వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ ఇంటా బయటా కూడా దుమారం లేపేస్తోంది. ఇప్పటికే ఇండియాలో యూజర్లు దీనిమీద మండిపడుతున్నారు. కొంతమంది వాట్సాప్‌ను పక్కనపెట్టేసి ఆల్రెడీ సిగ్నల్ యాప్‌కు మారిపోయారు. దీంతో ఫిబ్రవరి 8 లాస్ట్‌డేట్ తమ కొత్త ప్రైవసీ పాలసీ అంగీకరించడానికి అని ముందు చెప్పిన వాట్సాప్ ఆ డేట్‌ను పోస్ట్‌పోన్ చేసింది. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీ మీద సీరియస్ అయింది. దీన్ని వెనక తీసుకోవాలని కేంద్ర ఐటీ శాఖ ఏకంగా వాట్సాప్ సీఈవో విల్ క్యాత్‌కార్ట్‌కు లెటర్ రాసేసింది కూడా.
లెటర్‌లో ఏమందంటే..
* వాట్సాప్, ఫేస్‌బుక్‌లకు ఇండియాలోనే అత్యధిక యూజర్లు ఉన్నారు. మీ సంస్థలకు ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఇండియానే.
* మా దేశంలో 40 కోట్ల మంది యూజర్ల డేటాను సేకరిస్తే.. అది దేశంలోని చాలా మంది పౌరుల ప్రైవసీకి భంగం కలిగించినట్లే అవుతుంది.
* వాట్సాప్ ఇండియన్ యూజర్ల డేటా ప్రైవసీని, డేటా సెక్యూరిటీని గౌరవించాలి.
* వినియోగదారులకు అప్షన్ ఇవ్వకుండా ఏకపక్షంగా రూల్స్ పెట్టడం సరికాదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం.
* 'కొత్త ప్రైవసీ పాలసీని అంగీరిస్తున్నాను' అనే ఒక్క ఆప్షన్ మాత్రమే ఇచ్చారని.. యూరోపియన్ దేశాల్లో 'అంగీకరించను' అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఆ ఆప్షన్ మన దేశంలో ఎందుకు ఇవ్వలేదని వాట్సప్‌ను ప్రశ్నించింది.
* నిబంధనలను అంగీకరించకపోతే వాట్సాప్ అకౌంట్‌ను తొలగిస్తామనే సందేశాన్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ సీరియస్‌గా తీసుకుంది.
* ప్రైవసీ పాలసీ విషయంలో ఇటీవల చేసిన మార్పులను వెంటనే వెనక్కి తీసుకోండి అని గట్టిగా చెప్పింది. . అంతేకాదు
డేటా షేరింగ్ ప్రోటోకాల్స్, వ్యాపార పద్ధతుల గురించి మరిన్ని వివరాలను కోరుతూ వాట్సాప్‌కు ఏకంగా ఓ ప్రశ్నపత్రాన్ని పంపింది.
వాట్సాప్ వెనక్కితగ్గాల్సిందే
ఇప్పటికే కొత్త ప్రైవసీ పాలసీపై యూజర్ల నుం చి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక తల్లకిందులవుతున్న వాట్సాప్‌కు ఇప్పడు గవర్నమెంట్ వార్నింగ్‌తో మరింత ఇబ్బందికర పరిస్థితే. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ప్రైవసీ పాలసీ అమల్లోకి వస్తుందన్న వాట్సప్ యూజర్లు తమ యాప్‌ను పక్కన పెట్టేస్తుండటంతో వెంటనే ఆ డేట్‌ను పోస్ట్ పోన్ చేసింది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంటే లెటర్ రాయడంతో వాట్సాప్ ఇప్పుడు కొరివితో తలగోక్కున్నామా అని ఆలోచిస్తోంది. కాదూ కూడదని ముందుకెళితే ఇండియా లాంటి పెద్ద మార్కెట్‌లో దెబ్బ తింటామని వాట్సాప్‌కు ఇప్పటికే తెలిసొచ్చింది. కాబట్టి ప్రైవసీ పాలసీని వాట్సాప్ ఇక కోల్ట్ స్టోరేజ్‌లో పెట్టేయడం ఖాయమే అనిపిస్తోంది.