వాట్సప్ గ్రూప్.. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు మనం ఈ గ్రూపులను ఫాలో అవుతూనే ఉంటాం. ఈ గ్రూపుల విషయంలో మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఏదో వాడేస్తుంటాం కానీ ఈ గ్రూపులు వాడకంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో వాట్సప్ గ్రూప్ చాటింగ్ మనకు తెలియకుండానే బయటకు వచ్చేస్తే... చాలా ఇబ్బందులు ఉంటాయి కదా.. కానీ ప్రైవేట్ గ్రూప్ చాట్స్ గూగుల్ సెర్చ్‌లో వచ్చేస్తున్నాయంట...ఇది నిజమేనా?
పబ్లిక్‌గా వచ్చేస్తున్నాయ్
ఇలా ప్రైవేట్ గ్రూప్ చాట్‌లు గూగుల్ సెర్చ్ రిజల్ల్స్‌లో వచ్చేస్తుండడంతో ఈ కంపెనీ వెంటనే సెర్చ్ రిజల్ట్స్‌ను మోడిఫై చేసింది. వాట్సప్ గ్రూప్ చాట్ ఇన్విటేషన్లను ఇండెక్స్ చేసింది. చాట్ ఇన్వైట్ చాట్ లింక్స్ పబ్లిక్‌గా షేర్ అవుతున్నాయి. ఈ గ్రూపుల్లో ఎవరైనా ఎంటర్ కావొచ్చు. ప్రైవేట్ గ్రూప్ లింక్స్ ఇంటర్నెట్‌లో దొరికేస్తున్నాయి. దీంతో ఎవరైనా చాట్స్‌లోకి ఎంటర్ కావొచ్చు. ఇలాంటివి 470000 రిజల్ట్స్ ఉన్నాయి. ఇలాంటి పబ్లిక్ చానల్స్ ద్వారా లభిస్తున్నాయి. ఇన్వైట్ లింక్స్ పబ్లిక్‌గా పోస్ట్ చేస్తున్నారు.
పోర్న్ షేరింగ్ కూడా..
ఈ లింక్స్ ద్వారా చాటింగ్ గ్రూప్‌లోకి వెళితే ఫర్వాలేదు కానీ కొన్ని చాట్స్ మరీ అభ్యంతరకరంగా ఉంటున్నాయి. వీటిలో అశ్లీలమైన సైట్లు కూడా ఉన్నాయి. వాటి గ్రూప్స్‌లోకి ఇన్వైట్ చేయడం కోసం కూడా ఈ లింక్స్‌ను అన్‌లైన్‌లో పెడుతున్నారు. వీటిని క్లిక్ చేయడం ద్వారా ఆయా పోర్న్ సైట్లలోకి వెళుతున్నారు. ఇవి పిల్లలకు ప్రమాదకరంగా మారాయి. పిల్లల పోర్న్ ప్రస్తుతం పెద్ద ప్రాబ్లమ్‌గా ఉంది. వాట్సప్ ఈ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడానికి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. దీని కోసం ఎన్నో సార్లు రిపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే వాట్సప్ 250000 అకౌంట్లను బ్యాన్ కూడా చేసింది.