. ఒక యాప్ ఇంత పాపుల‌ర్ అయింద‌ని మ‌నం ఇంత‌కు ముందు విన‌లేదు కూడా. లాక్‌డౌన్ కాలంలో ఇండియ‌న్ల‌లో అత్య‌ధిక మందికి ఇదే పెద్ద కాల‌క్షేపం.  కానీ భ‌ద్ర‌తా కార‌ణాల‌రీత్యా మ‌న ప్ర‌భుత్వం ఈ టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేసింది. అప్ప‌టి నుంచి టిక్‌టాక్ పేరు వార్త‌లో మారుమోగిపోతోంది. టిక్‌టాక్‌ను ఆ కంపెనీ కొంటుంది.. ఈ కంపెనీ కొంటుంది త్వ‌ర‌లో మ‌ళ్లీ ఇండియాకు వ‌చ్చేస్తుంది. ఇలా ఎన్నో వార్త‌లు. లేటెస్ట్‌గా రిల‌య‌న్సు  ఈ యాప్‌ను కొంటుంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అస‌లు ఒక యాప్ గురించి ఇంత హంగామా హడావుడి ఎందుకు జ‌రుగుతుంద‌ని మీకెప్పుడైనా డౌట్ వ‌చ్చిందా? అయితే ఈ లెక్క‌లు చూస్తే మీ సందేహాల‌న్నీ తీరిపోతాయి.

ల‌క్షా 45వేల కోట్ల రూపాయ‌ల వ్యాపారం
టిక్‌టాక్ అంటే ఏదో స‌ర‌దాగా వీడియోలు చూపెట్టే యాప్ అనుకుంటున్నారా?  అది మ‌న లెక్క‌. కానీ చైనాకు చెందిన ఈ యాప్ య‌జ‌మాని బైట్ డ్యాన్సు దృష్టిలో ఇదో బంగారు బాతు. ఎంత సంపాద వ‌స్తుందో  ఈ లెక్క‌లు చూడండి. 

* టిక్‌టాక్ ఇండియా యూజ‌ర్ల సంఖ్య 20 కోట్ల పైమాటే.
* అందుకే ఇక్క‌డ బైట్ డ్యాన్సు కొన్ని వేల కోట్ల రూపాయ‌లు టిక్‌టాక్ మీద పెట్టుబ‌డి పెట్టింది
* ఇండియాలో టిక్‌టాక్ వ్యాపార లావాదేవీలు 2 బిలియ‌న్ డాల‌ర్లు  అంటే మ‌న క‌రెన్సీలో చెప్పాలంటే జ‌స్ట్ ల‌క్షా 45 వేల కోట్ల రూపాయ‌లు.
* బ్యాన్ చేసిన‌ప్ప‌టి నుంచి టిక్‌టాక్ దాదాపు ఈ రెండు నెల‌ల్లో కోల్పోయిన ఆదాయ‌మే 45వేల కోట్ల రూపాయ‌ల‌ట‌.

ఇప్పుడు అర్థ‌మైందా టిక్‌టాక్ బ్యాన్ చేయ‌గానే చైనా ఎందుకు గింజుకుంటుందో!!!!

జన రంజకమైన వార్తలు