• తాజా వార్తలు

డిసెంబ‌ర్ 5,6 తేదీల్లో నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా చూడొచ్చు.. అస‌లు క‌థేంటి?

నెట్‌ఫ్లిక్స్‌.. ఓటీటీల గురించి ఏ మాత్రం తెలిసిన వారికైనా దీని గురించి సెప‌రేట్‌గా చెప్ప‌క్క‌ర్లేదు. వ‌రల్డ్ నెంబ‌ర్ వ‌న్ ఓటీటీ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో హాలీవుడ్‌, బాలీవుడ్ సినిమాలే కాదు అందులో వ‌చ్చే వెబ్‌సిరీస్‌లు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. అయితే దీని స‌బ్‌స్క్రిప్ష‌న్ ఎక్కువ కావ‌డంతో ఇండియాలో సాధార‌ణ ఓటీటీ యూజ‌ర్లు పెద్ద‌గా దీన్ని స‌బ్‌స్క్రైబ్ చేసుకోవ‌ట్లేదు. అయితే మ‌న ఓటీటీ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి నెట్‌ఫ్లిక్స్ డిసెంబ‌ర్ 5,6 తేదీల్లో ఫ్రీ స్ట్రీమింగ్ ఫెస్ట్‌ను ప్ర‌క‌టింది.

ఏంటీ స్ట్రీమింగ్ ఫెస్ట్‌?
స్ట్రీమింగ్ ఫెస్ట్ అంటే ఆరెండు రోజులు నెట్‌ఫ్లిక్స్ అంద‌రికీ ఫ్రీ.   డిసెంబర్ 5న తెల్లవారుజామున 12.01 నుండి డిసెంబర్ 6న రాత్రి 11.59 గంటలకు వరకు నెట్‌ప్లిక్స్‌లోని కంటెంట్‌ను ఎవ‌రైనా ఉచితంగా చూడొచ్చు. స‌బ్‌స్క్రిప్ష‌న్ అక్క‌ర్లేదు.  సినిమాలు, వెబ్‌ సిరీసులు, భారతీయ భాషల్లో కంటెంట్‌ను చూడొచ్చని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.  మొబైల్ నెంబ‌ర్‌, ఈమెయిల్ ఐడీ ఉంటే చాలు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్  డిటెయిల్స్ కూడా ఎంట‌ర్ చేయ‌క్క‌ర్లేదు.

ఎందుకు ఈ ప్ర‌య‌త్నం
ఇండియాలో 70 కోట్ల మంది ఇంట‌ర్నెట్ యూజ‌ర్లున్నారు. సంఖ్యాప‌రంగా చూస్తే మ‌న‌ది ప్ర‌పంచంలో రెండో అతిపెద్ద ఇంట‌ర్నెట్ వినియోగ దేశం. కాబ‌ట్టి ఇక్క‌డ మార్కెట్ పెంచుకోవాల‌ని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. యూజ‌ర్లు ఒక్క‌సారి త‌మ కంటెంట్ చూస్తే వారిని ఆక‌ట్టుకోవ‌చ్చ‌ని భావించి ఈ ఫెస్ట్ నిర్వ‌హిస్తోంది. చూద్దాం నెట్‌ఫ్లిక్స్ ప్ర‌య‌త్నం ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో!!!

జన రంజకమైన వార్తలు