• తాజా వార్తలు

సోషల్‌ మీడియా వినియోగంలో నాలుగో స్థానంలో హైదరాబాద్‌


పొద్దున్న లేచింది మొదలు.. మళ్లీ నిద్రపోయే వరకు క్షణం కూడా గ్యాపివ్వకుండా చేసే పనేదైనా ఉందంటే అది సోషల్ మీడియాలో ఉండడమనే చెప్పాలి. ప్రస్తుతం చిన్నాపెద్దా తేడా లేకుండా అందరికీ ఇదే పనిగా మారిపోయింది. హైదరాబాద్ ప్రజలు కూడా ఈ విషయంలో బాగా ఫాస్ట్ గా ఉన్నారట. గ్రేటర్‌ హైదరాబాద్ సిటిజన్లు ప్రధానంగా రెండు సైట్లకే అధిక సమయం కేటాయిస్తున్నారట. వాట్సాప్, ఫేస్‌బుక్‌లే ఎక్కువగా మహానగర వాసుల మనసు దోచుకుంటున్నాయట.

ఫస్ట్ ప్లేసులో బెంగుళూరు


సోషల్‌మీడియా ట్రెండ్స్‌ అనే సంస్థ జరిపిన అధ్యయనంలో మెట్రో సిటీల్లో సోషల్ మీడియా వాడకం ఎలా ఉందన్నది తెలిసింది. సోషల్‌ మీడియా వినియోగంలో దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల తీరును పరిశీలిస్తే హైదరాబాద్‌ నాలుగో స్థానంలో నిలిచింది. తొలి మూడు స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ, ముంబై మహానగరాలు ఉణ్నాయి. ఐదో స్థానంలో చెన్నై, ఆరో స్థానంలో కోల్‌కతా నిలిచాయి.

యువతే ఎక్కువ


కోటి జనాభాకు చేరువైన హైదరా బాద్‌ మహానగరంలో సుమారు 40 లక్షల మంది సామాజిక మాధ్యమాలను వినియో గిస్తున్నట్టు ఈ సర్వే అంచనా వేసింది. సామాజిక మాధ్యమాల్లో అత్యధిక సమయం గడుపుతున్న సిటిజన్లలో 18–35 ఏళ్ల వయసు వారే అధికంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. మిగతా వయసుల వారూ ఈ మాధ్యమాలను వినియోగి స్తున్నా.. యువత మాత్రం నిత్య జీవితంలో చోటుచేసుకునే ప్రతి అంశాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకునే విషయంలో ముందున్నారు.

2 గంటలు దాటితే ఇబ్బందే..


నిత్యం రెండు గంటలకంటే అధిక సమయం సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నవారు మానవ సంబంధాలకు దూరమవుతున్నారని ఈ సర్వే తేటతెల్లం చేసింది. రోజుకు అరగంటపాటు సోషల్‌ సైట్లతో సావాసం చేస్తే ఎలాంటి నష్టాలూ ఉండవని నిపుణులు చెపుతున్నారు. అధిక సమయం సోషల్‌ సైట్లలో గడిపేవారు కుంగుబాటు, బయటి వ్యక్తులతో కలవక పోవడం, ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడడం వంటి మానసిక అవలక్షణాలకు గురవుతారని అంటున్నారు.

జన రంజకమైన వార్తలు