• తాజా వార్తలు

వాట్సాప్ లో ఈ ఫేక్ వెరిఫికేషన్స్ క్లిక్ చేశారా, మీ అకౌంట్ లాక్ అయిపోవడం ఖాయం

 

వాట్సాప్....ఈ పదం ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తోన్న ఏకైక పదం. ఉదయం లేచింది మొదలు...రాత్రి పడుకునేంత వరకు వాట్సాప్ నే కలవరిస్తుంటారు. గుడ్ మార్నింగ్ అని ఒకరు పెడితే...మరొకరు గుడ్ నైట్ అంటూ ముగిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు మన వాట్సాప్ అకౌంట్ ఫేక్ న్యూస్ తోపాటు ఆఫర్ల పేరుతో కొన్ని మెసేజులు లింకులు వస్తుంటాయి. మనకు తెలియకుండానే ఆ లింక్స్ ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. మీరు హ్యాకర్ చేతికి చిక్కినట్లే. హ్యాకర్ల భారీ నుంచి తప్పించుకోవడానికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనే సర్వీసు కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకమాటలో చెప్పాలంటే వాట్సాప్ ను హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు. కానీ కొన్ని సందర్భాల్లో వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్ అవుతున్నట్లు గల్ఫ్ న్యూస్ వెల్లడించింది.  

 

UAE టెలికమ్యూనికేషన్స్ అథారిటీ ట్విట్టర్ లో వాట్సాప్ యూజర్ల కోసం ఒక సలహా ఇచ్చింది. యూజర్లు వెరిఫికేషన్ కోడ్ ను ధ్రువీకరించక మేసేజ్ లకు రిప్లే ఇవ్వరాదని హెచ్చరించింది. ఇలా చేయడం ద్వారా చాలా వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ కు గురయ్యాయని పేర్కొంది. ఒక ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజులో వాట్సాప్ ను ఇన్స్ స్టాల్ చేసినప్పుడు మీరు ఫోన్ నెంబర్ కు వాట్సాప్ చెక్ చేయడానికి కన్ఫర్మేషన్ కోడ్ ను వస్తుంది. ఈ సందర్భంలోనే స్కామర్ మీకు ఒక వాట్సాప్ కోడ్ తోపాటు లింక్ కూడా సెండ్ చేస్తారు. అయితే ఈ వెరిఫికేషన్ కోడ్ ఆరు అంకెలతో ఉండదు. 

స్కామర్ పంపించిన లింక్ పై క్లిక్ చేసినట్లయితే...మీరు వాట్సాప్ అకౌంట్ మీ చేతుల్లో ఉండదు. స్కామర్ మీ వాట్సాప్ మెసేజ్ లన్నింటిని హ్యాకింగ్ చేస్తుంది. గల్ఫ్ న్యూస్ కు TRAజారీ చేసిన స్టేట్ మెంట్ ప్రకారం, మొబైల్ యూజర్లు SMS ద్వారా పంపిన వెరిఫికేషన్ కోడ్ను షేర్ ఇతరులకు షేర్ చేయకూడదు. లేకపోతే వారి అకౌంట్ హ్యాక్ అవుతుంది. చాలా వాట్సాప్ అకౌంట్లు ఈ విధంగానే హ్యాకింగ్ గురైనట్లు వెల్లడించింది. ఇక హ్యాకర్లు ఇంగ్లీష్ తోపాట్ ఫ్రెంచ్ భాషలలో ఫేక్ మెసేజ్ లను పంపిస్తుంటారు. ఇండియాలోని వాట్సాప్ యూజర్లకు కూడా ఈతరహా ఫేక్ మెసేజ్ లు వస్తుంటాయని నివేదికలో పేర్కొంది. 

జన రంజకమైన వార్తలు