స్మార్ట్‌ఫోన్లు వాడేవారికి వారి గూగుల్ అకౌంట్‌తో లింక్ అయి ఉన్న డివైస్‌లో తీసిన ఫొటోలన్నీ గూగుల్ డ్రైవ్‌లోనూ, గూగుల్ ఫొటోస్‌లోనూ స్టోర్ అవుతాయి. గూగుల్ డ్రైవ్ 15జీబీ వరకు ఫ్రీ స్టోరేజ్ ఇస్తుంది. అయితే గూగుల్ ఫోటోస్‌లో మాత్రం అన్‌లిమిటెడ్ స్టోరేజ్ ఉచితం. అయితే ఇదంతా ఇక పాత మాట. గూగుల్ ఫోటోస్‌లో కూడా అన్‌లిమిటెడ్ ఫ్రీ స్టోరేజ్ ఆఫర్ ముగిసిపోతోంది. దీనిలో కూడా 15జీ స్టోరేజ్ మాత్రమే ఉంటుంది. ఇకపై ఎక్కువ స్టోరేజ్ కావాలంటే ఐ క్లౌడ్, గూగుల్ డ్రైవ్ మాదిరిగానే ప్రతి నెలా కొంత డబ్బులు కట్టాల్సిందే.
100 జీబీకి నెలకు రూ.169
15జీబీ స్టోరేజ్‌ను మీరు రీచ్ అవుతుంటే మీకు టైమ్ టూ టైమ్ గూగుల్ అలర్ట్స్ ఇస్తుంది. అది నిండిపోతే మీరు నెలకు 100 జీబీ స్టోరేజ్ కోసం 169 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అయితే గూగుల్ పిక్సెల్ ఫోన్ల యూజర్లకు మాత్రం గూగుల్ ఫోటోస్ అన్‌లిమిటెడ్ ఫ్రీ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది.
మీరు ఫ్రీ స్టోరేజ్ పూర్తవడానికి ఇంకా ఎంత దూరంలో ఉన్నారు, మీరు ఇంకెంత సమయంలో దాన్ని రీచ్ అవుతారో కూడా గూగుల్ ఫోటోస్ సెట్టింగ్‌లోకి వెళ్లి చూసుకోవచ్చు.
జూన్ నుంచి పేమెంట్
ప్రస్తుతానికి గూగుల్ ఫోటోస్‌లో అన్‌లిమిటెడ్ స్టోరేజ్ ఉచితమే. అయితే 2021 జూన్ తర్వాత పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమవుతుంది. పెయిడ్ అవసరం లేదనుకుంటే ఇప్పటికే ఉన్న స్టోరేజ్‌ను ఏదైనా హార్డ్‌డిస్క్‌లోకి బ్యాకప్ తీసుకుని ఫోటోస్‌లో ఉన్న స్టోరేజ్‌ను క్లియర్ చేస్తే ఫ్రీ స్టోరేజ్ లిమిట్‌తోనే నడిపించవచ్చు. అంతేకాదు వాట్సాప్ ఇమేజ్‌లు, మెసేజ్‌లు, వీడియోలు కూడా గూగుల్ ఫోటోస్‌లో సేవ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటివి ఏవైనా ఉన్నా డిలీట్ చేస్తే స్టోరేజ్ మిగులుతుంది.