• తాజా వార్తలు

ట్విట్టర్‌ వాడుతున్నారా, ఈ ఫీచర్లను ఓ సారి చెక్ చేసుకోండి 

సోషల్ మీడియా రోజు రోజుకు విస్తరిస్తూ పోతోంది. కొత్త కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి సంస్థలు గ్లోబల్ వైడ్ గా టాప్ ప్లేసులో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ ఊహించనంత వేగంతో దూసుకుపోతోంది. ఫేస్ బుక్ షట్ డౌన్ అయినప్పుడు యూజర్లు ట్విట్టర్ వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. మీరు ట్విట్టర్ వాడుతున్నట్లయితే ఈ కింది ఫీచర్లను ఓ సారి చెక్ చేసి చూడండి.  

ట్విట్టర్ రిపోర్ట్ 
ట్విట్ట‌ర్‌లో యూజ‌ర్లు ఎవ‌రికైనా త‌ప్పుదోవ ప‌ట్టించే లేదా త‌ప్పుడు స‌మాచారాన్ని ప్రచారం చేసే విధంగా ఉన్న ట్వీట్లు క‌నిపిస్తే వాటిపై రిపోర్ట్ చేయ‌వ‌చ్చు. అందుకు గాను యాప్ లేదా డెస్క్‌టాప్‌లో స‌ద‌రు ట్వీట్ల‌ కింద ఉండే డ్రాప్ డౌన్ మెనూను ఓపెన్ చేయాలి. అందులో రిపోర్ట్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని ఎంచుకుని అనంత‌రం వ‌చ్చే విండోలో ఆ ట్వీట్ ఏవిధంగా త‌ప్పుదోవ ప‌ట్టిస్తుందో, అది యూజ‌ర్ల‌ను ఎలా ప్ర‌భావితం చేస్తుందో కామెంట్ ఎంట‌ర్ చేసి కింద ఉండే స‌బ్‌మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. దీంతో అలాంటి త‌ప్పుదోవ ప‌ట్టించే ట్వీట్ల‌పై ట్విట్ట‌ర్‌కు రిపోర్ట్ వెళ్తుంది. ట్విట్ట‌ర్ టీం అందుకు స్పందించి.. ఆ ట్వీట్ల‌ను పరిశీస్తుంది. నిజంగానే ఆ ట్వీట్లు త‌ప్పుదోవ ప‌ట్టించేవిగా , త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేసే ట్వీట్లుగా ఉంటే వాటిని వెంట‌నే తొల‌గిస్తారు. అలాంటి మిస్‌లీడింగ్ ట్వీట్ల‌ను పెట్టే వారి అకౌంట్ల‌ను బ్లాక్ చేస్తారు. కాగా ఈ ఫీచ‌ర్ ప్ర‌స్తుతం భార‌త్‌లోని ట్విట్ట‌ర్ యూజ‌ర్ల‌కు, యూర‌ప్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్న‌ది. 

బుక్ మార్క్స్
ట్విట్టర్ యాప్‌లో యూజర్లు తమకు నచ్చిన ట్వీట్లను బుక్ మార్క్స్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ఇందుకు గాను ప్రతి ట్వీట్ కింద కొత్తగా షేర్ ఐకాన్‌ను ఏర్పాటు చేశారు. దానిపై ట్యాప్ చేస్తే వచ్చే మెనూలో ఉండే 'Add Tweet to Bookmarks' అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే సదరు ట్వీట్ యూజర్‌కు చెందిన ప్రొఫైల్‌లోని బుక్‌మార్క్స్ సెక్షన్‌లో సేవ్ అవుతుంది. అలా సేవ్ అయిన ట్వీట్‌ను యూజర్ తనకు కావాలనుకున్నప్పుడు బుక్‌మార్క్స్‌ను ఓపెన్ చేసి చదువుకోవచ్చు. అనంతరం అవసరం లేదనుకుంటే ఆ ట్వీట్‌ను డిలీట్ చేయవచ్చు. 

ఈ-మెయిల్, టెక్ట్స్ మెసేజ్‌ల్లో షేర్ 
ట్విట్టర్‌లో పైన చెప్పిన ఫీచర్ మాత్రమే కాకుండా మరో కొత్త ఫీచర్‌ను కూడా యూజర్లకు అందిస్తున్నారు. ఇకపై ట్విట్టర్‌లో ఏ ట్వీట్‌నైనా ఈ-మెయిల్, టెక్ట్స్ మెసేజ్‌లు లేదా డైరెక్ట్ మెసేజ్‌ల రూపంలో యూజర్లు షేర్ చేసుకోవచ్చు. ట్విట్టర్‌కు సంబంధించిన అన్ని ప్లాట్‌ఫాంలలోనూ ఈ కొత్త ఫీచర్లు లభిస్తున్నాయి.

రిప్లై కౌంటర్‌’, ‘కన్వర్సేషనల్‌ ర్యాంకింగ్‌’
ట్విట్టర్‌ మొబైల్‌ యాప్‌లో ‘రిప్లై కౌంటర్‌’, ‘కన్వర్సేషనల్‌ ర్యాంకింగ్‌’ అనే ఫిచర్‌లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫీచర్లతో వినియోగదారులు ట్విట్టర్‌ను వినియోగించే తీరులో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే.. ట్విట్టర్‌లో యూజర్లు పొందిన రిప్లైలను ఇంతకుముందులా క్రొనోలాజికల్‌ ఆర్డర్‌లో కాకుండా వేరే విధంగా చూపిస్తాయి. ఈ ఫీచర్‌లు ప్రాధాన్యత కలిగిన సంభాషణలను పై వరుసలో చూపించడమే కాకుండా.. ఒక ట్వీట్‌కు ఎంతమంది యూజర్లు డైరెక్ట్‌గా రిప్లై ఇచ్చారు అనే విషయం సైతం తెలుపుతాయి.

జన రంజకమైన వార్తలు