• తాజా వార్తలు

ఇకపై మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో మీరే డిసైడ్ చేయండి

ఇక మీ ట్వీటుకి రిప్లై ఎవరు ఇవ్వాలో మీరే డిసైడ్ చేయొచ్చు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ రోజుకో కొత్త ఫీచర్ తో దూసుకొస్తోంది. లేటెస్టుగా మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో, ఎవరు ఇవ్వక్కర్లేదో మీరే నిర్ణయించుకునే ఆప్షన్ తీసుకొచ్చింది. సెలబ్రిటీస్ ఏదయినా ఒకే ట్వీట్  చేస్తే దాని మీద రకరకాలుగా ట్రోల్ జరుగుతుంటోంది. నెగటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. యీ పరిస్థితుల్లో మీ ట్వీట్ కి  రిప్లై ఎవరు  ఇవ్వాలో మీరే డిసైడ్ చేసుకోగలగడం యూజర్స్ అందరికీ మనశాంతి కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విటర్ వినియోగదారులంతా ఈ కొత్త ఫీచర్ వాడుకోవచ్చు.                                    ఎలా ఉపయోగించుకోవాలి                  1 ) మీ ఫోన్ లేదా పీసీ లో మీ ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేయండి.                     2) గ్లోబ్ ఐకాన్ టాప్ చేసి మీ  ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో సెలెక్ట్ చేయండి.  ఎవ్రీ వన్, పీపుల్ యూ ఫాలో, ఓన్లీ ద పీపుల్ యూ మెన్షన్ అనే మూడు ఆప్షన్లలో ఒకటి ఎంచుకోండి.                   3) తర్వాత మీ ట్వీట్ టైపు చేసి ట్వీట్ చెయండి.                                                  4 ) దాని కంటే ముందు కంపోజ్ స్క్రీన్లో  రిప్లైయింగ్ టూ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎవరు మీ ట్వీట్ కి రిప్లై ఇవ్వచ్చో సెలెక్ట్  చేయండి. మీ ట్వీట్ కి వాళ్ళ యూజర్ నేమ్ టైపు చేసి యాడ్ చేయండి.             5)అంతే మీ ట్వీట్ కి ఎవరు రిప్లై ఇవ్వాలో ఎవరు ఇవ్వకూడదో సెట్ చేసినట్టే.

జన రంజకమైన వార్తలు