• తాజా వార్తలు

టిక్ ‌టాక్‌ను కొనేయబోతున్న రిలయన్స్ .. నిజమెంత ?

 చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య జాతీయ భద్రత, డేటా ప్రైవసీకి సమస్యగా మారుతున్నాయని  చైనాకు చెందిన 58 యాప్ లను జూన్ 29న భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిలో చాలా సక్సెస్ అయిన టిక్ టిక్ కూడా ఉంది. మిగిలిన యాప్స్ ఎలా ఉన్నా టిక్ టాక్ మాత్రం అప్పటినుంచి వార్తల్లోనే ఉంటోంది. ఫలానా కంపెనీ టిక్‌టాక్‌ను కొనేస్తుందట.త్వరలో టిక్ టాక్ మళ్ళీ వచ్చేస్తుందంటూ రోజుకో వార్త షికారు చేస్తోంది. ఇప్పుడు ఆ లిస్టులో రిలయన్స్ పేరు చేరడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయడానికి టిక్ టాక్ యజమాన్య సంస్థ బైట్ ‌డాన్స్ తో చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  మొత్తం ఇండియా వ్యాపారాన్ని రిలయన్స్ కు విక్రయించేందుకు టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ మేయర్, ఆర్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించినట్లు తెలిసింది. రెండు కంపెనీల మధ్య జూలైలో చర్చలు ప్రారంభమైనాయనీ, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని టెక్ క్రంచ్ నివేదించింది. అయితే వీటిపై  వ్యాఖ్యానించడానికి రిలయన్స్ నిరాకరించింది.                          నిజంగానే కొంటుందా?            ప్రస్తుతానికి దీనిపై రిలయన్స్ నోరు మెదపట్లేదు. కానీ టిక్ టాక్ కి ఉన్న వ్యాపార కోణం చూసి ఈ ప్రపోసల్ తీసుకొస్తే మాత్రం అంబానీ ఓకే అనొచ్చు. అయితే ప్రభుత్వం బ్యాన్ చేసిన యాప్ ను తిరిగి తెర మీదకు తేవడానికి రిలయన్స్ ఎంతవరకు ముందుకొస్తుందో చూడాలి.

జన రంజకమైన వార్తలు