ఓటీటీ, ఈకామర్స్ యాప్, మ్యూజిక్ ఫ్లాట్‌ఫామ్ ఇలా అనేక ప్రయోజనాలు అందిస్తున్న ఈకామర్స్ యాప్ అమెజాన్. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే వీటినన్నింటినీ ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ ఏడాదికి 999 రూపాయలు. అయితే యూత్‌ను ఆకట్టుకోవడానికి అమెజాన్ తన ప్రైమ్ మెంబర్‌షిప్ మీద 50% డిస్కౌంట్ ఇస్తుంది. 18 నుంచి 25 ఏళ్లలోపు యూత్ కోసం మాత్రమే తీసుకొచ్చిన ఈ ప్లాన్ వివరాలు చూద్దాం రండి.
అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఏడాదికి 999 రూపాయలు. యూత్ ఆఫర్ కింద దీన్ని తీసుకుంటే 500 క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. అదే మూడు నెలల ప్లాన్ రూ.329 తో తీసుకుంటే రూ.165 క్యాష్ బ్యాక్ వస్తుంది.
ముందుగా ఈ ప్లాన్ ఫుల్ అమౌంట్ పెట్టి సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. తర్వాత మీ ఏజ్ 18 నుంచి 25 ఏళ్లలోపు ఉందని చూపించే డాక్యమెంట్ సబ్మిట్ చేయాలి.
మీరు 18 నుంచి 25 సంవత్సరాలలోపు వయసు వరకు ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చు. ఇప్పటికే మీరు ఈ యూత్ ఆఫర్ కింద సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వక్కర్లేదు.
దీని వెరిపికేషన్ ప్రాసెస్ సాధారణంగా 24 గంటల్లో పూర్తవుతుంది. ఆ వెంటనే మీకు 500 రూపాయలు లేదా 165 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది.
ఈ క్యాష్‌బ్యాక్ అమెజాన్ పే అకౌంట్‌లోకి వస్తుంది. దాంతో మీరు అమెజాన్‌లో ఏదైనా కొనుక్కోవచ్చు లేదంటే అమెజాన్ పే యాక్సెప్ట్ చేసే షాపులు, సైట్లలో అయినా బిల్ పే చేయొచ్చు.