• తాజా వార్తలు

మ‌న వాయిస్ రికార్డ్ చేస్తే 5 డాల‌ర్లు చెల్లించ‌నున్న ఫేస్‌బుక్‌! ఇది నిజ‌మా?

ఫేస్‌బుక్ ఎక్కువ‌మంది ఉప‌యోగించే సామాజిక మాధ్య‌మం. రోజు రోజుకు ఈ సోష‌ల్ మీడియా సైట్లో ఎన్నో మార్పులు వ‌స్తున్నాయి. ఇందులో వాయిస్ బేస్డ్ సెర్చ్‌లు, వాయిస్ క‌మాండ్‌లు యుగం న‌డుస్తుందిప్పుడు. గూగుల్‌, అమేజాన్, మైక్రోసాఫ్ట్ మాదిరిగానే ఫేస్‌బుక్ కూడా ఇప్పుడు స్పీచ్‌ రిక‌గ‌నైజేష‌న్ టెక్నాల‌జీని అందిపుచ్చుకుంది. వాయిస్ బేస్డ్ యూజ‌ర్ జ‌న‌రేటెడ్ యాక్ష‌న్ల మీద దృష్టి పెట్టింది. ఇందుకోసం ఫేస్‌బుక్ సొంతగా వాయిస్ క‌మాండ్ డేటాబేస్‌ను రూపొందించింది. మ‌నం వాయిస్ రికార్డు చేస్తే 5 డాల‌ర్లు చెల్లిస్తుంద‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. మ‌రి ఇందులో నిజం ఎంత‌?

మీ వాయిస్‌కు డ‌బ్బులా?
అమేజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మాదిరిగానే ఫేస్‌బుక్ కూడా స్పీచ్ రిక‌గ‌నైజేష‌న్ కోసం వాయిస్ క‌మాండ్ డేటాబేస్ యూజ్ చేస్తుంది. క‌స్ట‌మ‌ర్ల‌కు తెలియ‌కుండా కూడా ఎఫ్‌బీ ఈ స్పీడ్ రిగక‌గ‌నైజేష‌న్ నిర్వ‌హిస్తుంది. రీసెర్చ్‌లో భాగంగా ప్రొనౌన్షియేష‌న్ పేరుతో ఫేస్‌బుక్ ఇలా స్పీచ్ రిక‌గ‌నైజేష‌న్ చేస్తోంది.  ఇందుకోసం ఆరంభంలో యూజ‌ర్ల‌కు గిఫ్ట్‌గా కొంత సొమ్ము కూడా ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఫేస్‌బుక్ చెబుతోంది. అంటే మీ వాయిస్ రిక‌గ్నేష‌న్ క‌రెక్ట్‌గా ఉంటే దానికి ఇన్ని డాల‌ర్లు ఇవ్వడం లాంటి కార్య‌క్ర‌మాలు త్వ‌ర‌లో రావొచ్చు. కానీ ఇది ఎంత వ‌ర‌కు అమ‌ల్లోకి వ‌స్తుంద‌నేది అనుమాన‌మే. 

ఏం చేయాలి?
మీరు ఈ ప్రొగ్రామ్‌కు క్వాలిఫై అయితే హే పోర్ట‌ల్ ప్రేజ్‌తో మీరు ఫేస్‌బుక్ వాయిస్ రికార్డ‌ర్ ముందు చెప్పాలి. ఆ త‌ర్వాత మీరు పేరు.. ఆ త‌ర్వాత మీ ఫ్రెండ్ లిస్టులో ఉన్న ఒక స్నేహితుల పేరు చెప్పాలి. ఆ త‌ర్వాత మ‌రో 10 స్నేహితుల పేర్లు కూడా యాడ్ చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతానికి అమెరికాలో ఈ ప్రొనౌన్షియేష‌న్ ప్రొగ్రామ్ అందుబాటులో ఉంది. అక్క‌డ 75 స్నేహితుల‌కు ఈ అవ‌కాశం  ఇస్తున్నారు. త్వ‌ర‌లో గ్లోబ‌ల్ ప్రొగ్రామ్‌గా తీసుకు రావాల‌నేది ఎఫ్బీ ఆలోచ‌న‌. 

జన రంజకమైన వార్తలు