సోషల్ మీడియాను రాజకీయాల్లో బాగా వాడుతున్న వ్యక్తుల్లో మన ప్రధాని నరేంద్ర మోడీ టాప్‌లో ఉంటారు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అన్నింటిలోనూ ఆయనదే హవా. తాజాగా ట్విటర్‌లో ఆయన మరో రికార్డ్ సెట్ చేశారు. ఏకంగా 6 కోట్ల మంది ఫాలోయర్స్‌తో అత్యధిక మంది ఫాలో అవుతున్న ఇండియన్‌గా నిలిచారు.
గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే ట్విటర్
వాస్తవానికి ట్విటర్‌ను ఇండియాలో అందరికంటే ముందు నుంచే వాడుతున్న రాజకీయ నేతల్లోనూ ఆయన ముందుంటారు. 2009లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే ఆయన ట్విటర్ వాడటం ప్రారంభించారు. తర్వాత రెండుసార్లు ప్రధాని కావడంతో ఆయన క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది. దానికి తగ్గట్లే ఆయన ట్విటర్ ఫాలోయర్స్ కూడా పెరుగుతున్నారు. మోడీ ఇన్‌స్టాలోనూ టాపే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు కోటిన్నర మంది ఫాలోయర్లున్నారు.
వరల్డ్ నెంబర్ 3
ట్విటర్‌లో అత్యధిక ఫాలోయర్లున్న రాజకీయ నేతల్లో మన మోడీది మూడోస్థానం. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 12 కోట్ల ఫాలోయర్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. సెకండ్ ప్లేస్ 8 కోట్ల మంది ఫాలోయర్లతో ట్రంప్‌ది. ఇక మూడో స్థానం 6 కోట్ల ఫాలోయర్లతో మన ప్రధాని మోడీది.