• తాజా వార్తలు

ఫేస్ బుక్ బగ్స్ ను శోధింఛి 5 కోట్ల రూపాయలు సంపాదించిన భారత పరిశోధకులు

 800 పరిశోధకుల్లో 205 మంది భారతీయులే  

ఇండియా లోని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులకు సుమారు 5 కోట్ల రూపాయల వరకూ చెల్లించినట్లు ఫేస్ బుక్ వర్గాలు వెల్లడించాయి. ఫేస్ బుక్ తన యొక్క బగ్ బౌన్టి ప్రోగ్రాం లో భాగంగా ఈ చెల్లింపులు చేసినట్లు ప్రకటించింది.ప్రపంచం లోనే అతి పెద్ద సామాజిక మాధ్యమం అయిన ఫేస్ బుక్ ఈ స్థాయిలో పరిశోధకులకు చెల్లించడం లో ఇదే అత్యధికం అని ఫేస్ బుక్ వెల్లడించింది. సుమారు 15 కోట్ల మంది ఫేస్ బుక్ వినియోగదారులను కలిగి ఉన్న ఇండియా లో ఈ బగ్ బౌన్టి ప్రోగ్రాం కు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశోధకుల సంఖ్యా కూడా దానికి అనుపాతం  లోనే ఉంది. సుమారుగా 205  మంది సైబర్ సెక్యూరిటీ పరిశోధకులతో ప్రపంచం లోనే మన దేశం మొదటి స్థానం లో ఉన్నది.

అసలు ఈ బగ్ ఏమిటి? దాని పరిశోధన ఏమిటి? చెల్లించడం ఏమిటి?

ఏదైనా హార్డ్ వేర్ లేదా సాఫ్ట్ వేర్ యొక్క లో వచ్చే లోపాన్నే బగ్ అని అంటారు. దీనివలన ఆ ప్రోగ్రాం సరిగా పనిచేయకపోవడం లాంటివి జరుగుతాయి. అప్లికేషను సాఫ్ట్ వేర్ లో వచ్చే గందరగోళం వలన ఈ బగ్స్ అనేవి వస్తాయి. అసలు మామూలు భాషలో బగ్ అంటే ఒక చిన్న పురుగు అని అర్థం కదా! ఎలాగైతే ఈ పురుగులు అన్నింటినీ నాశనం చేస్తాయో అదేవిధంగా ఈ బగ్ కూడా సాఫ్ట్ వేర్ లేదా హార్డ్ వేర్ అప్లికేషను లను నాశనం చేస్తాయి. కంప్యూటర్ అప్లికేషను లలో అసాధారణ ఫలితాలకు ఇవి కారణం అవుతాయి. వీటివలన కంప్యూటర్ లకు అనధికారిక యాక్సెస్ లభిస్తుంది.హ్యాకర్లు ఈ బగ్ ల ద్వారా మన కంప్యూటర్ లేదా మొబైల్ లలోనికి ప్రవేశించి మన విలువైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంది. సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ఈ బగ్ లను కనిపెట్టి సదరు యాజమాన్యాలకు తెలియజేస్తూ ఉంటారు. ఆయా యాజమాన్యాలు తమ సాంకేతిక సిబ్బంది ద్వారా ఈ బగ్ లను తొలగిస్తూ ఉంటారు.వీటన్నింటినీ నిరోధించడానికి 2011  వ సంవత్సరం లో ఫేస్ బుక్ బగ్ బౌన్టి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రారంభంచిన దగ్గరినుండీ ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2400 బగ్ లను సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు శోధించగా వారికీ 4.3  మిలియన్ డాలర్ల ను ఫేస్ బుక్ ఇప్పటివరకూ చెల్లించింది.

ఈ  ప్రోగ్రాం లో పరిశోధకులు సరైన లోపాలను గుర్తించి వాటిని పేస్ బుక్ కు నివేదిస్తారు. సరైన లోపాలు (బగ్స్) గుర్తిoఛి న0దుకు గానూ పేస్ బుక్ వారికీ డబ్బు చెల్లిస్తుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 800  మంది పరిశోధకులు ఉంటె ఒక్క ఇండియా లోనే 205  మంది ఉన్నారు. వారికి ఇప్పటి వరకూ ఫేస్ బుక్ సుమారు 5 కోట్ల రూపాయల వరకూ చెల్లించింది.

జన రంజకమైన వార్తలు