• తాజా వార్తలు

టిక్‌టాక్ వినియోగ‌దారుల్లో 40% మందిని ప‌ట్టేసిన ఇండియ‌న్ యాప్స్


టిక్‌టాక్‌ను చైనా కంపెనీ అని ప్ర‌భుత్వం జూన్ నెల‌లో నిషేధించింది. అప్ప‌టి నుంచి దేశీయ షార్ట్ వీడియో మేకింగ్ యాప్స్ ఊపందుకున్నాయి.  చింగారీ, రోపోసో, ఎంఎక్స్ ట‌కాట‌క్‌, మోజ్ లాంటి యాప్‌లు ఇప్పుడు మార్కెట్‌లో ముందుకొచ్చాయి. బ్యాన్ చేయ‌డానికి ముందు టిక్‌టాక్‌కు ఎంత మంది యూజ‌ర్లున్నారో అందులో 40%  వాటాను మ‌న కంపెనీలు ఇప్పుడు ద‌క్కించుకున్నాయి. రెడ్‌సీర్ కంపెనీ రిలీజ్ చేసిన తాజా రిపోర్ట్ ప్ర‌కారం మ‌న షార్ట్ వీడియో మేకింగ్ యాప్స్ ఎంత మంది యూజ‌ర్ల‌ను క‌లిగి ఉన్నాయో చూద్దాం.  

జోష్ యాప్ జోష్ 
డైలీ హంట్ వారి జోష్  యాప్ మంత్లీ యావ‌రేజ్ యూజ‌ర్లు 7 నుంచి 7.5 కోట్ల మంది ఉన్నారు. ఇక దీన్ని రోజూవాడేవారు 3 నుంచి మూడున్న‌ర కోట్ల‌మంది.  ఈ లిస్ట్‌లో ఇదే టాప్‌.  

రోపోసో  సెకండ్ 
ఈ లిస్ట్‌లో రెండో స్తానంలో ఉంది రోపోసో యాప్‌. ఈ యాప్ మంత్లీ యావ‌రేజ్ యూజ‌ర్లు 6 నుంచి 6.5 కోట్ల మంది ఉన్నారు. ఇక దీన్ని రోజూవాడేవారు కోటి 20 ల‌క్ష‌ల నుంచి కోటిన్న‌ర మ‌ధ్య‌లో ఉన్నారు.  

ఎంఎక్స్ ట‌కాట‌క్‌.. థ‌ర్డ్ ప్లేస్‌
ఇక ఎంఎక్స్ ట‌కాట‌క్ యాప్ మూడో స్థానంలో ఉంది. ఈ యాప్ మంత్లీ యావ‌రేజ్ యూజ‌ర్లు 5 నుంచి 6 కోట్ల మంది ఉన్నారు. ఇక దీన్ని రోజూవాడేవారు 2 కోట్ల  నుంచి రెండున్న‌ర కోట్ల మంది దీన్ని వాడుతున్నారు.  

ఇక మోజ్‌, మిట్రాన్‌, ట్రెల్‌, చింగారీ వంటి యాప్‌ల‌న్నీ క‌లిసి నెల‌కు 1 కోటీ 70 ల‌|క్ష‌ల మంది యూజ‌ర్ల‌ను క‌లిగి ఉన్నాయి.

జన రంజకమైన వార్తలు