ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్‌ను ప్రపంచం వ్యాప్తంగా కోట్లాది మంది వాడతారు. దాదాపు ప్రతి స్మార్ట్‌ఫోన్లోనూ ఈ యాప్ ఉండడం ఖాయం. సులభంగా యూజ్ చేసే అవకాశం ఉండడం, ఫైల్స్, ఫొటోలు, వీడియోలు పంపే అవకాశం ఉండడంతో జనం అంతా వాట్సప్ మీద పడ్డారు. అయితే దీనిలో ఎంత లాభాలు ఉన్నాయో.. అన్ని ప్రతికూల ఫీచర్లు కూడా ఉన్నాయి. ఒక్కోసారి మనకు వాట్సప్‌లో కాంటాక్ట్స్ కనిపించవు. దీనికి కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా?
ఎందుకు కనిపించవ్!
మన ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉండి కూడా చాలా కాంటాక్ట్‌లు వాట్సప్‌లో మాత్రం కనిపించవు. మీకు ఫ్రొఫైల్ ఫొటో, అబౌట్, స్టేటస్, లేకపోతో రీడ్ రిసిప్ట్, లాస్ట్ సీన్ కనిపించకపోతే మిమ్మల్ని అవతలి వాళ్లు బ్లాక్ చేశారన్ననిర్ణయానికి వచ్చేస్తారు. అయితే కేవలం వల్ల బ్లాక్ చేయడం వల్ల మాత్రమే కాకుండా వేరే కారణాల వల్ల కూడా మీకు అవతలి వాళ్ల కాంటాక్ట్స్ కనిపించకుండాపోయే అవకాశం ఉంది. ఇందుకు ఆరు కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
నోబడీకి మార్చడం
అవతలి వాళ్ల ప్రైవసీ సెట్టింగ్స్‌లో నోబాడీ మీద సెట్ చేసుకుంటే మీకు అవతలి వాళ్ల కాంటాక్ట్స్‌తో పాటు లాస్ట్ సీన్ కూడా కనిపించవు. వాళ్లు ఏ సమయంలో వాట్సప్ వాడుతున్నారన్న విషయం కూడా మీకు తెలియదు. అంతేకాదు వాళ్ల యాక్టివిటీని కూడా మీరు ట్రాక్ చేయలేరు.
మీ ప్రైవసీలో నోబడీ పెట్టుకుంటే
మీ వాట్సప్‌లో లాస్ట్ సీన్ సెట్టింగ్స్‌లో నోబడీ పెట్టి ఉంటే కూడా అవతలి వాళ్ల కాంటాక్ట్స్‌ని మీరు చూడలేరు. మీరు ఎవరీ టైమ్ స్టాంప్‌ని కూడా చూసే అవకాశం ఉండదు. ఒక పర్టిక్లర్ కాంటాక్ట్‌ని కూడా మీరు చూసే అవకాశం ఉండదు.
మీ కాంటాక్ట్స్ ఫొటో సెట్ చేసుకోకపోతే
వాట్సప్‌లో చాలామంది ప్రొఫైల్ ఫొటో పెట్టుకోరు. ఫొటో పెట్టుకోకుండానే ఈ యాప్‌ను యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా మీకు అవతలి వ్యక్తి కాంటాక్ట్ కనిపించకపోయేందుకు ఛాన్స్ ఉంటుంది. కనెక్షన్ ప్రొబ్లమ్ ఉన్నా కూడా మీకు కాంటాక్ట్స్ కనిపించకపోయే అవకాశం ఉంది. ఇంతేకాక మిమ్మల్ని అవతలి వ్యక్తలు బ్లాక్ చేసినా ఫొటో కనిపించదు.