ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ యూజర్లకు శుభవార్త. నెలకు కేవలం రూ.129 రీఛార్జ్ చేసుకుంటే చాలు నాలుగు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు పొందే ఓ కొత్త ప్యాక్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించింది. దీని పేరు సినిమా ప్లస్. ఈప్యాక్ వివరాలు మీకోసం.
జియో, ఎయిర్‌టెల్ లాంటి ప్రైవేట్ కంపెనీలు తన బ్రాడ్ బ్యాండ్ యూజర్లను కూడా లాగేస్తుండటంతో బీఎస్ఎన్ఎల్ అలర్ట్ అయింది. తన బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లు చేజారిపోకుండా అదే టైమ్‌లో కొత్తవారిని కూడా ఆకర్షించేలా సినిమా ప్లస్ పేరుతో కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు నెలకు కేవలం రూ .129 చెల్లించి ఈ ప్యాక్ సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.
‘సినిమా ప్లస్’ ప్యాక్‌లో ఏం ఉంటుంది?
రూ.129 ప్యాక్‌లో యప్ టీవీ, జీ5, సోనీలైవ్, వూట్ అనే ఓటీటీల ప్రీమియం మెంబర్‌షిప్స్ అన్నీ లభిస్తాయి. యప్ టీవీ మెంబర్‌షిప్‌తో 100కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు చూడాఒచ్చు. అలాగే జీ5లో కూడా 500కు పైగా టీవీ సిరీస్‌లు, బోల్డన్ని సినిమాలు కూడా చూడొచ్చు. 15కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, 200 కంటే సినిమాలతో కూడిన సోనీ లైఫ్ OTT సభ్యత్వాన్ని కూడా పొందవచ్చు. ఇక వూట్ మెంబర్‌షిప్ తీసుకుంటే 35 లైవ్ టీవీ ఛానెళ్లు, 400కు పైగా సినిమాలు చూడొచ్చు. సినిమా ప్లస్ ప్యాక్‌కు సబ్‌స్క్రిప్షన్ చేసకున్నాక ఈ ఓటీటీల యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుని మొబైల్ లేదా ఆండ్రాయిడ్ టివి, అమెజాన్ ఫైర్‌టివి ప్లాట్‌ఫామ్‌లలో కూడా చూడొచ్చు.