• తాజా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో బగ్ కనిపెట్టి రూ. 29 లక్షలు గెలుచుకున్న చెన్నై కుర్రాడు 

ప్రముఖ ఫొటో, వీడియో షేరింగ్ సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయిన ఈ యాప్ లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అకౌంట్స్ ఉన్నాయి. అయితే ఇందులో పెద్ద లోపాన్ని ఇండియా కుర్రాడు కనుగొన్నాడు. ఇన్ స్టాగ్రామ్ లో బగ్ కనుగొని రూ. 29 లక్షలు గెలిచాడు. ఆ బగ్ కారణంగా ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేకుండానే అకౌంట్లను హ్యాక్ చేయొచ్చు. యూజర్ల సమాచారాన్ని తస్కరించొచ్చు. ఈ విషయాన్ని చెన్నైకి చెందిన టెక్కీ కనిపెట్టాడు. ఫేస్ బుక్ నుంచి రూ.20లక్షలు ప్రైజ్ మనీ గెల్చుకున్నాడు.

వివరాల్లోకెళితే లక్ష్మణ్ ముత్తయ్య చెన్నైలో సెక్యూరిటీ రీసెర్చర్గా పనిచేస్తున్నారు. లాగిన్ డీటైల్స్ లేకుండానే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ని హ్యాక్ చేయడం సాధ్యమే అని అతడు నిరూపించాడు. పాస్ వర్డ్ రీసెట్, రికవరీ కోడ్ రిక్వెస్ట్ చేయడం ద్వారా అకౌంట్ ని హ్యాక్ చేయొచ్చని ప్రూవ్ చేశాడు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ టీమ్ దృష్టికి తీసుకెళ్లాడు. అయినప్పటికీ వాళ్లు దాన్ని కనిపెట్టలేకపోయారు.

ఆ తర్వాత కొన్ని ఈమెయిల్స్, ఆధారాలతో కూడిన వీడియోని లక్ష్మణ్ ముత్తయ్య ఫేస్ బుక్ సంస్థ నిపుణులకు సమర్పించాడు. దీంతో వారు దిగివచ్చారు. అతడు చెప్పేది నిజమే అని అంగీకరించారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సెక్యూరిటీ టీమ్స్ వెంటనే రియాక్ట్ అయ్యాయి. బగ్ ని కనుగొని పరిష్కరించాయి. ఆ టెకీ తెలివితేటలకు హ్యాట్సాఫ్ చెప్పాయి. అంతేకాదు బహుమానంగా రూ.20లక్షలు ప్రైజ్ మనీ కూడా ఇచ్చాయి. 

లక్ష్మణ్ ముత్తయ్య ఇలాంటి బగ్స్ కొనుగొనడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. గతంలోనూ ఇలాంటి లోపాలు కనుగొన్నాడు. డేటా డిలీషన్, డేటా డిస్ క్లోజర్ లాంటి బగ్స్ ని ఫేస్ బుక్ లో కనుగొన్నాడు. పాస్ వర్డ్ అవసరం లేకుండానే యూజర్ల ఫొటోస్ ని హ్యాక్ చేయొచ్చని ప్రూవ్ చేశాడు. దీనికి గానూ ఇన్‌స్టాగ్రామ్ సంస్థ రూ. 7 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ బగ్ సహాయంతో మూడో కంటికి తెలీకుండా ప్యాస్‌వర్డ్ రీసెట్‌ను ప్రారంభించవచ్చు. రికవరీ కోడ్ ఎంటర్ చేయండంటూ ప్రామ్ట్‌ రాగానే..ఆ కోడ్‌కు సంబంధించి అన్ని రకాల కాంబినేషన్స్ ట్రైచేసి పాస్ వర్డ్‌ను మార్చేయచ్చు. దాంతో అకౌంట్‌ను మన ఆధీనంలోకి వచ్చేస్తుంది. ద

ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌ను హ్యక్ చేసేందుకు ఈ బగ్ ఆవకాశం కల్పిస్తుంది," అని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఈ మెయిల్ ద్వారా తెలియజేయగా..ఫేస్ బుక్ తన బగ్ బౌంటీ ప్రోగ్రామ్ కింద 30 వేల డాలర్ల రివార్డును ప్రకటించింది. అయితే..యాప్ నుంచి ఈ బగ్‌ను వెంటనే తొలగించామని ఫేస్ బుక్ తెలిపింది. హ్యకింగ్ విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని..హ్యాకింగ్‌ బారినపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని తెలిపింది.

జన రంజకమైన వార్తలు