• తాజా వార్తలు

యాపిల్ వాచ్ ప్రాణాలు ఇలా కాపాడుతుంది

టెక్నాలజీతో ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనికి ఉదాహరణ ఈ ఘటనే. యాపిల్ స్మార్ట్ వాచ్ 4 ఓ 67ఏళ్ల వ్రుద్దుడికి అత్యవసర స్థితోసాయం అందేలా చేసి అతడి ప్రాణాలను కాపాడింది. ఆ వ్రద్ధుడు తన బెడ్ రూంలో టీవీ చూస్తున్నాడు. అంతలోనే సడేన్ గా హార్ట్ బీట్ ఎక్కువైంది. తనకు ఏదో జరుగుతుందని గ్రహించాడు. వెంటనే ఎమర్జెన్సీ సర్వీసుకు సమాచారం అందించాడు. ఇంట్లో ఒంటరిగానే ఉండటంతో ఆయనకు సాయం చేయడానికి పక్కన ఎవ్వరూ లేరు. గదిలోకి వచ్చిన వైద్యులు ఆ వ్రుద్దుడిని చూసి షాక్ కు గురయ్యారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి...ట్రూమాకు షిఫ్ట్ చేశారు. సూప్రవెంటిక్యూలర్ టాచీకార్డియాతో బాధపడుతున్నాడని వైద్యులు గుర్తించారు. దీంతో అతడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు అధికారులు తెలిపారు. 

యాపిల్ వాచ్ సీరీస్ 4...స్మార్ట్ వాచ్ ధరించిన యూజర్ యొక్క హార్డ్ బీట్ ను ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుంది. అంతేకాదు రోజంతా యూజర్ గుండె పనితీరును ట్రాక్ చేస్తుంది. యాపిల్ హెల్త్ అప్లికేషన్ ద్వారా శరీరానికి సంబంధించిన గణాంకాలను విశ్లేషించవచ్చు. యాపిల్ వాచ్ లో హార్డ్ బీట్ సెన్సార్ ..డేంజర్ జోన్లో ఉన్నట్లయితే...యూజరును వెంటనే అలర్ట్ చేస్తుంది. అత్యవసర చికిత్స తీసుకోనట్లయితే...SOSఫీచర్ అన్ని అత్యవసర కాంటాక్టులను అలర్ట్ చేస్తుంది. అంతే కాదు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ కు ఆటోమెటిగ్గా కాల్ చేస్తుంది. మీరు ఏ కండిషన్లో ఉన్నారో మెసేజ్ ద్వారా పంపిస్తుంది. అంతేకాదు లొకేషన్ తోపాటు మెడికల్ ఐడి బ్యాడ్జును కూడా స్క్రీన్ పై డిస్ప్లే చేస్తుంది. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై సాయం అందిస్తే బాధితులు ప్రమాదం నుంచి టెక్నాలజీ నుంచి గాయపడొచ్చు.

జన రంజకమైన వార్తలు