• తాజా వార్తలు

సంగీతం స్ట్రీమింగ్ కంటే డౌన్‌లోడ్ చేయ‌డం ప‌ర్యావ‌ర‌ణానికి మంచిదట‌.. విన్నారా?

సంగీతం అంటే ఇష్టం లేని వాళ్లు దాదాపు ఉండ‌రు. అందుకే స్మార్ట్‌ఫోన్లో కంప‌ల్స‌రీగా సంగీతం యాప్‌లు ఉంచుకుంటారు. ఖాళీ దొరికిన‌ప్పుడల్లా ఈ సంగీతాన్ని ప్లే చేస్తూ ఉంటారు. అయితే ఇలా సంగీతాన్ని ఒక డివైజ్ నుంచి స్ట్రీమింగ్ చేయ‌డం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి మంచిది కాదంట. ఒక డివైజ్‌లో మ్యూజిక్ ప్లే అవుతుంటే ప‌ర్యావ‌ణానికి వ‌చ్చిన ముప్పేంటి అనే అనుమానం క‌లుగుతుందా? అయితే ఇదేంటో చూద్దాం.. 

బ్యాట‌రీ వాడ‌కం
మ్యూజిక్ ప్లే అవుతుంటే మ‌న‌కు వ‌చ్చిన న‌ష్టం మ్యూజిక్ నుంచి కాదు. మ్యూజిక్ వెనుక ఉండే సాంకేతిక‌త వ‌ల్ల‌. ఒక డివైజ్ ర‌న్ కావాలంటే బ్యాక్ గ్రౌండ్‌లో బ్యాట‌రీ న‌డుస్తుంది.. ర్యామ్ ప‌ని చేస్తుంది. నెట్ వ‌ర్క్ చేస్తుంది.. ఇవ‌న్నీ బ్యాక్ ఎండ్‌లో వ‌ర్క్ చేయ‌డం వ‌ల్లే ముందు ఫంక్ష‌నింగ్ జ‌రుగుతుంది. ఇదే మ‌న ప‌ర్యావ‌ర‌ణానికి హాని చేస్తుంద‌ట‌.  మీరు సీడీ వాడినా.. లేదా క్యాసెట్ ఉప‌యోగించినా కూడా వెనుక‌నుంచి మీకు దాన్ని న‌డిపించే కొంత శ‌క్తి కావాలి.  

ప్లాస్టిక్‌ వ‌ల్ల‌..
మ‌న డివైజ్ ర‌న్ అవుతుందంటే దాని ఉండే ప్లాస్టిక్ ప‌రిక‌రాలు కూడా ర‌న్ అవుతాయి. మ్యూజిక్ స్ట్రీమ్ అవుతున్న‌ప్పుడు ఎక్కువశాతం కార్బ‌న్ ఎమిష‌న్స్ వాడ‌కం ఎక్కువ‌గా ఉంటుంది. ముఖ్యంగా మ్యూజిక్ డౌన్‌లోడ్ చేసుకుని వాడుకుంటే కార్బ‌న్ వినియోగం మ‌రింత త‌క్కువ ఉంటుందట‌. మ్యూజిక్ వాడ‌కం వ‌ల్ల 2000 ఎస్ ఎమిటెడ్ వాడ‌కం జ‌రుగుతుంది. ఇది 157 మిలియ‌న్ కిలో గ్రాముల గ్రీన్ హౌస్ గ్యాస్‌తో స‌మానం. స్ట్రీమింగ్ చేయ‌డం  వ‌ల్ల కాక డౌన్‌లోడ్ చేసి వాడ‌డం వ‌ల్లే కార్బ‌న్ శాతం త‌క్కువ వినియోగం ఉంటుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

జన రంజకమైన వార్తలు