• తాజా వార్తలు

యాహూలో పురుషులపై లింగ వివక్షా? ఇది మహిళా సాధికారతా? లేక వివక్ష యేనా?

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ అయిన యాహూ లో లింగ వివక్ష కొనసాగుతుందా? అది కూడా పురుషులపై! పురుష ఉద్యోగులను అక్రమంగా ఉద్యోగాలనుండి తీసేస్తున్నారా? వారికి ప్రమోషన్ లు ఇవ్వడం లేదా? ఉన్నత పదవులకు యాహూలో మగవాళ్ళు పనికి రారా? మెరిసా మేయర్ పురుష ద్వేషా?

అవుననే అంటున్నారు యాహూ కి చెందిన కొంతమంది పురుష ఉద్యోగులు. యాహూ లో ఉన్నత స్థాయి పదవులనుండి పురుషులను అక్రమంగా తొలగిస్తున్నారని అంటూ యాహూ సీఈఓ అయిన మెరిసా మేయర్ పై యాహూ కి చెందిన మీడియా ఎక్జిక్యూటివ్ ఒకరు గత సంవత్సరం కోర్ట్ లో దావా వేశారు. తాజాగా స్కాట్ ఆర్ద్ అనే యాహూ కి చెందిన సీనియర్ ఎడిటోరియల్ డైరెక్టర్ కూడా యాహూ పోకడలకు వ్యతిరేకంగా కాలిఫోర్నియా లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ఒక దావా వేసారు. యాహూ కంపెనీ ఫెడరల్ పౌర హక్కుల ఉల్లంఘన కు పాలుపడుతుందనీ ఉద్యోగుల నియమ నిభందనలను తుంగలో తొక్కుతుందంటూ ఆక్షేపించారు. యాహూ అధికార ప్రతినిధి అయిన కారోలిన్ క్లార్క్ మాత్రం ఈ వాదనలను కొట్టి పారేస్తున్నాడు.

యాహూ పై లింగ వివక్ష ఆరోపణలు రావడం ఇదేమీ కొత్త కాదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ సంవత్సరం లో ఇది రెండవ ఫిర్యాదు. సిలికాన్ వాలీ లో ఉన్న కంపెనీలన్నింటిలో యాహూ లోనే ఎక్కువ మంది మహిళా ఎక్జిక్యూటివ్ లు ఉన్నట్లు వీరు చెబుతున్నారు. అదికాక యాహూ సీఈఓ అయిన మెరిసా మేయర్ కూడా మహిళే కదా! స్కాట్ ఆర్ద్ చెబుతున్న దాని ప్రకారం ఈయన 2011 లో యాహూ లో జాయిన్ అయ్యారు. మెరిసా మేయర్ తన త్రైమాసిక పెర్ఫార్మన్స్ రివ్యూ లు ప్రకటించే నాటికి మంచి పాజిటివ్ పెర్ఫార్మన్స్ రివ్యూ లను కలిగి ఉన్నాడు. కానీ మేయర్ అతనికి అతి తక్కువర్యాంక్ ఇచ్చింది. ఇది అతనిని అసంతృప్తికి గురిచేసింది. కానీ పెర్ఫార్మన్స్ లో తన కంటే తక్కువ గా ఉన్న మహిళలకు మాత్రం మంచి ర్యాంకు లు ఇచ్చినట్లు అతను పేర్కొన్నాడు.యాహూ యొక్క ఉద్యోగ నిభందనల ప్రకారం ఇది తప్పు. US పౌరహక్కుల చట్టం 1964 ప్రకారం ఇది నిబందనల ఉల్లంఘనే అని ఆయన ఆరోపిస్తున్నాడు.

ఇదే కారణంతో 30 రోజుల వ్యవధిలో 50 మంది పురుష ఉద్యోగులను యాహూ తీసేసినట్లు అతను చెబుతున్నాడు. అంతేగాక యాహూ యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయిన క్యాతీ సావిట్ యాహూ యొక్క రిక్రూట్మెంట్ లలో అంతర్జాతీయంగా టాలెంట్ ను బట్టి గాక లింగాన్ని బట్టి ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి అతను ఒక ఉదాహరణ కూడా చూపిస్తున్నారు. యాహూ లో ఉన్న 16 మంది సీనియర్ స్థాయి ఎడిటోరియల్ ఉద్యోగులలో 14 మంది మహిళలే కావడం విశేషం. గత ఫిబ్రవరి మాసంలో యాహూ ఆటోస్ మేనేజింగ్ ఎడిటర్ అయిన గ్రెగరీ అండర్ సన్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేయడం గమనార్హం.

నిజంగా ఇది లింగ వివక్ష యేనా? లేక మహిళా సాధికారతా?

 

జన రంజకమైన వార్తలు