• తాజా వార్తలు

ఇప్పుడిక 57 వేల ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను చిటికెలో గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేయ‌చ్చు?

ప‌బ్లిక్ టాయిలెట్స్.. ఈ ప‌దం విన‌డ‌మే కానీ మ‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎక్క‌డా క‌న‌బడ‌వు.. దీంతో బ‌య‌ట ఎక్క‌డ అవ‌కాశం దొరికితే అక్క‌డే ప‌ని కానిచ్చేస్తుంటారు. కానీ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో 50 వేల‌కు పైగా ప‌బ్లిక్ టాయిలెట్లు ఉన్న సంగ‌తి చాలామందికి తెలియ‌దు. మ‌రి టాయిలెట్లు ఎక్క‌డ ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి? ఇందుకోసం టెక్నాల‌జీ సాయం చేస్తుంది. మ‌రి అదెలాగో చూద్దామా..

2300 న‌గ‌రాల్లో..
భార‌త్‌లోని 2300 న‌గ‌రాల్లో ఉన్న దాదాపు 57 వేల పబ్లిక్ టాయిలెట్ల‌ను సెర్చ్ చేయ‌డం కోసం టెక్నాల‌జీ సాయం చేస్తోంది. ఇందుకోసం మీకు గూగుల్ మ్యాప్స్ సాయం చేస్తోంది. ముందుగా మీరు వాయిస్ క‌మాండ్ ద్వారా ప‌బ్లిక్ టాయిలెట్స్ అని ఫ‌లానా ఏరియాలో సెర్చ్ చేస్తే చాలు. వాయిస్ సెర్చ్ వ‌ర్క్ ఔట్ కాక‌పోతే గూగుల్ మ్యాప్స్‌లో మీకు సంబంధించిన సిటీలో ప‌బ్లిక్ టాయిలెట్స్ నియ‌ర్ మీ అని టైప్ చేయాలి.  ఇందుకోసం ప‌బ్లిక్ టాయిలెట్స్ అని టైప్ చేసి లొకేష‌న్ టైప్ చేసి ఎంటర్ చేయాలి. 

స‌జీష‌న్స్ కూడా..
ప‌బ్లిక్ టాయిలెట్స్ క‌నుగొన్న త‌ర్వాత మీరు యూజ్ చేసిన త‌ర్వాత వాటి వాడ‌కం ఎలా ఉంది. హైజీనిక్‌గా ఉందా.. ఇంకా ఏదైనా స‌దుపాయాలు పెంచాలా.. ఎంత దూరంలో ఉన్నాయి. చాలిన‌న్నీ అవ‌స‌రాలు ఉన్నాయా లాంటి రిక్వర్మెంట్స్ ను కూడా మీరు ప‌బ్లిక్ టాయిలెట్స్ రివ్యూల్లో మీరు పంచుకోవ‌చ్చు. దీని ద్వారా మిగిలిన యూజ‌ర్ల‌కు ఉప‌యోగంగా ఉంటుంది. అంతేకాదు ప‌బ్లిక్ టాయిలెట్స్‌ని మ‌రింత మెరుగుప‌రుచుకునే అవ‌కాశం వస్తుంది. 

జన రంజకమైన వార్తలు