జీమెయిల్.. ఈ పేరు తెలియనివాళ్లు ఇండియాలో చాలా తక్కువ మందే ఉంటారేమో. మెయిల్ అంటే జీ మెయిలే అనేంతగా ఈ గూగుల్ మెయిల్ సర్వీస్ ఫేమస్ అయింది. యూజర్ల సేఫ్టీ, సౌలభ్యం కోసం జీ మెయిల్‌లో గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త మార్పులు తీసుకొస్తూనే ఉంది. లేటెస్ట్‌గా మెయిల్‌ను ఫార్వర్డ్ చేసే అవసరం లేకుండా అటాచ్ చేసి పంపే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదేంటో చూద్దాం రండి
ఏమిటీ అటాచ్‌మెంట్?
మీరు మీ ఆఫీసర్‌కో లేదా ఫ్రెండ్‌కో మీ మెయిల్‌లో ఉన్న మల్టిపుల్ ఈమెయిల్స్ పంపాలనుకోండి. ఏం చేస్తారు? ఫార్వార్డ్ కొడతారు. అలా ఎన్ని మెయిల్స్ ఉంటే అన్నిసార్లు ఫార్వర్డ్ చేస్తారు. వాటిని అవతలి పర్సన్ ఒక్కోటీ ఓపెన్ చేసి చూసుకోవాలి. అదే మల్టిపుల్ మెయిల్స్‌ను ఒకే మెయిల్‌లో అటాచ్ చేసి పంపేస్తే చాలా బాగుంటుంది కదా.. జస్ట్ అదే కాన్సెప్ట్‌తో గూగుల్ కొత్తగా ఈమెయిల్‌ను అటాచ్ చేసి పంపే ఫీచర్‌ను తీసుకొచ్చింది. జీ సూట్ అప్‌డేట్స్ తన బ్లాగ్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాదు మొత్తం మీరు అటాచ్ చేసిన ఈమెయిల్స్ సమ్మర్ కూడా రాసి పంపొచ్చు.
ఫార్వర్డ్ యాజ్ అటాచ్‌మెంట్‌ను ఎనేబుల్ చేసుకోవడం ఎలా?
* ఈ ఫీచర్‌ను ఫార్వర్డ్ యాజ్ అటాచ్‌మెంట్ అని పిలుస్తున్నారు.
* దీన్ని ఎలా వాడాలంటే జీమెయిల్‌లో టాప్‌లో ఉన్న త్రీడాట్ మెనూను క్లిక్ చేస్తే వచ్చే ఆప్షన్లలో Forward as attachment ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ మల్టిపుల్ ఈమెయిల్స్‌ను ఒకే మెయిల్‌లో అటాచ్ చేసి పంపొచ్చు. లేదంటే డ్రాఫ్ట్స్‌లోకి వెళ్లి మీరు పంపాల్సిన మెయిల్స్‌ను అందులోకి డ్రాగ్ చేసి పంపొచ్చు.
* మీరు ఇలా ఈ మెయిల్‌ను అటాచ్‌మెంట్‌గా మెయిల్ చేస్తే అది .eml fileగా వెళుతుంది.
* .eml fileను క్లిక్‌చేస్తే కొత్త విండోలో మెయిల్ ఓపెన్ అవుతుంది.
* ఒక ఈ మెయిల్‌లో మీరు ఎన్ని ఈమెయిల్స్ అయినా అటాచ్ చేసి పంపొచ్చు.